రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోబోతుందంటూ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం సాగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా తెలుగు రాజకీయాల్లో ఈ విషయమే హాట్ టాపిక్‌గా మారింది. అటు మీడియా,ఇటు రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా కాంగ్రెస్,టీడీపీ పొత్తుపై తీవ్ర చర్చ నడుస్తోంది. కాంగ్రెస్-టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఖాయమనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో స్ధాపించిన పార్టీ టీడీపీ …
Read More »సినీ అభిమానాలు, రాజకీయాలకతీతంగా ఖండించండి..
రాజకీయ పార్టీలు, సినీ అభిమానుల ముసుగులో కొందరు హద్దులు మీరుతున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక వారి ఇంట్లోని వారిని లాగుతున్నారు. గతంలో పవన్ ఇదే విషయంపై సీరియస్ అయ్యారు. తాజాగా పవన్ కల్యాణ్ తల్లి ఫొటోలను మార్ఫింగ్ చేసి.. అసభ్యకర రీతిలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడో దుర్మార్గుడు.. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కలకలం రేగుతోంది. ‘చంటిఅబ్బాయి’ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి పవన్ తల్లి ఫొటోలను మార్ఫింగ్ చేసి …
Read More »తమిళనాడులో సంబరాలు
తమిళ రాజకీయాలతో పెనవేసుకున్న డీఎంకే పార్టీకి అధ్యక్షుడుగా ఎంకే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే పార్టీ కోశాధికారిగా దురైమురుగన్ను ఎన్నుకున్నారు. డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ ఎన్నికను పార్టీ ప్రధాన కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. 50 ఏళ్ల తర్వాత డీఎంకేలో అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. 70 ఏళ్ల డీఎంకే పార్టీ చరిత్రలో స్టాలిన్ మూడో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడుగా స్టాలిన్ ఎన్నిక కావడంతో డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు …
Read More »జగన్ కు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పిన రోజా.. వైరల్ అవుతున్న పోస్ట్..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత అధినేత జగన్మోహన్ రెడ్డి పెళ్లిరోజు సందర్భంగా ఆపార్టీ ఎమ్మెల్యే ట్వీట్ చేశారు. జగనన్న దంపతులకు మనసారా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. జగన్ భారతి జంట శివపార్వతుల్లాగా కలిసి ఉండాలని ఆకాంక్షించారు. జగన్, భారతిల పెళ్లి ఫొటోను తన ఫేస్‌బుక్ లో పోస్టు చేసిన రోజా, సీతమ్మ వంటి భారతమ్మ జగన్‌కు దొరికిందని అభిప్రాయపడ్డారు. ‘సీతమ్మలాంటి భారతమ్మ దొరికినందుకు జగనన్నకి, రాముడులాంటి …
Read More »గుంటూరులో తెలుగుదేశం నారా హమారా ఎందుకో తెలుసా.?
నారా హమారా-టీడీపీ హమారా ఇవాళ గుంటూరులో ముస్లింలతో టీడీపీ భారీ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముస్లిం పెద్దలు పాల్గొననున్నారు. ఈ నారా హమారా టిడిపి హమారా ముస్లిం మైనార్టీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేసారు. మంత్రులు కళావెంకట్రావు,నక్కా ఆనందబాబు, అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మైనార్టీలను ప్రత్యేకంగా చూసి వారి అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని …
Read More »2019లో పట్టణ ఓటర్లు ఎటువైపు.. ఈసారి అక్కడ చంద్రన్న గాలివీస్తుందా.?
రానున్న ఎన్నికలలో ఏ పార్టీకి ఏ విధంగా ఉంటుందన్నదానిపై పలు రకాల సర్వేలూ, వార్తాలు వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. వాస్తవానికి ఏ ప్రభుత్వం మీదనైనా యాంటీ ఇంకెబెన్సీ చివరి ఏడాదిలో తెలుస్తుంది. ఏపీ వరకూ చూస్తే అటువంటి వాతావరణం ఉందా అనిపిస్తోంది. ఎక్కడ చూసినా బాబుకు బాగానే ఉందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు అనుకూల మీడియానే. ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కడా కనిపించకుండా …
Read More »రాష్ట్రంలో ఆరేళ్ల పాపనుంచి ఆరవైఏళ్ల ముదుసలి వరకూ అత్యాచారాలకు గురవుతున్నారన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనతో పోలిస్తే స్వాతంత్య్రానికి పూర్వ బ్రిటీష్ వాళ్లే నయమనిపిస్తోందని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా విమర్శించారు. బాబుపాలనలో మహిళలకు రక్షణలేదని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మి 2014లో మహిళలంతా రాఖీ కట్టి అధికారం అప్పగిస్తే ఆరేళ్ల పసిబాలిక మొదలు ఆరవైఏళ్ల ముదుసలి వరకూ అత్యాచారాలకు గురవుతున్నారన్నారు. రిషితేశ్వరి, ఎమ్మార్వో వనజాక్షి ఇలామహిళలు టీడీపీ పాలనలో బాధితులుగా ఉన్నారని దుమ్మెత్తిపోశారు. కాల్‌మనీ ఘటనల్లో మహిళలకు ఇప్పటివరకూ న్యాయం …
Read More »టీడీపీ ప్రభుత్వంపై జాతీయ స్థాయి నిఘా.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ ప్రభుత్వం చేసే ప్రతి పని పైనా జాతీయ స్థాయిలో నిఘా ఉంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రాభివృద్ధిలో ఏపీ వెనుకబడిందని, అవినీతిలో మాత్రం నెంబర్ వన్‌లో ఉందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వానికి విలాసాల మీద ఉన్న ధ్యాస వికాసంపై లేద, ధర్మపోరాటం పేరుతో దొంగ పోరాటం చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థల అధిపతి మంత్రిగా ఉన్నారని, ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా …
Read More »జనసేనలోకి ఒక్క టీడీపీ ఎమ్మెల్యే కూడా వెళ్లడు. పవన్ ను ఎవరూ నమ్మరు..
అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ జనసేనలోకి వెళ్లే అవకాశమేలేదని న్యాయశాఖామంత్రి కొల్లురవీంద్ర తెలిపారు. ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలేనని ఆయన అన్నారు. అమరావతి బాండ్లను కొనడానికి ప్రజలు పోటీపడ్డారని ఆయన రవీంద్ర అన్నారు. పవన్ కళ్యాణ్ అవగాహనా రాహిత్యంతో ఉన్నారని ఆయన మాటలు ఎవరూ పట్టించుకోరన్నారు. తాజాగా పవన్ పార్టీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్నారని జనసేన నాయకులు చేసిన …
Read More »రాష్ట్రానికి పెట్టుబడులతో వస్తారనుకుంటే పెట్టుడుపళ్లతో వస్తున్నారు
రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని జనం అనుకుంటున్నామని, కానీ వాళ్లు పెట్టుడు పళ్లతో తిరిగి వస్తున్నారని వైసీపీ ఎమెల్యే రోజా ఎద్దేవా చేశారు. డ్వాక్రా మహిళల రుణాలను రద్దు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవనే చంద్రబాబు.. విదేశీ పర్యటనలు, హంగు, ఆర్భాటాల కోసం వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఐదేళ్ల బాలిక నుంచి 60 …
Read More »