తూగో జిల్లాలో దేవిపట్నం నుంచి సెప్టెంబర్ 15న పాపికొండలు వెళుతున్న రాయల్ వశిష్టబోటు కచ్చలూరు వద్ద ప్రమాదవశాత్తు మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 51 మంది మరణించారు. వీరిలో 13 మంది ఆచూకీ గల్లంతు అయింది. కాగా 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే గోదావరి నదీ ప్రవాహం ఉధృతంగా ఉండడంతో రోజులు గడిచినా వంద అడుగుల లోతున ఉన్న బోటును నిపుణులు కూడా బయటకు తీయలేకపోయారు. ఆచూకీ …
Read More »జగన్ ఒక సంచలనం..రాష్ట్రం దేశానికే ఆదర్శం కావాలన్నదే ఆయన ధ్యేయం..!
గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ప్రజలనే కాకుండా యావత్ రాష్ట్రాన్నే కష్టాల్లో పెట్టేసాడు. చంద్రబాబు పదవీకాలం పూర్తయ్యే సరికి రాష్ట్రానికి అప్పులు మాత్రమే మిగిల్చాడు.ఏవేవో చేస్తానని తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి గెలిచాక రాష్ట్రం అప్పుల్లో ఉంది నేనేమి చెయ్యలేను అని చేతులెత్తేసాడు. దాంతో ప్రజలు ఆయనపై నమ్మకం కోల్పోయారు. జగన్ అయినా వారి తలరాతలు మారుస్తారేమో అని ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం …
Read More »కోర్టులో లొంగిపోయిన కోడెల కుమార్తె విజయలక్ష్మీ..!
దివంగత ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు కుమార్తె పూనాటి విజయలక్ష్మీ గురువారం నాడు కోర్టులో లొంగిపోయారు. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని చెలరేగిపోయిన కోడెల కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మీలు చెలరేగిపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి చికెన్ వ్యాపారుల వరకు కే ట్యాక్స్ పేరుతో నెలనెలా డబ్బులు భారీగా వసూలు చేసినట్లు కోడెల కుటుంబసభ్యులపై పదుల సంఖ్యలో కే …
Read More »బాబు, పవన్, లోకేష్‌లపై విజయసాయిరెడ్డి అదిరిపోయే సెటైర్..!
ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ, జనసేన పార్టీలు తీవ్ర విమర‌్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వర్షాలు భారీగా పడి, రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకోవడంతో ఇసుక రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం నూతన ఇసుక విధానంతో ప్రజలందరికి నాణ్యమైన ఇసుక చవక ధరకే అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ఇసుక సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో జనసేన, టీడీపీలు ఇసుక కొరత అంటూ జగన్ సర్కార్‌పై దుష్ప్రచారం చేస్తోంది. …
Read More »అమ్మ ఒడి పథకానికి 6450 కోట్ల రూపాయలు విడుదల చేసిన జగన్ సర్కార్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాటను మరోసారి నిలుపుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రి అయితే బడికి పంపించే ప్రతి పిల్లాడి తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తాను అని చెప్పిన మాటను జగన్ పాటిస్తున్నారు. ఇద్దరు పిల్లలను స్కూల్ కి పంపితే 15 వేల రూపాయలు ఆ తల్లి అకౌంట్ లో వేసే పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి జీవోను కూడా విడుదల …
Read More »హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో విస్తరించిన ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించిన సీఎం జగన్
తాజాగా 130 ఆస్పత్రుల్లో గుర్తించిన సూపర్ స్పెషాలిటీ సేవలను సీఎం వైయస్.జగన్ ప్రారంభించారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అందుబాటులోకి 17 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 716 వైద్యప్రక్రియలు జరగనున్నాయి.చెన్నైలోని ఎంఐఓటీ, బెంగుళూరులోని ఫోర్టిస్, హైదరాబాద్‌లోని మెడ్‌కవర్ ఆస్పత్రి డాక్టర్లు, అక్కడ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి మాట్లాడారు.చికిత్సల విధానంపై డాక్టర్లను ముఖ్యమంత్రి వైయస్.జగన్ అడిగి తెలుసుకున్నారు.తమ రాష్ట్రానికి చెందిన వారిని బాగా చూసుకోవాలంటూ వైద్యులను కోరారు.ఎంతో విశ్వాసం, నమ్మకంతో …
Read More »ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందే..బీజేపీ ఎంపీ డిమాండ్…!
నవ్యాంధ‌్ర ప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ జగన్ సర్కార్‌ను కోరారు. . గత కొద్ది రోజులుగా ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధాని అయిన కర్నూలులో రాజధాని, హైకోర్ట్ ఏర్పాటు చేయాలంటూ టీజీ వెంకటేష్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పలు మార్లు వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే..కర్నూలులో రాజధాని హైకోర్ట్ ఏర్పాటు చేయడం ఆవశ్యకం అంటూ టీజీ వెంకటేష్ తన వాదనను వినిపిస్తున్నారు. …
Read More »ఏపీలో జగన్ చేపట్టిన మద్యపాన నిషేధం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసా…?
గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే దశలవారీగా మద్యపానాన్ని నిషేధించాలని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ఎందుకు అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే జగన్ మద్యపాన నిషేధానికి చర్యలు తీసుకున్నారు. మద్యం రేట్లను పెంచడంతో పాటు బెల్టు షాపులను ఎత్తి వేశారు గ్రామాలలో పట్టణాలలో ఎక్కడపడితే అక్కడ కనిపించే మద్యం షాపులకు బదులుగా ప్రభుత్వమే మద్యం …
Read More »బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన కొడుకు లాంటివాడు అంటున్న వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే..!
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి బహుశా తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతలా తన ప్రాంతంతోపాటు సోషల్ మీడియా వేదికగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పేరు సంపాదించుకున్నారు సిద్ధార్థ్. అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి తన తాత రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేందుకు రాజకీయంగా హేమాహేమీలతో కయ్యానికి కాలు దువ్వారు. నందికొట్కూరు నియోజకవర్గం తో పాటు …
Read More »గన్నవరం బరిలోకి వైసీపీ తరపున దిగనున్న యార్లగడ్డ…!
తాజాగా తెలుగుదేశం పార్టీ గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ రాజీనామా చేసిన నేపథ్యంలో అక్కడ మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇక్కడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారు అనే అంశంపై సందిగ్దత నెలకొంది. ఈ క్రమంలో పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు మరోసారి బరిలోకి దింపేందుకు …
Read More »