Home / NATIONAL (page 6)

NATIONAL

కేంద్ర మంత్రి అమిత్ షాను కల్సిన మ‌హిళా రెజ్ల‌ర్లు

రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు ,బీజేపీ ఎంపీ,బ్రిజ్ భూష‌ణ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టాప్ మ‌హిళా రెజ్ల‌ర్లు ధ‌ర్నా  చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ రెజ్ల‌ర్లు శ‌నివారం అర్థ‌రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను క‌లిశారు. అయితే ఆ మీటింగ్ అసంపూర్ణంగా ముగిసిన‌ట్లు సాక్షీమాలిక్ భ‌ర్త స‌త్య‌వ్ర‌త్ ఖ‌దియాన్ తెలిపారు. కేంద్ర మంత్రి షా నుంచి స‌రైన రీతిలో స్పంద‌న రాలేద‌ని స‌త్య‌వ్ర‌త్ తెలిపారు. శ‌నివారం రాత్రి 11 …

Read More »

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా 75 రూపాయల నాణెం విడుదల

దేశంలో రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ అనంతరం కొత్తగా 75 రూపాయల నాణెం విడుదల చేయనున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై విపక్షాల రగడ రాజుకుంటుండగా మరో వైపు ఈ భవనం గుర్తుగా కొత్తగా రూ. 75 కాయిన్‌ను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. నాణేనికి ఒక వైపు అశోక స్తంభం సింహ రాజధాని, దాని కింద సత్యమేవ జయతే అని ఉంటుంది.35 గ్రాముల బరువు గల నాణెం …

Read More »

చైనాలో కొత్త క‌రోనా వేరియంట్  విజృంభణ

చైనాలో కొత్త క‌రోనా వేరియంట్  విజృంభిస్తోంది. ఆ వేరియంట్ కేసులు జూన్ నెల‌లో తారా స్థాయికి చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాను పెంచేసింది. చైనాలో ప్ర‌స్తుతం వారానికి దాదాపు 65 మిలియ‌న్ల మందికి కొత్తగా వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఎక్స్‌బీబీ వేరియంట్ వ‌ల్ల చైనాలో మ‌ళ్లీ క‌ల‌క‌లం మొద‌లైంది. జీరో కోవిడ్ పాల‌సీ నుంచి ఇటీవ‌ల చైనా ఫ్రీ అయిన …

Read More »

ఉత్త‌రాఖండ్ బోర్డ‌ర్ వ‌ద్ద గ్రామాలను నిర్మిస్తోన్న చైనా

చైనా, ఇండియా స‌రిహ‌ద్దుల్లో ఇప్ప‌టికే ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఇక తాజాగా ఉత్త‌రాఖండ్ బోర్డ‌ర్ వ‌ద్ద పొరుగు దేశం చైనా గ్రామాల‌ ను నిర్మిస్తున్న‌ట్లు వెల్ల‌డైంది. ఎల్ఏసీకి 11 కిలోమీట‌ర్ల దూరంలో 250 ఇండ్లు ఉన్న ఓ గ్రామాన్ని నిర్మించిన‌ట్లు తెలుస్తోంది. ఉత్త‌రాఖండ్‌కు సుమారు 35 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మ‌రో ప్రాంతంలో కూడా చైనా దాదాపు 56 ఇండ్లు నిర్మిస్తున్న‌ట్లు కొన్ని వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. …

Read More »

తమిళనాడులో ఐటీ దాడులు కలకలం

తమిళనాడులో ఐటీ శాఖ (ఆదాయపు పన్ను) దాడులు కలకలం సృష్టించాయి. ఆ రాష్ట్ర విద్యుత్‌, అబ్కారీ మంత్రి సెంథిల్ బాలాజీ  నివాసంతోపాటు 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై , కరూర్ , కోయంబత్తూర్‌ తోపాటు వివిధ ప్రాంతాల్లోని ఆయన కార్యాలయాలు, ఆస్తులపై అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మంత్రి దగ్గరి బంధువులు, పలువురు కాంట్రాక్టర్ల ఇండ్లలో కూడా సోదాలు చేస్తున్నారు.

Read More »

యూపీలోదారుణం – భర్తను కట్టేసి మరి..?

యూపీ రాంపూర్ లో దారుణమైన సంఘటన జరిగింది. ఓ మెకానిక్ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దుండగులు అతన్ని మంచానికి కట్టేసి మరి ఆయన భార్య, 13 ఏళ్ల కూతురిపై గ్యాంగ్ రేప్ చేసి పారిపోయారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కొన్ని రోజుల కిందట సదరు వ్యక్తితో కొందరు గొడవపడ్డారని, వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు.

Read More »

క్రాస్ అయిన ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్

రూ.2వేల నోట్ల ఉపసంహరణతో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది నిజామా..? కాదా అని తెలుసుకునేందుకు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ ను ప్రజలు పెద్ద ఎత్తున సెర్చ్ చేశారు. దీంతో వెబ్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. కాగా 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి అంతరాయమే ఏర్పడింది.

Read More »

రూ.2వేల నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం

రూ.2వేల నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను సర్క్యూలేషన్ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను ఈ నెల 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ప్రజలు ఒకసారి గరిష్టంగా రూ.20వేల వరకు మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది.

Read More »

రూ.2వేల నోట్ల రద్ధుతో ఎవరికి లాభం .. ఎవరికి నష్టం..?

గతంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అనేక కష్టాలు పడ్డారు. అయితే ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా అనే అపోహ ప్రజల్లో నెలకొంది. అయితే సామాన్య ప్రజలకు ఇబ్బంది ఉండదని అర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్లాక్ దందాలు చేసే వారిపై ఎఫెక్ట్ ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల వద్దకు ప్రజలు క్యూ …

Read More »

కర్ణాటక సీఎంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

కర్ణాటక సీఎంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఒకే ఒక్క డిప్యూటీ సీఎంగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఉంటారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. డీకే పీసీసీ చీఫ్ కొనసాగుతారని వెల్లడించారు. ఎల్లుండి సిద్ధరామయ్య, శివకుమార్, మరికొందరు మంత్రులు ప్రమాణం చేస్తారని తెలిపారు. సీఎం అభ్యర్థి ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat