కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ప్రదేశంలో రాహుల్ గాంధీ కొందరు అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ అభిమాని రాహుల్ చర్మ సౌందర్యం గురించి ప్రశ్నించాడు. అందుకు రాహుల్ ఏం చెప్పాడంటే.. రాహుల్ గాంధీతో మాట్లాడటానికి వచ్చిన అభిమానుల్లో ఓ వ్యక్తి …
Read More »హిందీ కూడా అన్నింటిలా ఓ అధికారిక భాష మాత్రమే: కేటీఆర్
హిందీ భాష కూడా అన్ని భాషల్లా ఓ అధికారిక భాష మాత్రమే అని జాతీయ భాష కాదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐఐటీతో పాటు అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను తప్పనిసరిగా హిందీలోనే ఇస్తున్నారని ఆయన తప్పుపట్టారు. ఇలా చేయడం వల్ల ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. చాలా అధికారిక …
Read More »మునుగోడు ఎన్నికకు టీఆర్‌ఎస్ అభ్యర్థి ఖరారు
త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసింది టీఆర్‌ఎస్ పార్టీ. మునుగోడు టికెట్ కోసం చాలా మంది పార్టీ సీనియర్ నాయకులు ప్రయత్నించారు. తీవ్ర చర్చల అనంతరం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఫైనల్ చేశారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అభ్యర్థిని ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఈ ఎన్నికకు ఇటీవల ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబరు 3న పోలింగ్ జరుగుతుంది. …
Read More »టీఆర్‌ఎస్ ఇప్పటినుంచి బీఆర్ఎస్..
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఇకపై టీఆర్‌ఎస్ పార్టీ పేరు బీఆర్‌ఎస్… భారత్ రాష్ట్ర సమితిగా మారింది. అనంతరం ఈ తీర్మానంపై సీఎం సంతకం చేశారు. ఈ పేరు మార్పును పార్టీ రాజ్యాంగంలో సవరణ చేశామని తెలిపారు. కేసీఆర్ పార్టీ పేరు చెప్పగానే సభ్యులంతా చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు.
Read More »మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల!
దేశవ్యాప్తంగా తెలంగాణతో పాటు మరో 5 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలోని మునుగోడుతో పాటు మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, బిహార్‌లోని మోకమా, గోపాల్‌గంజ్, హరియాణాలోని అదంపూర్, ఉత్తరప్రదేశ్‌లోని గోల గోఖర్నాథ్, ఒడిశాలోని ధామ్‌నగర్ స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈనెల 7న విడుదల అవుతుంది. …
Read More »టార్గెట్ బీజేపీ.. ఆరోజే నేషనల్ పార్టీ ప్రకటన: కేసీఆర్
బీజేపీని గద్దె దించడమే ప్రథమ లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దసరా పండుగ రోజేనే జాతీయ పార్టీ పేరు ప్రకటిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రగతిభవన్‌లో మంత్రులు, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. జాతీయ పార్టీకి బీఆర్‌ఎస్‌తో పాటు పలు పేర్లను పరిశీలిస్తున్నామని, విజయదశమి రోజున మధ్యాహ్నం 1.19కి …
Read More »వందే భారత్ ట్రైన్‌లో మోదీ.. వాళ్లతో కలిసి సెల్ఫీలు!
ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో గాంధీనగర్ – ముంబయి మధ్య సెమీ హైస్పీడ్‌తో నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ రైలు ఎక్కి అహ్మదాబాద్‌లోని కాల్పుర్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ట్రైన్‌లోని వసతులను పరిశీలించారు. ప్రధానితో పాటు రైల్వే సిబ్బంది ఫ్యామిలీలు, మహిళా వ్యాపారవేత్తలు, యువత ట్రైన్‌లో ప్రయాణించారు. వారంతా మోదీతో మాట్లాడి ఫొటోలు తీసుకున్నారు.
Read More »ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సమ్మె చేసే విధానం నచ్చింది: కేటీఆర్
సమ్మె కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంచుకున్న పద్ధతి తనకు నచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. గాంధీ సత్యాగ్రహం ఎలా చేశారో.. అలానే శాంతియుతంగా సమ్మె చేశారని కొనియాడారు. సహచర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి బాసర ట్రిపుల్ ఐటీని కేటీఆర్ సందర్శించారు. విద్యార్థులతో లంచ్ చేసి వాళ్లతో గడిపారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలో ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ‘‘రాజకీయ …
Read More »బాలకృష్ణకు మంత్రి జోగి రమేష్ స్ట్రాంగ్ కౌంటర్!
తండ్రి ఎన్టీఆర్‌పై ప్రేమ ఉన్నట్లు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నప్పుడు బాలకృష్ణ ఏం చేశారని నిలదీశారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ స్థానంలో వైఎస్సార్ పేరు పెట్టడంపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జోగి రమేష్ స్పందించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో …
Read More »ఎన్టీఆర్ పేరు మార్పు.. జగన్‌పై బాలయ్య ఫైర్
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడంపై ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘మార్చేయడానికి.. తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి, నాగరికత, తెలుగుజాతి వెన్నెముక.. ఎన్టీఆర్. తండ్రి గద్దెనెక్కి ఎయిర్‌పోర్టు పేరు మార్చారు.. ఇప్పుడు కుమారుడు గద్దెనెక్కి వర్సిటీ పేరు మారుస్తున్నారు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు.. పంచభూతాలున్నాయి.. తస్మాత్ …
Read More »