ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్‌షాతో భేటీ కానున్నారు. నేడు మునుగోడు పర్యటనలో భాగంగా అమిత్‌షా రాష్ట్రానికి వస్తున్నారు. మునుగోడులో సభకు హాజరుకానున్న అమిత్‌షా సభ తర్వాత శంషాబాబ్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు దగ్గర ఉన్న నోవాటెల్ హోటల్‌లో జూ. ఎన్టీఆర్ ఈ రోజు సాయంత్రం అమిత్‌షాను కలవనున్నారు. మీటింగ్ కన్ఫర్మేషన్‌ను బీజేపీ వర్గం సోషల్ మీడియాలో పంచుకుంది. అమిత్‌షా, ఎన్టీఆర్ మీటింగ్ పట్ల సర్వత్రా …
Read More »ప్రగతి భవన్ నుంచి మునుగోడు వరకు.. కేసీఆర్ భారీ ర్యాలీ
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీలు గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్ మునుగోడులో గెలిచేందుకు అన్ని ప్రయత్నాలూ ముమ్మరం చేశాయి. దీనిలో భాగంగానే టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మునుగోడులో ‘ప్రజాదీవెన’ బహిరంగ సభలో పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి మునుగోడు వరకు భారీ ర్యాలీతో సీఎం వెళ్లేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. ప్రగతిభవన్ నుంచి ప్రారంభమైన …
Read More »బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు
బీజేపీలో నా సేవలను ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్, లక్ష్మణ్‌లకే తెలియాలని ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. రాష్ట్ర నాయకత్వం తనను సైలెంట్‌లో ఉంచిందని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీ బాధ్యతలు ఇచ్చినపుడే ఏమైనా చేయగలమని.. బాధ్యతలు ఇవ్వకుండా ఏం చేయగలమని విజయశాంతి ప్రశ్నించారు. తనదెప్పుడూ రాములమ్మ పాత్రేనని.. ఉద్యమకారిణిగా అందరి …
Read More »బీజేపీని నమ్ముకుంటే వైకుంఠపాళిలో పామునోట్లో పడ్డట్లే: కేసీఆర్
సంస్కరణల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదవాళ్లను దోచి షావుకార్లకు దోచిపెడుతోందని టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. ఎమిదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం ఉద్ధరించిందని ప్రశ్నించారు. వికారాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై మండిపడ్డారు. సమైక్య పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. మళ్లీ అలాంటి పరిస్థితులు తేవొద్దని …
Read More »బండి సంజయ్ పాదయాత్రలో గొడవ.. పలువురికి గాయాలు
జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీకి చెందిన యువకులు, కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ బండి సంజయ్‌ను మండలంలోకి ఆహ్వానించారు. అనంతరం బహిరంగ సభలో సంజయ్ మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎవరకీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని సంజయ్ అన్నారు. దీంతో అక్కడ ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలతో గొడవ దిగారు. ఈ …
Read More »రూ.80లక్షల కోట్ల అప్పు.. ఎవర్ని ఉద్దరించారు?: కేటీఆర్ ఫైర్
దేశ సంపదను పెంచే తెలివితేటలు ప్రధాని మోదీ ప్రభుత్వానికి లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. సంపదను పెంచి పేదలక సంక్షేమానికి ఖర్చు చేసే మనసు వారికి లేదన్నారు. ఉచిత పథకాలు వద్దంటూ ఇటీవల ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేదల పొట్ట కొట్టేందుకే ఉచిత పథకాలపై చర్చకు తెరతీశారని కేటీఆర్ విమర్శించారు. పేదల …
Read More »నేను వెనక్కి తగ్గను.. ఆయన్ను డిస్మిస్ చేయాల్సిందే: కోమటిరెడ్డి
చండూరు సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సారీ చెప్పినా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శాంతించేలా కనిపించడం లేదు. అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించిన తర్వాతే రేవంత్ చెప్పిన సారీపై ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ సారీ చెప్పిన అంశాన్ని మీడియా ప్రతినిధులు కోమటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఈ విధంగా …
Read More »కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సారీ చెప్పిన రేవంత్
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సారీ చెప్పారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడిన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలోని చండూరులో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగసభలో పార్టీ నేత అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వెంకట్‌రెడ్డిని ఉద్దేశిస్తూ దయాకర్ పరుష పదజాలాన్ని వాడారు. దీన్ని ఆ పార్టీలోని కొంతమంది సీరియస్‌గా పరిగణించారు. అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని దయాకర్‌ఫై ఆగ్రహం వ్యక్తం …
Read More »కొత్తగా మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు
సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్‌లో మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం కానుకగా 15 నుంచి రాష్ర్టంలో కొత్తగా మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ర్ట మంత్రిమండలి. వీటితో పాటు రాష్ర్టంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్‌వాడీ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది కేబినెట్. 58,59 జీవోల కింద పేదలకు …
Read More »వైఎస్ విజయమ్మకు తృటిలో తప్పిన ముప్పు..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి విజయమ్మకు ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. కర్నూలులో నిర్వహించిన ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం నుంచి విజయమ్మ క్షేమంగా బయటపడ్డారు. తర్వాత వేరే కారులో అక్కడ నుంచి వెళ్లారు.
Read More »