ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 20 నుంచి వారం రోజులపాటు ఈ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరిగినట్లు సమాచారం. సభలో ప్రవేశపెట్టే బిల్లుల అంశాన్ని గవర్నర్ దృష్టి సీఎం తీసుకెళ్లినట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని అంశాలతో పాటు కోనసీమ అల్లర్లపై ప్రభుత్వం …
Read More »అప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాం: కేటీఆర్
తెలంగాణ ఏర్పడిన కొత్తలో అనేక ఇబ్బందులు పడ్డామని.. పొరుగు రాష్ట్రాలతో పోటీపడి అనేక పరిశ్రమలను తెచ్చుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం అనేక ఇండస్ట్రీలు వస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను కేటీఆర్ ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తల పాత్ర కీలకమని చెప్పారు. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్.. ఈ …
Read More »చిరంజీవి ఫ్యాన్స్‌కు నాగబాబు బ్లాక్‌మెయిల్: వెలంపల్లి
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీకి పనికిరాని వ్యక్తి అని.. చిరంజీవి లేకపోతే పవన్ ఎవరికి తెలుసని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. మెగాస్టార్ లేనిదే పవర్ స్టార్ ఎక్కడని ప్రశ్నించారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ‘గడప గడపకి మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. …
Read More »నేను చెప్పింది తప్పయితే రాజీనామా చేస్తా: కేటీఆర్
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు జాతీయ హోదా ఇస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పిందని.. కానీ ఈ ఎమిదేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన.. భూత్పూర్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. వికారాబాద్-కర్ణాటక, గద్వాల-మాచర్ల మార్గాల్లో రైలు కేటాయించమన్నా చేయలేదని …
Read More »మహబూబ్‌నగర్ జిల్లాలో కేటీఆర్ టూర్.. పేరూరు లిఫ్ట్‌కి శంకుస్థాపన
మహబూబ్‌నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పథకాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా దేవరకద్ర, భూత్పూర్, కోసిగి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. దేవరకద్ర మండలం వెంకపల్లిలో రూ.55కోట్ల వ్యయంతో చేపట్టనున్న పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. వర్ని-ముత్యూలపల్లి రోడ్డుపై వంతెన, గుడిబండకు రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత భూత్పూర్ చేరుకుని మున్సిపాలిటీలో మినీ స్టేడియం నిర్మాణానికి …
Read More »అవమానాలు తట్టుకోలేకే టీడీపీకి రాజీనామా: దివ్యవాణి
గతకొంతకాలంగా టీడీపీలోని అన్ని కార్యక్రమాలకు తనను దూరం పెడుతున్నారని.. పార్టీలో అవమానాలు తట్టుకోలేకే రాజీనామా చేసినట్లు సినీనటి దివ్యవాణి తెలిపారు. టీడీపీకి రాజీనామా చేసినట్లు తొలుత వీడియో సందేశం ద్వారా ప్రకటించిన ఆమె.. గురువారం ఉదయం ప్రెస్‌మీట్ నిర్వహించి జరిగిన పరిణామాలను, తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. కనీసం ప్రెస్‌మీట్ పెట్టేందుకు కూడా ఎవరూ తనకు సహకరించలేదన్నారు. ఈ విషయాలపై చంద్రబాబును కలిసి వివరిద్దామనుకున్నా ఆయన్ను కలవనివ్వలేదని చెప్పారు.
Read More »వైసీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెన్షన్
మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సెంట్రల్ ఆఫీస్‌ఓ ప్రకటనలో వెల్లడించింది. పార్టీ అధినేత, సీఎం జగన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ సెంట్రల్ ఆఫీస్ పేర్కొంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చి ఫిర్యాదులు.. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నరసాపురం నియోజకవర్గంలో గత కొద్దిరోజులుగా అక్కడి వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజుతో …
Read More »ఆత్మకూరు పోరు.. విక్రమ్‌రెడ్డికి బీఫారం అందించిన జగన్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేసింది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ మేరకు వైసీపీ అధినేత, సీఎం జగన్ పార్టీ తరఫున బీఫారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More »ఏపీలో అవినీతి నిరోధానికి ఏసీబీ యాప్.. ఆవిష్కరించిన సీఎం జగన్
ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిరోధించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏసీబీ రూపొందించిన ఈ యాప్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. ‘ఏసీబీ 14400’గా దీనికి నామకరణం చేశారు. ప్రభుత్వశాఖల్లో ఎవరైనా లంచం అడిగితే ఈ యాప్ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని సీఎం జగన్ చెప్పారు. ఫిర్యాదుతో పాటు తమ దగ్గర ఉన్న వీడియో, ఆడియో డాక్యుమెంట్లను ఏసీబీకి పంపొచ్చన్నారు. కంప్లైంట్ చేయగానే ఫిర్యాదుదారు మొబైల్‌కు రిఫరెన్స్ …
Read More »దావోస్ నుంచి రాష్ట్రానికి చేరుకున్న జగన్.. నేతల ఘనస్వాగతం
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో సీఎంకు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు. మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వల్లభనేని వంశీ, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సీఎంకు స్వాగతం పలికారు.
Read More »