గతకొంతకాలంగా బెంబేలెత్తిస్తున్న వంటనూనెల ధరలు మరింత తగ్గనున్నాయి. అంతర్జాతీయంగా ధర తగ్గిన నేపథ్యంలో దేశంలోనూ తగ్గించేందుకు ఆయా కంపెనీలు అంగీకారం తెలిపాయి. త్వరలోనే లీటరుపై రూ.10 నుంచి రూ.12 వరకు ధర తగ్గే అవకాశముంది. కేంద్ర ఫుడ్, ప్రాసెసింగ్ వ్యవహారాల శాఖ అధికారులతో వంట నూనెల తయారీ సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Read More »ఓటర్ కు ఆధార్ అనుసంధానం అఖరి గడవు అప్పుడే..?
దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో పేరున్న అందరూ 2023 ఏప్రిల్ 1లోగా తమ ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ప్రకటించింది. ప్రతి ఒక్కరూ 6B ఫారం ద్వారా తమ ఆధార్ నంబర్ ను సంబంధిత ఎన్నికల అధికారికి ఇవ్వాలని సూచించింది. అయితే ఈ అనుసంధాన ప్రక్రియ ఐచ్ఛికమే అని.. ఒకవేళ ఎవరి దగ్గరైనా ఆధార్ లేకపోతే ఎన్నికల అధికారులు కోరే ఇతర డాక్యుమెంట్లను 6B ఫారం …
Read More »టోల్ ప్లాజాలను ఎత్తేసి కొత్త వ్యవస్థ ఏర్పాటు
దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ హైవేలపై 6 నెలల్లో టోల్ ప్లాజాలను ఎత్తేసి కొత్త వ్యవస్థ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫాస్టాగ్ స్థానంలో GPS లేదా నంబర్ ప్లేట్ ఆధారిత విధానాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇందుకోసం పార్లమెంటులో చట్టం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వచ్చే మూడేళ్లలో 26 గ్రీన్ ఎక్స్ప్రెస్వేలను నిర్మిస్తామని తెలిపారు. రెండేళ్లలో దేశంలోని రోడ్లు USతో సమానంగా ఉంటాయన్నారు.
Read More »భారతదేశంలో కరోనా ఉద్ధృతి
భారతదేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 19,893 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి నిన్న ఒక్కరోజే 53 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 4.94శాతంగా ఉంది. 24 గంటల్లో కరోనా నుంచి 20,419 మంది కోలుకోవడం ఉపశమనం కలిగిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,36,478కు చేరింది. రికవరీ రేటు 98.50 శాతంగా.. యాక్టివ్ కేసులు 0.31%గా ఉన్నాయి.
Read More »మోదీ బాటలోనే వారంతా.. మరి మీరు..?
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నందున ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకను ప్రజా ఉద్యమంగా మార్చాలని ఇటీవల పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఆగస్టు 2న త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి కావున నేటి నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరు తమ వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా మొదలైన సోషల్ మీడియా ఎకౌంట్‌లలో జాతీయ జెండాను డీపీగా పెట్టాలని సూచించారు. తాజాగా మోదీ …
Read More »దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,734 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వైరస్ కారణంగా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న కరోనా నుంచి 17,897 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,39,792కు చేరింది. రికవరీ రేటు 98.49 శాతానికి చేరింది. ఇప్పటి వరకు దేశంలో 204.60 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
Read More »దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గాయి. నిన్న ఆదివారం 19,673 కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 16,464కు తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,40,36,275కు చేరాయి. ఇందులో 4,33,65,890 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,396 మంది మరణించారు. మరో 1,43,989 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మరో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 16,112 మంది కరోనా నుంచి …
Read More »బీజేపీ ముసుగు తీసేసిన జేపీ నడ్డా
భిన్నత్వంలో ఏకత్వం.. ఇదే భారతదేశం ఆత్మ. సుదీర్ఘ పరాయి పాలనను తుదముట్టించి 75 ఏండ్ల కింద బహుళపార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థగా అవతరించిన భారత్.. ఆధునిక ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, బహుళ పార్టీ ప్రజాస్వామ్యానికి అత్యుత్తమ ఉదాహరణగా కొనసాగుతున్నది. అందువల్లే జాతీయ, ప్రాంతీయ పార్టీలతోపాటు.. చిన్న చిన్న పార్టీలు సైతం మనగలుగుతున్నాయి. ఇంతటి విశిష్ట భారతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదనే విమర్శలున్నాయి అంటూ తాజాగా బీజేపీ పార్టీ …
Read More »MP సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ అధికారులు దాడి
శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ అధికారులు దాడి చేశారు. పత్రాచల్ కేసులో ఆధారాల కోసం ఆదివారం ఉదయం నుంచి ముంబైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్‌కు సంబంధించి సంజయ్‌రౌత్‌ను వించారించే అవకాశం ఉందని ఈడీ వర్గాలు వెల్లడించాయి. Mumbai | Enforcement Directorate officials at Shiv Sena leader Sanjay Raut's residence, in connection with Patra Chawl …
Read More »దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత నాలుగు రోజులుగా 20 వేలకుపైగా నమోదవుతున్న రోజువారీ పాజిటివ్ కేసులు తాజాగా 19,673కు చేరాయి. దీంతో మొత్తం కేసులు 4,40,19,811కు చేరాయి. ఇందులో 4,33,49,778 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 5,26,357 మంది మరణించారు. మరో 1,43,676 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కొత్తగా 45 మంది మృతిచెందగా, 19,336 మంది …
Read More »