ములుగుకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు తృటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షాలతో వచ్చి వరదల్లో పలు గ్రామాలు ముంపులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంపు గ్రామాల పర్యటనకు సీతక్క వెళ్లారు. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి వద్ద వాగు ఉండటంతో పడవలో ఆమె అవతలి ఒడ్డుకు బయల్దేరారు. ఈ క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న పడవ ఆగిపోయి ఓ చెట్టుకు ఢీకొట్టింది. వాగు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ …
Read More »త్వరలో సీఎం జగన్ ‘ప్రజాదర్బార్’
త్వరలో ప్రజా సమస్యలపై నేరుగా ప్రజల నుంచే వినతిపత్రాలను స్వీకరించేందుకు ఏపీ సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. తన క్యాంపు కార్యాలయం వద్ద ‘ప్రజాదర్బార్’ పేరిట వీటిని స్వీకరించి సమస్య పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చేందుకు ఆయన రెడీ అవుతున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ ఉదయం 10 గంటలోపు ఈ ప్రజాదర్బార్‌ను పూర్తిచేసే అవకాశముంది. మధ్యాహ్న సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వనున్నారు. శని, …
Read More »అక్కడ గెలవలేనోళ్లు సిరిసిల్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా? కేటీఆర్
టీఆర్‌ఎస్‌లో కొన్ని చోట్ల గొడవలు ఉండడం టీఆర్‌ఎస్ బలంగా ఉందనడానికి నిదర్శనం అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. బలంగా ఉన్న నేతలను పార్టీ కలుపుకొని పోతుందని, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్ ఒక్కటే ఉందని ఈ విషయాన్ని కాంగ్రెస్, బీజేపీ సర్వేలే స్పష్టం చేస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ దొర అంటూ ప్రతిపక్షాలు …
Read More »ఏపీలో భారీ వర్షాలు.. రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే
తెలంగాణతో పాటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఎగువ నుంచి వస్తోన్న వరదతో పలు గ్రామాలు, కాలనీలు జగదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్ రేపు ఏరియల్ సర్వేకు వెళ్లాలని నిర్ణయించారు. వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ పైనుంచి ఆయన పరిశీలించనున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా …
Read More »తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా సోకడంతో ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడక ఈ రోజు చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని హాస్పిటల్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. అలసట, జ్వరంగా అనిపించడంతో కరోనా టెస్ట్‌లు చేయించుకోగా పాజిటివ్‌గా వచ్చిందని సీఎం ట్విట్టర్ ద్వారా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని, వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ప్రజలను …
Read More »టీడీపీ గ్రాఫ్ లేవడం లేదు.. అందుకే ఆ సర్వే..: పేర్ని నాని
ఏపీ సీఎం జగన్ గ్రాఫ్ పడిపోయిందనడం విచిత్రంగా ఉందని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని అన్నారు. సెంటర్ ఫర్‌నేషనల్ స్టడీస్ సంస్థ టీడీపీ జీతగాడు రాబిన్ శర్మదేనని.. అందుకే వాళ్లు అలా నివేదిక ఇచ్చారని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి గ్రాఫ్‌పెంచుకోవాలని టీడీపీ చూసిందని.. కానీ అలా జరగలేదన్నారు. తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ వల్ల గ్రాఫ్ లేవడం లేదని.. టీడీపీని కాపాడుకోవడానికే చేయించిన …
Read More »తెలంగాణలో సూపర్ స్పీడ్ ఇంజిన్: కేసీఆర్
రూపాయి విలువ పతనమైందంటూ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని మోడీ గొంతుచించుకుని చెప్పారని.. ఇప్పుడు దాని విలువ ఎందుకు పడిపోయిందో చెప్పాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. గతంలో ఆయన చెప్పిన విషయాన్నే ఇప్పుడు తాము అడుతున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ అసమర్థ విధానాల వల్లే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.80కి పడిపోయిందని విమర్శించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ, బీజేపీ నేతలపై …
Read More »తెలంగాణలో మూడు రోజులు స్కూళ్లు బంద్: కేసీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటామని.. దీనికి యంత్రాంగం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. సహాయ చర్యల కోసం హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. మరో 4, 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షసూచన ఉందని.. …
Read More »అవే నాకు శాశ్వత అనుబంధాలు: జగన్ ట్వీట్
రెండు రోజులపాటు నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సూపర్ సక్సెస్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వైసీపీ కార్యకర్తలు, నేతలు దీనికి హాజరై విజయవంతం చేశారు. నేతల ఉత్సాహపరిచే స్పీచ్‌లతో ప్లీనరీ ప్రాంగణం హోరెత్తిపోయింది. ప్లీనరీ విజయవంతమైన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ కార్యకర్తలకు మరోసారి సెల్యూట్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘నిరంతరం దేవుని దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల …
Read More »ఏపీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు..!
ఏపీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులు నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో మాట్లాడిన పలువురు నేతలు మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తామని చెప్పారు. రాజధాని వికేంద్రీకరణ జరగాలని.. అభివృద్ధి అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని ఆకాంక్షించారు. ‘పరిపాలన వికేంద్రీకరణ’పై ప్రవేశపెట్టిన తీర్మానంపై నేతలు మాట్లాడారు. రాష్ట్రం బాగుండాలంటే మూడు రాజధానులు ఉండాలని.. మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని ఎంపీ నందిగం …
Read More »