Home / POLITICS (page 52)

POLITICS

వైఎస్సార్‌ ఫ్యామిలీ.. ఎక్స్‌క్లూజివ్‌ ఫొటోలు

తన మార్క్‌ పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నేత దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. ఎప్పుడూ ప్రజల బాగోగుల కోసమే తపించే ఆయన.. వీలు చిక్కినప్పుడల్లా కుటుంబంతో గడిపేవారు. అప్పుడప్పుడూ సతీమణి విజయమ్మ, కుమారుడు జగన్‌, కోడలు భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్‌ అనిల్‌, మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా విహారయాత్రలకూ వెళ్లేవారు.  ఇటీవల వైఎస్‌ జయంతి సందర్భంగా ఆయన తన కుటుంబంతో గడిపిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో …

Read More »

వైసీపీ ప్లీనరీకి పోటెత్తిన జగన్‌ సైన్యం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్‌

వైసీపీ ప్లీనరీకి కార్యకర్తలు పోటెత్తారు. గుంటూరు జిల్లా చినకాకాని సమీపంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలకు ఏపీ నలుమూలల నుంచి వైసీపీ శ్రేణులు తరలివచ్చాయి. ప్లీనరీ ముగిసిన అనంతరం కార్యకర్తలు తమ స్వస్థలాలకు బయల్దేరడంతో టోల్‌ గేట్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి.  విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు చెన్నై-కోల్‌కతా హైవేలో సందడి వాతావరణం కనిపించింది. ‘జై జగన్‌’ ‘జై …

Read More »

దేవుడు స్క్రిప్ట్‌ గొప్పగా రాస్తాడు: ప్లీనరీలో జగన్‌

అప్పట్లో తనపై శక్తివంతమైన వ్యవస్థలతో కాంగ్రెస్‌, టీడీపీ దాడి చేశాయని వైసీపీ అధినేత, సీఎం జగన్‌ అన్నారు. ఓదార్పు యాత్ర మానుకోవాలని ఒత్తిడి చేశాయని చెప్పారు. వైసీపీ ప్లీనరీ ముగింపు సందర్భంగా కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి జగన్‌ మాట్లాడారు. మనకి అన్యాయం చేసిన పార్టీలకు రాష్ట్రంలో నామరూపాల్లేవన్నారు. 2014లో ఓడినా తనపై కుట్రలు, కుతంత్రాలు ఆపలేదని.. 23 మంది ఎమ్మెల్యేలు, 3 మంది ఎమ్మెల్యేలను కొన్నారని చెప్పారు. దేవుడు స్క్రిప్ట్‌ …

Read More »

వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా జగన్‌..

వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా సీఎం జగన్‌ ఎన్నికయ్యారు. వైసీపీ ప్లీనరీలో ఈ మేరకు తీర్మానం చేసి ఆమోదించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడారు తనపై కార్యకర్తలు, అభిమానులు ఆప్యాయత చూపించి అనురాగం పంచుతున్నారని చెప్పారు. ఈ ప్లీనరీ ఆత్మీయుల సునామీలా కనిపిస్తోందన్నారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విధానాలు, బాధ్యతలను ఎంతో అభిమానంతో భుజస్కందాలపై మోస్తున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు నిండు మను సెల్యూట్‌ చేస్తున్నట్లు …

Read More »

వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్‌ విజయమ్మ రాజీనామా

వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వైఎస్‌ YSవిజయమ్మ ప్రకటించారు. గుంటూరు జిల్లా చినకాకానిలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీకి ఆమె హాజరై మాట్లాడారు. తమ కుటుంబంతో ప్రజల అనుబంధం 45 ఏళ్లుగా కొనసాగుతోందని చెప్పారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రతి మనిషినీ ప్రేమించారన్నారు. తమ కుటుంబ అనుబంధం, సంస్కారం గొప్పవని చెప్పారు. తామే కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలే ఓదార్చారన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకు జగన్‌తో ఉన్నానని.. బిడ్డ షర్మిలకు …

Read More »

తడి చెత్తతో రూ.6లక్షల ఆదాయం: కేటీఆర్‌ అభినందన

పంచాయతీలో తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారుచేసి రూ.6లక్షల ఆదాయాన్ని సంపాదించిన ఆదిలాబాద్‌ జిల్లా ముఖ్రాకే గ్రామ సర్పంచ్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ అందిన సంక్షేమ నిధుల వివరాలతో బోర్డు ఏర్పాటు చేయడం.. ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వినియోగించుకుంటూ ముఖ్రాకే ఆదర్శంగా …

Read More »

హైదరాబాద్‌లో ఎంపీ రఘురామపై కేసు నమోదు

ఏపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైదరాబాద్‌లో కేసునమోదైంది. రఘురామ ఇంటి వద్ద ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ సుభానిపై ఎంపీ సిబ్బంది దాడి చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు రఘురామతో పాటు ఆయన కుమారుడు భరత్‌, కానిస్టేబుల్‌ సందీప్‌, సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ, పీఏ శాస్త్రిలను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More »

అప్పుడే లొంగలేదు.. ఇప్పుడు లొంగుతానా?: జగ్గారెడ్డి

తానేం మాట్లాడినా కాంగ్రెస్‌ పార్టీ కోసమేనని.. ఆ పార్టీ లైన్‌లోఏ ఉంటానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కొన్ని మీడియా ఛానళ్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడనని.. పార్టీనుంచి వెళ్లాలనుకుంటే తనను ఆపేదెవరని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు కట్టుబడి ఉన్నట్లు చెప్పానని గుర్తు చేశారు. అప్పుడు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా లొంగలేదని.. ఇప్పుడు లొంగుతానా? …

Read More »

నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. 1,663 ఉద్యోగాల ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఇంజినీరింగ్‌విభాగానికి చెందినవే 1,522 ఉన్నాయి. ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ శాఖల్లోని ఇంజినీరింగ్‌ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇరిగేషన్‌లో 704 ఏఈఈ పోస్టులు, 227 ఏఈ, 212 జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, 95 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి. తాజా అనుమతులతో కలిపి ఇప్పటి వరకు మొత్తం …

Read More »

రేవంత్‌.. ఎవర్ని కొడతావ్‌? నువ్వేమనుకుంటున్నావ్‌?: మళ్లీ జగ్గారెడ్డి ఫైర్‌

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ ముసలం రేగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా హైదరాబాద్‌ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్‌) ఆయన్ను కలిసి స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన యశ్వంత్‌సిన్హాను తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎవరూ కలవొద్దని టీపీసీసీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat