Home / NATIONAL (page 4)

NATIONAL

జేడీఎస్ ఒంటరి పోరు

రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో జ‌న‌తాద‌ళ్(సెక్యుల‌ర్‌) ఒంట‌రిగా పోటీ చేయ‌నున్న‌ది. ఈ విష‌యాన్ని ఆ పార్టీ నేత‌, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవ‌గౌడ  తెలిపారు. ఎన్డీఏతో ఎటువంటి కూట‌మి ఉండ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. బెంగుళూరులో జ‌రిగిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో జేడీఎస్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తుంద‌ని, అయిదు లేదా ఆరు లేదా ఒక్క సీటు గెలిచినా ప‌ర్వాలేద‌ని దేవ‌గౌడ తెలిపారు. బ‌లంగా ఉన్న చోటే త‌మ అభ్య‌ర్థుల్ని …

Read More »

మణిపూర్ నగ్న వీడియోపై సీఎం సంచలన వ్యాఖ్యలు

మణిపూర్ రాష్ట్రంలో సంచలనం సృష్టించి దేశ వ్యాప్తంగా అలజడి రేపిన మహిళల నగ్నంగా ఊరెగింపు వీడియోపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై చాలా రోజుల క్రితమే కేసు నమోదయింది. వీడియో కూడా దొరికింది. కానీ పార్లమెంట్ సమావేశాల ముందు రోజే వీడియోను లీక్ చేశారు. ఇందులో కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం ఉంది. మణిపూర్లో బీజేపీ సర్కారు ఉండటం వల్లే …

Read More »

మణిపూర్ లో మరోదారుణం

మణిపూర్ రాష్ట్రంలో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన అమానుష ఘటన జరిగిన అదే రోజు మరో ఇద్దరు యువతులపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్ పీక్సీ ప్రాంతంలో కార్ సర్వీస్ కేంద్రంలో పనిచేస్తున్న ఇద్దరు యువతులపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పోలీసులు ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించినట్లు.. అక్కడ యువతులు చనిపోయినట్లు, వారి స్నేహితురాలు మీడియాకు వెల్లడించింది.

Read More »

వారంలో రెండు రోజులు సెలవులు

దేశంలో  బ్యాంకులకు 5 రోజుల పనిదినాలు, రెండు రోజులు సెలవులు ఉండేలా కేంద్రానికి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్(IBA) ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. అయితే బ్యాంకులలో పని చేసే ఉద్యోగులు రోజూ 40 నిమిషాలు అదనంగా పనిచేయాలని సూచించింది. దీనిపై ఈనెల 28న బ్యాంకు యూనియన్లతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఇటీవల LIC ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Read More »

లోక్ సభ రాజ్యసభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

ఈరోజు గురువారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సభ ప్రారంభమైన మొదట్లో లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో చైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ సభా సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆతర్వాత ఇటీవలే మృతి చెందిన సిట్టింగ్ సభ్యులు, మాజీ ఎంపీలకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. ఆ వెంటనే లోక్ సభ ను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా …

Read More »

దేశంలో అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేలు వీళ్లే..?

ఓట్ల సమయంలో ప్రజల సమగ్రాభివృద్ధికి పాటుపడతామని ప్రమాణాలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఆ వాగ్ధానాలను మరిచి వారే సుసంపన్నులు అవుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,001 ఎమ్మెల్యేల్లో రెండు శాతం అంటే 88 మంది శతకోటేశ్వరులని (100 కోట్లు) తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (ఎన్‌ఈడబ్ల్యూ) తాజా నివేదికలో వెల్లడించాయి. వారిలో ముగ్గురికి రూ.1000 …

Read More »

ఈనెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ తరుణంలో మొత్తం 27 బిల్లులను ఉభయసభల ముందుకురానున్నాయని కేంద్రం తెలిపింది. వీటిలో 21 బిల్లులు కొత్తవి కాగా.. మరో ఆరు బిల్లులు ఇప్పటికే సభలో ప్రవేశపెట్టి స్థాయీ సంఘాలకు ప్రతిపాదించినవి ఉన్నాయి. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఈ జాబితాలో లేదు.

Read More »

ఢిల్లీ సీఎం ఇంటికి సమీపంలో వరద నీళ్ళు

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో యమునా నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద నీళ్లు ఢిల్లీ సీఎం.. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి సమీపంలోకి వచ్చేశాయి. ఢిల్లీ అసెంబ్లీకి ఐదోందల మీటర్ల దూరం నుండి ఈ వరద నీళ్లు ప్రవహిస్తోన్నాయి. కశ్మీరీ గేట్ – మంజుకా తిలానీని కలిపే ప్రాంతంలో యమునా నది నీరు చేరి వాహనదారులను ఇబ్బంది పెడుతుంది. దీంతో రాకపోకలు …

Read More »

కలవర పెడుతున్న మరో కొత్త వైరస్

మూడు వేవ్ లుగా వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మిగిలిచ్చిన విషాదాన్ని మరిచిపోయి ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న తరుణంలో మరో సరికొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. దక్షిణ అమెరికాలోని చిలీ దేశాన్ని ఓ వింత వైరస్ గజగజ వణికిస్తోంది.గిలాన్ బరే అనే అరుదైన సిండ్రోమ్ వ్యాధి వ్యాప్తితో అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ వైరస్ శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థపై దాడి చేస్తుంది. దీంతో నరాలు,కండరాల వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది. …

Read More »

1558 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన 1558 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆగస్టు 01 2023 తేదీ నాటికి గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుంచి ప‌దో తరగతి లేదా మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆన్‌లైన్‌లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat