టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ట్రాప్ వేసిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో దర్యాప్తు నిలిపేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ వ్యవహారంపై మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు ఇన్వెస్టిగేషన్ నిలిపివేయడం సరికాదని అభిప్రాయపడింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ లేదా సిట్‌తో దర్యాప్తు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి …
Read More »మునుగోడులో కేఏ పాల్‌కు 805 ఓట్లు.. నోటాకు 482..!
మునుగోడు ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఓట్లు లెక్కింపు జరగకు ముందే తనకు 1,10,000 ఓట్లు వస్తాయని ఆయనే గెలుస్తాడని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ముందుగానే జోస్యం చెప్పారు కేఏపాల్. అక్కడితో ఆగకుండా విజయం తనదే అంటూ డాన్సులు కూడా చేశారు. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లకు ఆయనకు షాక్ పక్కా. ఎందుకంటే ఆయనకు కేవలం 805 …
Read More »మునుగోడుపై కేఏ పాల్ బాంబ్ వేస్తాడని ఆర్జీవీ సెటైర్స్
మునుగోడు ఎన్నికల్లో ఓటమిపాలైన కేఏ పాల్‌పై రామ్ గోపాల్ వర్మ సెటైర్ వేశాడు. మునుగోడు నియోజకవర్గంపై కేఏ పాల్ తన స్నేహితులు ఐఎస్ఐఎస్, ఆల్‌ఖైదాను ఉపయోగించి బాంబ్ వేయనున్నాడని తెలిసిందని, ఆ ప్రాంతంలోని ప్రజలంతా పారిపోవాలని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇదే కాకుండా జీసస్‌కు చెప్పి మునుగోడు ప్రాంతంలోని పంటపొలాల్లో పంటలు పండకుండా, అక్కడి ప్రజలకు ప్రాణాంతకమైన వైరస్ సోకేలా చేస్తాడని విన్నానని ట్వీట్ చేశారు. అక్కడితో ఆగని ఆర్జీవీ …
Read More »మునుగోడు ‘గులాబీ’మయం.. శ్రేణుల సంబరాలు!
నువ్వా- నేనా.. అంటూ సాగిన మునుగోడు పోరులో టీఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటింది. ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఫైనల్‌గా 10,309 ఓట్ల మెజారీటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. మొత్తం 15 రౌండ్లలతో ఓట్ల లెక్కింపు జరగగా.. 2,3 రౌండ్లు తప్పితే మరే రౌండ్‌లోనూ బీజేపీ సత్తా చాటలేకపోయింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ టీఆర్‌ఎస్ పార్టీయే ముందంజలో …
Read More »టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టు!
తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని గురువారం ఆయన ఇంటి వద్ద ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కొడుకు రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీఐడీ పోలీసులు అయ్యన్నపాత్రుడిపై పలు నాన్ బెయిల్ కేసులు నమోదు చేశారు. ఏలూరు కోర్టులో ఆయన్ను హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు. ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని ఆయనపై అభియోగాలున్నాయి. ఈ కేసులో …
Read More »కేబుల్ బ్రిడ్జి ప్రమాదంపై స్పందించిన ప్రధాని.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలోని కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. నదిపై ఉన్న వంతెన కూప్పకూలిన విషయం తీవ్ర విషాదాన్ని నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధిత కుంటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సహాయక చర్యల్లో ఎలాంటి అలసత్వం ఉండదని భరోసా ఇచ్చారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తుతం గుజరాత్‌లోని కేవడియాలో ఉన్నారు. అక్కడ ఉన్న …
Read More »ఇవాళ మునుగోడులో కేసీఆర్ సభ.. ఎమ్మెల్యేల బేరసారాలపై కౌంటర్?
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరుకుంటోంది. అన్ని పార్టీలు ప్రచారంలో టాప్‌గేర్‌కు వచ్చేస్తున్నాయి. దీనిలో భాగంగానే సీఎం కేసీఆర్ సభ నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ పార్టీ సిద్ధమైంది. చండూరులోని బంగారిగెడ్డ వద్ద ఆదివారం జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సభ జరగనుంది. …
Read More »బండ్లన్న సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి దూరంగా ఉంటా..!
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు ఇకపై దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. కుటుంబ బాధ్యతలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ‘కుటుంబ బాధ్యతలు, వ్యాపారాలు.. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం, మిత్రుత్వం గానీ లేదు. అందరూ నాకు ఆత్మీయులే. ఇంతకుముందు …
Read More »బ్రిటన్ ప్రధాని అయిన తెలుగోడిని అభినందించని పుతిన్..!
ఒకప్పుడు ఇంగ్లీషు దొరలు తెలుగు వారిని పాలించారు. ఇప్పుడు అతి చిన్న వయసులో మన తెలుగోడు రిషి సునాక్ ఇంగ్లీష్ సామ్రాజ్యం బ్రిటన్‌కు ప్రధానమంత్రి అయ్యారు. దీనికి యావత్తు దేశం గర్విస్తోంది. ఇప్పటికే భారత్, ఆమెరికా, చైనాలతో పాటు ప్రపంచ దేశాలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపాయి. మరి కొందరు తమ దేశాలతో మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలని కోరారు. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం రిషి సునాక్‌కు …
Read More »కోమటిరెడ్డికి కాంగ్రెస్ షాక్..!
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆ పార్టీ షాక్ ఇచ్చింది. ఇటీవల వైరల్ అవుతున్న ఆడియో క్లిప్‌పై వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశించింది. ఈ మేరకు కోమటిరెడ్డికి ఏఐసీసీ కార్యదర్శి తారిఖ్ అన్వర్‌నోటీసులు జారీ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతుందంటూ ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్తతతో కోమటిరెడ్డి మాట్లాడిన వాయిస్ రికార్డు వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ …
Read More »