టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఈడీ విచారణ సీఎం కేసీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఈడీ చీఫ్‌గా నియమించినందుకు ధన్యవాదాలు. దేశాన్నినడిపిస్తున్న డబుల్ ఇంజిన్ ‘మోడీ-ఈడీ’ అని దీంతో అర్థమవుతోంది …
Read More »ఇంట్లోని ఆడవాళ్లను బయటకు లాగుతారా?: కేశినేని చిన్ని
టీడీపీ ఎంపీ కేశినేని నాని.. అతడి సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని) మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు.. ఎంపీ కారుకు వాడే నకిలీ స్టిక్కర్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బహిర్గతమయ్యాయి. నకిలీ స్టిక్కర్‌తో ‘టీఎస్07హెచ్ డబ్ల్యూ7777’ నంబరు గల కారు విజయవాడ, హైదరాబాద్‌లో తిరుగుతోందంటూ కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కారు నాని సోదరుడు చిన్ని …
Read More »చిరంజీవిపై కామెంట్స్.. నారాయణ పశ్చాత్తాపం
ప్రముఖ నటుడు చిరంజీవిపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను చేసిన కామెంట్స్ చిరంజీవి అభిమానులు, కాపు మహానాడు నేతల్లో కొందరికి ఆవేశం, కొందరికి బాధ కలిగాయని.. వారి బాధను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నారాయణ మాట్లాడారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని.. అవి లేకుండా రాజకీయాలు ఉండవన్నారు. రాజకీయ భాషను మించి చిరంజీవి గురించి …
Read More »ఆప్షన్ ఏ, బీ, సీ, డీ..! ఇలాంటి ప్రధానిని మీరేమంటారు..!
దేశంలో ద్రవ్యోల్భణాన్ని, చొరబాటుదారులను నియంత్రించలేని ప్రధానమంత్రిని ఏమని పిలుస్తారని అన్నారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్. పీఎం మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. చైనా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో రెండో గ్రామాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ శాటిలైట్ పొటోలతో నేషనల్ మీడియా ప్రచురించిన స్టోరీస్‌ను కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇటువంటి ప్రధానిని ఏమని పిలుస్తారంటూ (ఏ) 56 (బి) విశ్వగురు (సి) అచ్చేదిన్ …
Read More »పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్
పోలవరం ప్రాజెక్టు, విలీన మండలాలపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. డిజైన్ల ప్రకారమే పోలవరం నిర్మాణం జరుగుతోందని.. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏమీ చేయడం లేదు కదా? అని ఆయన వ్యాఖ్యానించారు. పువ్వాడ అజయ్ వ్యాఖ్యలను బొత్స దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకెళ్లగా ఆయన స్పందించారు. మాట్లాడే వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలన్నారు. సాంకేతికంగా ఇబ్బందులుంటే దాన్ని ఎలా పరిష్కరించాలనేదానిపై …
Read More »పోలవరంతో భద్రాచలం ప్రాంతానికి వరద ముప్పు: మంత్రి పువ్వాడ
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం ప్రాంతానిని వరద ముప్పు ఉందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమన్నారు. టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, నేతలతో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పువ్వాడ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్ మార్చేసి మూడు మీటర్ల ఎత్తు పెంచుకున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో విలీనమైన 7 మండలాలు, భద్రాచలం పక్కనే …
Read More »మంకీపాక్స్.. ఎలాంటి ఆందోళన వద్దు: హరీష్‌రావు
మంకీపాక్స్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. దేశంలో మంకీపాక్స్ రెండో కేసు నమోదైన నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని.. ఈ విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు. ఫీవర్ ఆస్పత్రిని మంకీపాక్స్ నోడల్ కేంద్రంగా చేసినట్లుహరీష్‌రావు చెప్పారు.
Read More »ఒక్కో సచివాలయానికి రూ.20లక్షల నిధులు: సీఎం జగన్
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ప్రతి నెలా 6 లేదా 7 సచివాలయాలు విజిట్ చేయాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కోసం అమరావతి వచ్చిన పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు, రీజినల్ కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై జగన్ కీలక ఆదేశాలిచ్చారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి రూ.2కోట్ల నిధులు కేటాయించామని సీఎం …
Read More »సీఎం కేసీఆర్‌పై షర్మిల్ సెటైరికల్ ట్వీట్
వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సెటైరికల్ ట్వీట్ చేశారు. భద్రాచలంలో గోదావరి వరదను పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. బాధితులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ‘క్లౌడ్ బరస్ట్’పై ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. దీనిలో విదేశీయుల కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారని.. ఈ మధ్య గోదావరి పరీవాహక ప్రాంతంలోనూ అలా చేస్తున్నట్లు …
Read More »మీరు ఆ పదాలను వాడటం సరైనదేనా?: కేటీఆర్
కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో విమర్శలు చేశారు. త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సభలో వాడకూడని కొన్ని పదాలంటూ ఇటీవల లోక్‌సభ సెక్రటేరియట్ నిషేధించింది. ఈ నేపథ్యంలో మీరు వాడే భాష ఇదా? అంటూ కొన్ని కామెంట్లను పేర్కొంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘ప్రధాని నిరసనకారులను ‘ఆందోలన్ జీవి’ అని పిలవడం మంచిదా? యూపీ సీఎం చేసిన …
Read More »