హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలోని నదౌన్ సబ్ డివిజన్‌లోని డజను గ్రామాల్లో కలుషిత నీటిని సేవించి అస్వస్థతకు గురైన వారి సంఖ్య ఆదివారం నాటికి 535కి పెరిగింది. బాన్, జంద్గీ గుజ్రాన్, జందలి రాజ్‌పుతాన్, పన్యాల, పథియాలు, నియతి, రంగస్ చౌకీ హార్, థాయిన్, శంకర్‌తో సహా డజను గ్రామాల ప్రజలు నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన వారి సంఖ్య 300 దాటిందని రంగస్ …
Read More »మోదీ సర్కారుపై అమర్త్యసేన్ తీవ్ర విమర్శలు
ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ కేంద్రంలోని మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోని ఘోరమైన ప్రభుత్వాల్లో మోదీ సర్కారు ఒకటని అన్నారు. బీజేపీ సర్కారు ముస్లింల పట్ల వ్యవహరిస్తున్న తీరు, పార్లమెంటు ఉభయ సభల్లో ఆ పార్టీకి ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకపోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాని అనాగరికమేనని మండిపడ్డారు. ఈ సర్కారు గురించి మాట్లాడాలంటే తనకు అనాగరికం అనే మాట వెంటనే …
Read More »పెను విషాదం.. అందరూ చూస్తుండగానే ప్రేమికులు
రైలు బయలుదేరిన కాసేపటికి ఓ ప్రేమ జంట అందులో నుంచి దూకేసింది. ఈ హఠాత్పరిణామానికి రైలులోని ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన చెన్నై బీచ్‌లో గురువారం రాత్రి చోటుచేసుకోగా.. ప్రేమికుల్లో యువతి అక్కడికక్కడే కన్నుమూసింది. యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీనిని గమనించిన కో పైలట్ రైలును తక్షణమే ఆపేశాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న మాంబళం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు …
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు దిగోచ్చిన మోదీ సర్కారు
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు కేంద్రంలోని మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు దిగొచ్చింది. భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్న దేశంలో ఫెడరల్ స్పూర్తి పరిఢవిల్లాలని సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి కీలక ఫలితం దకింది. సీఎం కేసీఆర్ డిమాండ్ మేరకు ఇకనుంచి పోటీ పరీక్షలను అన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. రైల్వే, డిఫెన్స్, బ్యాంకింగ్ తదితర కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో …
Read More »తమిళనాడు అసెంబ్లీ నుండి గవర్నర్ వాకౌట్
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ రవి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ఆర్ రవి ప్రసంగం చేస్తున్న సమయంలో డీఎంకే సభ్యలు ఇవాళ సభలో గందరగోళం సృష్టించారు. నినాదాలు చేస్తూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగాన్ని మాత్రమే రికార్డులోకి తీసుకోవాలని, గవర్నర్ తన ప్రసంగంలో కొత్తగా జోడించిన అంశాలను తీసివేయాలని సీఎం …
Read More »పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కన్నుమూత
పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసిన ఆ రాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత కేషరీనాథ్ త్రిపాఠి ఈ రోజు ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న తన నివాసంలో ఆదివారం ఉదయం 5 గంటలకు కన్నుమూశారు. ఆయన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మూడు పర్యాయాలు స్పీకర్‌గా పనిచేశారు. ఆయన మృతిపట్ల సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు.
Read More »రాహుల్ యాత్రలోఅనుకోని అతిథి..?
గత ఎనిమిదేండ్లుగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యాణా రాష్ట్రంలో కొనసాగుతోంది.బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేయాలనే లక్ష్యంతో రాహుల్‌గాంధీ గత సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను ప్రారంభించిన సంగతి తెల్సిందే.. ఈ సందర్భంగా అక్కడ అనుకోని అతిథి ఈ యాత్రలో పాలుపంచుకుంది. విదేశీ జాతికి చెందిన …
Read More »దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో తాజాగా కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,99,731 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు.. 228 కేసులు బయటడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,547కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,503 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24గంటల్లో నలుగురు మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,30,714కి చేరింది.
Read More »జనాన్ని దోచి.. కుబేరులకు పంచి!
అచ్చే దిన్, మోదీ హైతో ముమ్‌కీన్ హై అంటూ అధికారానికి వచ్చిన తరువాత మోదీ నిజంగానే పేదల కోసం పాటుపడ్డారా? లేక బడా వ్యాపారస్థుల కోసం పనిచేస్తున్నారా? అనే సందేహాలు రోజు రోజుకూ బలపడుతున్నాయి.ఎన్నికల ముందు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అధికారానికి రావడానికి బీజేపీ పాలకులు అలవాటుపడ్డారు. కానీ, ప్రజల సంక్షేమం కోసం కృషి చేసి ఓట్లడిగే పరిస్థితి ఎప్పుడూ లేదు. వాస్తవానికి మోదీ రెండు పర్యాయాల పరిపాలనలో …
Read More »ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సారి కూడా సమావేశాలు రెండు విడుతల్లో జరుగుతాయని పేర్కొన్నాయి. సమావేశాలు జనవరి 31న ప్రారంభమై, ఏప్రిల్6న ముగియనున్నాయి. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ 2023-24ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. అంతకు ముందు రోజు అంటే 31న …
Read More »