GO 1: జీవో నంబరు 1కు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వు చేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వెల్లడించారు. జీవో నంబర్ 1పై సస్పెన్షన్ కొనసాగించాలని తెదేపా తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరగా……నిరాకరించింది. రోడ్ షోలు, ర్యాలీలపై సర్కారు ఎలాంటి నిషేధం విధించలేదని….. ప్రజల రక్షణపై పూర్తి అధికారం సర్కారుదేనని సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన విషయాన్ని …
Read More »YS SHARMILA: భాజపాతో ఎలాంటి పొత్తు లేదన్న వైఎస్ షర్మిల
YS SHARMILA: ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ నెల 28న పాదయాత్ర పునఃప్రారంభిస్తానని వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వెల్లడించారు. పోలీసులు కేసీఆర్ కు వత్తాసు పలుకుతున్నారని ఆమె మండిపడ్డారు. పాదయాత్ర ఎక్కడ అయితే ఆగిపోయిందో….అక్కడినుంచే ప్రారంభిస్తానని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం పోలీసుల అనుమతి అడుగుతామన్నారు. ఒకవేళ అనుమతి ఇవ్వకపోయినా……యాత్ర చేసే తీరుతామని శపథం చేశారు. పబ్లిసిటీ కోసమే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ముందుస్తుగా …
Read More »MINISTER GANGULA: ఆగస్టు నుంచి కరీంనగర్ వైద్య కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయన్న మంత్రి గంగుల
MINISTER GANGULA: ఆగస్టు నుంచి కరీంనగర్ వైద్య కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో వైద్య కళాశాల తాత్కాలిక భవన నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల…..2 నెలల్లో మరమ్మతు పనులు పూర్తవుతాయని వెల్లడించారు. శాశ్వత భవన నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ చే భూమిపూజ చేయిస్తామని వివరించారు. కరీంనగర్ లో 2 ప్రైవేట్ వైద్య …
Read More »KCR: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
KCR: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరువు భత్యం డీఏ/ డీఆర్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం 2.73 శాతం పెంచుతూ నిర్ణయించారు. తాజా పెంపుతో.. ప్రస్తుతం ఉన్న 17.29 శాతం డీఏ/డీఆర్ 20.02 శాతానికి పెరిగింది. పెరిగిన …
Read More »CM JAGAN: రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న సీఎం
CM JAGAN: దురుద్దేశంతోనే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పంచాయతీ, పురపాలక, గిరిజన సంక్షేమశాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేసి….కొత్త రోడ్లను నాణ్యతతో వేయాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని…..అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ పూర్తి చేయాలని సూచించారు. ఖర్చు ఎక్కువైనా నాణ్యత బాగుంటుందని …
Read More »MINISTER NIRANJANREDDI: కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం
MINISTER NIRANJANREDDI: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి దీటుగా బదులిచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకం జాప్యానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పీఎస్ లలో కేసులు వేసి అడ్డంకులు సృష్టించకపోయింటే ఈ పాటికే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయ్యేదని వ్యాఖ్యానించారు. ఈ పథకంపై ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయని మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో లక్ష ఎకరాలకు కూడా …
Read More »LOKESH: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
LOKESH: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర…..నిభందనలకు లోబడే పాదయాత్ర జరగాలని చిత్తూరు జిల్లా ఎస్పీ సూచించారు. లోకేశ్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఎస్పీ రిషాంత్ స్పష్టం చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని ఎస్పీ రిషాంత్ సూచించారు. ఇదిలా ఉండగా ఈనెల 27 నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుందన్నారు.
Read More »HIGH COURT: జీవో నంబరు 1 పై రాష్ట్ర హైకోర్టు ఇవాళ విచారణ
HIGH COURT: ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు 1 పై రాష్ట్ర హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. వెకేషన్ బెంచ్ డిఫాక్టో చీఫ్ జస్టిస్ లా వ్యవహరించిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును స్వీకరించడం ద్వారా వెకేషన్ బెంచ్ తన పరిధిని మించి వ్యవహరించందన్నారు. ప్రతి కేసు ముఖ్యమైనదే అనుకుంటూ పోతే హైకోర్టు ఏమైపోవాలని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటివి జరిగితే ప్రతి …
Read More »PAWAN KALYAN: రేపు రోడ్డెక్కనున్న జనసేనాని ప్రచార రథం వారాహి
PAWAN KALYAN: జనసేనాని ప్రచార రథం వారాహి రేపు మంగళవారం రోడ్డెక్కనుంది. కొండగట్టు అంజన్న సన్నిధానంలో ప్రత్యేక పూజల తర్వాత మొదటి పరుగు ప్రారంభించనుంది. తన ఆరాధ్య దైవం ఆంజనేయస్వామికి పూజలు చేసి జనసేన అధినేత… సార్వత్రిక సమరాన్ని ప్రారంభించనున్నారు. రేపు ఉదయం వారాహి పూజ.. అనంతరం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేయనున్నారు. అనంతరం తెలంగాణ జనసేన నేతలతో సమర సన్నాహాలపై చర్చించనున్నారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైన …
Read More »AYYANNAPATRUDU: అయ్యన్నపాత్రుడిపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం
AYYANNAPATRUDU: తెదేపా నేత అయ్యన్నపాత్రుడిపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు మతి భ్రమించి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో తెదేపా చిరునామా గల్లంతు కావడం ఖాయమన్నారు. ఓడిపోతామనే భయంతోనే మాట్లాడుతున్నారని అన్నారు. అయ్యన్నపాత్రుడు తన భాషను మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యలు చేశారు. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై నర్సీపట్నం ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ కూడా …
Read More »