దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నందున ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకను ప్రజా ఉద్యమంగా మార్చాలని ఇటీవల పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఆగస్టు 2న త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి కావున నేటి నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరు తమ వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా మొదలైన సోషల్ మీడియా ఎకౌంట్‌లలో జాతీయ జెండాను డీపీగా పెట్టాలని సూచించారు. తాజాగా మోదీ …
Read More »ఎన్టీఆర్ కుమార్తె సూసైడ్ చేసుకున్నారా?
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మృతి నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన తల్లి సూసైడ్ చేసుకుని చనిపోయిందంటూ ఉమామహేశ్వరి కుమార్తె దీక్షిత పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతోనే ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్‌లో ఉమామహేశ్వరి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్ వద్దకు ఆమె సోదరులు రామకృష్ణ, బాలకృష్ణతో …
Read More »రోడ్డు యాక్సిడెంట్‌లో కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ కుమార్తె మృతి
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ఫిరోజ్‌ఖాన్ కుమార్తె తానియా అక్కడికక్కడే మృతి చెందారు. తానియాతో పాటు ప్రమాణిస్తున్న ఆమె స్నేహితులు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్‌పోర్ట్ నుంచి తిరిగి వస్తుండగా శంషాబాద్ పరిధిలోని శాంతంరాయి వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో …
Read More »కేంద్రమంత్రి సింధియాకు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్!
కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణకు వచ్చి రాజకీయ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ కంటే సింధియా సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో మెరుగైన అభివృద్ధి జరిగి ఉంటే చూపించాలని కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ జనాభా. దేశానికి …
Read More »ఆ స్టిక్కర్ ఎవరో పెట్టుకుంటే నాకేం సంబంధం?: మంత్రి మల్లారెడ్డి
క్యాసినో కేసులో నిర్వాహకులు మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. అయితే ఈడీ తనిఖీల సమయంలో మాధవరెడ్డి కారుకు మేడ్చల్ ఎమ్యెల్యే, మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్ ఉన్న అంశం చర్చనీయాంశమైంది. బోడుప్పల్‌లో ఓ స్కూల్‌కు వెళ్లి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ మాధవరెడ్డి కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ అంశంపై స్పందించారు. అది మార్చి 2022 నాటి స్టిక్కర్ అని.. దాన్ని మూడునెలల క్రితమే …
Read More »తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం క్లారిటీ!
ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నియోజకవర్గాల పెంపుకు రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. ఈ మేరకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. రాజ్యాంగ సవరణ ద్వారా చేయాల్సి ఉన్నందున సీట్ల సంఖ్య పెంచాలంటే 2026 వరకు ఆగాల్సిందేనని.. అప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో సీట్ల పెంపు సాధ్యం కాదని తెలిపింది. ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగి ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ …
Read More »38 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారు!
పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఉపాధ్యాయ నియాకాల్లో జరిగిన అవకతకల వ్యవహారంలో టీఎంసీ మంత్రి పార్థ చటర్జీ అరెస్టైన తర్వాత ఆ పార్టీ తుఫాన్ చెలరేగిందన్నారు. టీఎంసీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేల్లో 21 మంది డైరెక్ట్‌గా తనతోనే టచ్‌లో ఉన్నారని చెప్పారు. …
Read More »మూసీ వరద.. మంత్రి కేటీఆర్ సమీక్ష
హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాలికి గాయమైన కారణంగా ప్రగతి భవన్ నుంచే ఆయన సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ అధికారులతో ఆయన రివ్యూ చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. మూసీ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాలని.. …
Read More »పరిహారం ఇచ్చాకే పోలవరంలో నీళ్లు నింపుతాం: సీఎం జగన్ హామీ
పోలవరం నిధుల విడుదల కోసం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపిస్తూనే ఉన్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నామని చెప్పారు. సెప్టెంబర్‌లోపు నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల టూర్‌లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో ఆయన పర్యటించారు. అక్కడ బాధితులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే పోలవరం ప్రాజెక్టులో …
Read More »కేసీఆర్ నిప్పు.. ఆయన్ను ఎవరూ టచ్ చేయలేరు: జగదీష్‌రెడ్డి
కేసీఆర్ సీఎం అయ్యాకే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలతో దేశం తలసరి ఆదాయం తగ్గిపోయిందని విమర్శించారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో బాధ్యతా రాహిత్యమైన, విచిత్ర ప్రతిపక్షాలు ఉన్నాయని మండిపడ్డారు. వార్తల్లో ట్రెండింగ్ అయ్యేందుకు ప్రతిపక్ష నేతలు పోటీపడుతున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు …
Read More »