jagadeesh: హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేల గృహ సముదాయంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నేత, ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు ఎండీ ఖాలేద్ అహ్మద్..మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో భారాస తీర్థం పుచ్చుకున్నారు. ఎండీ అహ్మద కు పార్టీ కండువా కప్పి మంత్రి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేసీఆర్ పై రోజురోజుకు ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని మంత్రి జగదీశ్ వెల్లండించారు. …
Read More »KAVITHA: ముంబయి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత
KAVITHA: పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముంబయి వెళ్లిన ఎమ్మెల్సీ కవితను……భారాస ముంబయి యూనిట్ నాయకులు స్వాగతం పలికారు. అంతేకాకుండా ఎయిర్ పోర్టు సమీపంలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహారాష్ట్రలో కూడా అమలు చేయాలంటూ ఆ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహారాష్ట్ర అభివృద్ధికి భారాస కీలక పాత్ర పోషిస్తోందని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర పక్క …
Read More »HARISH RAO:మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్, పాలకవర్గం ప్రమాణస్వీకారంలో పాల్గొన్న హరీశ్ రావు
HARISH RAO: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్, పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. దేశ ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రజల కోసమే భారాస, కేసీఆర్ ప్రతి అడుగు వేస్తారని మంత్రి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో భారాస తప్పక విజయం సాధిస్తుందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కాంగ్రెస్, భాజపా నేతలు …
Read More »MINISTER VEMULA: ప్రధానికి దమ్ముంటే అదానీపై విచారణ జరిపించాలి: వేముల
MINISTER VEMULA: ప్రధాని మోదీ నిజంగా సత్యవంతుడైతే అదానీపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని భాజపా, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన సుమారు 500 మంది…..మంత్రి సమక్షంలో భారాస తీర్థం పుచ్చుకున్నారు. దేశంలో మోదీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే పోరాటం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కు మద్దతుగా ప్రతి ఒక్కరూ నిలవాలని పిలుపునిచ్చారు. మోదీ పాలనలో …
Read More »BUGGANA: చంద్రబాబుకు తప్పుడు ప్రచారం చేయడం తప్ప మరోకటి తెలీదు: బుగ్గన
BUGGANA: చంద్రబాబుకు తప్పుడు ప్రచారం చేయడం తప్ప….మరోకటి లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2019 నుంచి క్రైం రేటు తగ్గిందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా దాడులు లేవని అన్నారు. అక్రమ కేసులు కూడా నమోదు కాలేదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేయడం తప్ప మరో పని చేతకాదని …
Read More »KOPPULA: గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను ప్రారంభించిన కొప్పుల
KOPPULA: జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. పెగడపల్లి నుంచి మల్యాల వరకు 20 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న డబుల్ రోడ్డు పనులు, నరసింహునిపేటలో 15 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న పనులను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో రాజకీయ నేతలు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి …
Read More »AVINASHREDDI: వాస్తవాలు రావాలంటే మీడియా బాధ్యతగా వ్యవహరించాలి: అవినాష్ రెడ్డి
AVINASHREDDI: వాస్తవాలు రావాలంటే మీడియా బాధ్యతగా వ్యవహరించాలని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. సీబీఐ విచారణ ఏకపక్షంగా జరుగుతోందని మండిపడ్డారు. ఒక వ్యక్తే లక్ష్యంగా జరుగుతున్నాయని అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు వివేకా నందరెడ్డి చనిపోయనరోజు మార్చురీ దగ్గర ఏం మాట్లాడానో…..ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నానని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. చివరకు విజయమ్మ దగ్గరకు వెళ్లిన…. బెదిరించి వచ్చానని చెప్పడం దారుణమని అన్నారు. నేను తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్ …
Read More »minister indrakaran: సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్
minister indrakaran: నిర్మల్ లోని దివ్యానగర్‌లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సమాజ శ్రేయస్సుకు సంత్ సేవాలాల్ చూపిన మార్గం ప్రజలకు ఆదర్శమని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జగదాంబ – సేవాలాల్ మందిరానికి రూ. కోటి మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి, తండాల నిర్మాణానికి సేవాలాల్ తన జీవితాన్ని త్యాగం చేశారని గొప్ప మహనీయుడని మంత్రి కీర్తించారు. సేవాలాల్ …
Read More »jagadeesh: మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో భారాసలో చేరికలు
jagadeesh: సూర్యాపేటకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో భారాసలో చేరారు. వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్రం తప్పుడు చర్యలకు పూనుకుంటోందని మంత్రి మండిపడ్డారు. కేంద్రం చేసే పనులకు దేశ ప్రజలంతా భారం మోయాల్సి వస్తోందని విరుచుకుపడ్డారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదానీలను పెంచి పోషించడానికే ప్రధాని మోదీ …
Read More »gangula: సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మంత్రి గంగుల
gangula: కరీంనగర్ నియోజకవర్గంలోని తీగలగుట్టపల్లి, ఖాజీపూర్ గ్రామాల్లో 5.5 కోట్ల రూపాయలతో నూతనంగా మంజూరైన సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి గంగుల భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి గంగుల స్పష్టం చేశారు. మంత్రి గంగుల కమలాకర్‌ను తీగలగుట్టపల్లి, ఖాజీపూర్ గ్రామస్థులు ఘనంగా సత్కరించారు. సబ్ స్టేషన్ నిర్మాణం వల్ల పలు గ్రామాలకు లో ఓల్టేజీ సమస్య తీరడంతో …
Read More »