Home / POLITICS (page 57)

POLITICS

హుస్నాబాద్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద గుడాటిపల్లి నిర్వాసితులు ధర్నాకు దిగారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూములిచ్చిన తమకు ప్యాకేజీ ఇవ్వకుండా అధికారులు ట్రయల్‌రన్‌ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో భూ నిర్వాసితులు వారిపై దాడి చేశారు. పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్‌ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

Read More »

రైతులకు మేలు చేసేందుకు దేశంతో పోటీ: జగన్‌

కోనసీమలో క్రాప్‌ హాలిడే పేరుతో రైతుల్ని కొందరు రెచ్చగొడుతున్నారని ఏపీ సీఎం జగన్‌ విమర్శించారు. గతంలో ధాన్యం బకాయిలు ఎగ్గొట్టినందుకా? ఆ బకాయిలను వైసీపీ ప్రభుత్వం తీర్చినందుకా? ఎందుకు క్రాప్‌ హాలిడే అని ప్రశ్నించారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పంటల బీమా పథకం కింద రూ.2,977కోట్ల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో సీఎం జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులకు మేలు చేసే …

Read More »

సింగిల్‌ స్టాప్‌ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌: కేటీఆర్‌

హైదరాబాద్‌ నగరానికి వస్తున్న పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. భాగ్యనగరం సింగిల్‌ స్టాప్‌ డెస్టినేషన్‌గా మారిందని.. తయారీ రంగానికి అడ్డాగా మారబోతోందని చెప్పారు. హైటెక్‌ సిటీలో జాన్సన్‌ కంట్రోల్‌కు చెందిన ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ సెంటర్‌ టీహబ్‌ హైదరాబాద్‌లో ఉందని.. ఇమేజ్‌ టవర్స్‌ను సైతం నిర్మిస్తున్నామని …

Read More »

మిగతా వాళ్లకీ బూస్టర్‌ డోసు ఇవ్వండి: కేంద్రాన్ని కోరిన మంత్రి హరీష్‌

18 ఏళ్లు నిండిన వారందరికీ గవర్నమెంట్‌ హాస్పిటళ్లలో బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హరీష్‌ మాట్లాడారు. ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 కేసులు పెరుగుతున్నందన అర్హులైన వారంద‌రికీ బూస్ట‌ర్ డోస్ ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రాష్ట్రంలోని అన్ని …

Read More »

నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం వైఎస్సారే: కొండా సురేఖ

ఈరోజుల్లో తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి దివంగత సీఎం, ప్రజానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వల్లేనని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆర్జీవీ దర్శకత్వంలో రూపొందిన ‘కొండా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ వెళ్లిన ఆమె.. అక్కడ కంట్రోల్‌రూమ్‌ ఎదురుగా వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉందని.. వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ …

Read More »

పురందేశ్వరికి కొడాలి నాని హెచ్చరిక

గుడివాడలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి అడ్డుకుంటున్నారని వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. కేవలం 10 మంది వ్యాపారుల ప్రయోజనాల కోసం లక్షలాది మందికి ఉపయోగపడే రైల్వే గేట్లపై ఫ్లై ఓవర్ల నిర్మాణాన్నిఅడ్డుకోవడం దారుణమని విమర్శించారు. గుడివాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడారు. అన్న ఎన్టీఆర్‌ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. …

Read More »

రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చేశారు: జీవన్‌రెడ్డి

గవర్నర్‌ తమిళిసై ప్రజాదర్బార్‌ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని.. రాజ్‌భవన్‌ను ఆమె రాజకీయ భవన్‌గా మార్చేశారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. అది ప్రజాదర్బార్‌ కాదని.. పొలిటికల్‌ దర్బార్‌ అని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. దేశంలోనే ఎక్కడా లేని సంప్రదాయాన్ని తమిళిసై తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ తమిళిసైకి రాజకీయాలు చేయాలని ఉంటే బండి సంజయ్‌ స్థానంలో బీజేపీ అధ్యక్షురాలిగా రావాలని ఆయన …

Read More »

పవన్‌ యాత్ర ఎందుకో ఆయనకైనా తెలుసా?: ఆర్కే రోజా

టెన్త్‌ ఫలితాలపైనా టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టింది జనం కోసమా? చంద్రబాబు కోసమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు కష్టం వస్తే పవన్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టడమో.. యాత్ర చేయడమో చేస్తారని చెప్పారు. ఇప్పుడు బస్సు యాత్ర అంటూ వస్తున్నారని.. అది ఎందుకో ఆయనకైనా తెలుసా? …

Read More »

మంత్రులు, ఎంపీలతో కేసీఆర్‌ కీలక భేటీ..

రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలో తాజా పరిణామాలు, పాలన. రాజకీయ పరమైన అంశాలపై నేతలతో సీఎం చర్చిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అయిన నేపథ్యంలో ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నేతల అభిప్రాయాలను కేసీఆర్‌ తెలుసుకుంటున్నట్లు సమాచారం.

Read More »

ఆ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అయితే రాష్ట్రపతిగా వెంకయ్య?

దేశంలో రాష్ట్రపతి ఎన్నిక సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులగా ఎవరుంటారు? ఉత్తరాది వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటారా? దక్షిణాదికి ఈసారి అవకాశం దక్కుతుందా? ఏ వర్గానికి చెందిన వ్యక్తి దేశ ప్రథమ పౌరుడు అవుతారు అనే అంశాలపై జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat