బీజేపీ నేతలు మాట్లాడితే విషం చిమ్ముతున్నారని.. హిందూ ముస్లిం మాటలతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రాంతం సుభిక్షంగా ఉందని, ఎవరెన్ని కూతలు కూసినా పట్టించుకోవద్దని ప్రజలకి సూచించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన అనాలోచితమైన నిర్ణయాలతో దేశాన్ని రావణకాష్టంగా మార్చేసిందని తీవ్రస్థాయిలో ఆయన …
Read More »ఆర్మీని కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు: హరీష్‌రావు
‘అగ్నిపథ్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశమంతా అట్టుడికిపోతోందని తెలంగాణ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. నిజామాబాద్ జిల్లా మోతెలో పీహెచ్‌సీ ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లను టీఆర్‌ఎస్ చేయించిందంటూ బండి సంజయ్‌చేసిన ఆరోపణలపై హరీష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్ చేయిస్తే యూపీలో పోలీస్‌స్టేషన్‌పై దాడి ఎవరు చేశారని సూటిగా ప్రశ్నించారు. అగ్నిపథ్ విధానం యువకులకు అర్థం కాలేదంటూ …
Read More »దుర్మార్గపు ఆలోచనలతోనే ‘అగ్నిపథ్’: నారాయణ
నిరుద్యోగ యువత జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని.. దాని ఫలితమే దేశంలో హింసాకాండ అని సీపీఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. అగ్నిపథ్‌పై జరుగుతున్న ఆందోళనలు కేంద్ర ప్రభుత్వం సృష్టించినవేనని ఆయన విమర్శించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనల నేపథ్యంలో నారాయణ స్పందించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అర్ధంతరంగా ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులను మాయ చేసేందుకు దుర్మార్గపు ఆలోచనలతోనే అగ్నిపథ్‌ను తీసుకొచ్చారని నారాయణ విమర్శించారు.
Read More »బాసర ట్రిపుల్ ఐటీ వద్ద రేవంత్‌రెడ్డి అరెస్ట్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలను పరిష్కరించాలంటూ గత మూడు రోజులుగా అక్కడి విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న రేవంత్‌రెడ్డి పోలీసులను దాటుకుని క్యాంపస్‌లోనికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆ తర్వాత వారి నుంచి తప్పించుకుని గోడదూకి లోనికి ప్రవేశించారు. విద్యార్థుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడుతుండగా పోలీసులు అక్కడికి వచ్చి రేవంత్‌ను …
Read More »దాని అర్థం ‘విశ్వగురు’కే తెలుసు: కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్’పై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన దైన శైలిలో వ్యంగ్య్యాస్త్రాలు సంధించారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన పలు కార్యక్రమాలపై విమర్శలు చేశారు. ‘‘రైతు చట్టాలు రైతులకు అర్థంకావు.. సాధారణ ప్రజలకి నోట్ల రద్దు అర్ధం కాదు.. వ్యాపారులకు జీఎస్టీ అర్థం కాదు.. ముస్లింలకు సీఏఏ అర్థం కాదు.. గృహిణులగా ఉన్న మహిళలకు ఎల్‌పీజీ …
Read More »సంజయ్‌లాంటి నేతల వల్లే దేశంలో అశాంతి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటనల వెనుక టీఆర్‌ఎస్ ఉందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ ఆరోపణలు సంజయ్ అజ్ఞానానికి నిదర్శనమని చెప్పారు. దేశ రక్షణ కోసం సేవ చేయాలనుకునే యువతను బీజేపీ అవమానిస్తోందని విమర్శించారు. గతంలో రైతన్నలు, ఇప్పుడు సైనికులను నిర్లక్ష్యంగా చూడటం హేయమైన …
Read More »‘అగ్నిపథ్’ పేరుతో యువత ఉసురు తీస్తున్నారు: మంత్రి నిరంజన్‌రెడ్డి
బీజేపీ పాపం ముదిరి పాకాన పడిందని తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. మొన్నటి వరకు వ్యవసాయచట్టాలతో రైతుల ఉసురు పోసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ‘అగ్నిపథ్’ పేరుతో యువత ఉసురు తీస్తోందని ఆరోపించారు. ‘అగ్నిపథ్’ అనాలోచితమైన నిర్ణయమన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిరుద్యోగ యువకుల ఆందోళన నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 90 రోజుల్లోనే 46వేల మంది నియామకం చేపట్టి కేవలం రూ.30వేల జీతం ఇవ్వడం అర్ధరహితమన్నారు. దేశభద్రత విషయంలో ఇలాంటి …
Read More »రాష్ట్రపతి ఎన్నిక.. వైసీపీ వైఖరిపై విజయసాయి స్పందన ఇదే
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఈడీ విచారణ కేంద్రం కక్షేమీ కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ స్థాయీ సంఘానికి సంబంధించిన నివేదికను ఛైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఢిల్లీలో ఆయన అందించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌పై ఈడీ కేసుపై స్పందించారు. ఇందులో కక్ష సాధింపేమీ లేదని.. కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన పాపాలు అనుభవించాల్సిందేనన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ వైఖరిపై విజయసాయిని …
Read More »ఆ భూముల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి: జగన్ ఆదేశం
పరిశ్రమల కోసం ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. సకాలంలో వారికి ప్రోత్సాహకాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల అభివృద్ధి, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. దేశంలో ఎవరూ చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు …
Read More »కేసీఆర్‌ను కించపరుస్తూ స్కిట్.. బీజేపీ నేతలు అరెస్ట్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. జూన్ 2న నాగోల్ బండ్లగూడలో బీజేపీ ఆధ్వర్యంలో ‘అమరుల యాదిలో’ సభను నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరుస్తూ ఓ స్కిట్ వేశారు. ఈ వ్యవహారంలో బీజేపీ నేతలు రాణిరుద్రమ, దరువు ఎల్లన్నను పోలీసులు అరెస్ట్ చేయగా.. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి …
Read More »