కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న తాజా ప్లీనరీ సమావేశాల్లో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అత్యున్నత కమిటీ అయిన CWCకి ఇక నుంచి ఎన్నికలు నిర్వహించకూడదని తీర్మానించారు. సభ్యులను నామినేట్ చేసే అధికారం పార్టీ అధ్యక్షుడికే కట్టబెట్టారు. చత్తీస్ గఢ్ లోని రాయపూర్ లో ఆ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు.
Read More »రాహుల్ కు పెళ్ళి వద్దంటా కానీ పిల్లలు కావాలంటా..?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 52 ఏండ్లైనా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెండ్లి ఎప్పుడు చేసుకుంటారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ విషయంలో రాహుల్ కు అనేక సార్లు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. అయితే, తాజాగా తన వివాహంపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదు కానీ, పిల్లలు కావాలని మాత్రం ఉందంటూ చెప్పుకొచ్చారు.
Read More »అదానీ కి మరో షాక్
హిండెన్ బర్గ్ నివేదికతో ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూప్ భారీగా నష్టపోయిన సంగతి తెల్సిందే. తాజాగా మరో షాక్ తగిలింది. డీబీ పవర్ కంపెనీ నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు గడువు ముగియడంతో డీల్ అయింది. 1200 మెగావాట్ల బొగ్గు పవర్ ప్లాంట్ ఉన్న డీబీ పవర్ కంపెనీ నుంచి రూ.7,017 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేసేందుకు అదానీ పవర్ గతేడాది ఒప్పందం చేసుకుంది. డీల్ రద్దు కావడంతో దేశవ్యాప్తంగా …
Read More »కేంద్రం; అంకెల మాయ- కేంద్ర ప్రభుత్వ జీడీపీ వృద్ధిరేటు:
కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ‘భారతదేశం 2023-24లో నామినల్ జీడీపీ వృద్ధిరేటు 10.5 శాతం ఉండబోతున్నద’ని చెప్పుకొచ్చారు. అయితే 2023-24లో ద్రవ్యోల్బణం 5 నుంచి 5.5 శాతంగా ఉండబోతున్నదని రిజర్వ్ బ్యాంక్ తన నివేదికలో పేర్కొన్నది. అంటే వాస్తవ జీడీపీ సుమారు 5 నుంచి 5.5 శాతానికి మించి ఉండకపోవచ్చునని ఆర్బీఐ గణాంకాలను క్రోడీకరించి చూస్తే అర్థమవుతున్నది. ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన జీడీపీని వాస్తవ …
Read More »ఆసుపత్రిలో చేరిన శిబు సోరెన్
జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్… మాజీ సీఎం.. ఏడుసార్లు ఎంపీగా గెలుపొందిన తాజా రాజ్యసభ సభ్యులు శిబు సోరెన్ అనారోగ్యంతో రాంచీలోని మేధాంత ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోస సమస్యతోపాటు లంగ్స్, కిడ్నీల సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం సోరెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతుందని ఆయన కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చెప్పారు. 2006-10 మధ్య సోరెన్ జార్ఖండ్ సీఎంగా పనిచేశారు.
Read More »అదానీ స్టాక్స్ మోసాలపై పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన
దేశంలో సంచలనం సృష్టించిన అదానీ స్టాక్స్ మోసాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని భారత్ రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇవాళ పార్లమెంట్‌లో డిమాండ్ చేశాయి. ఉభయసభలను బహిష్కరించిన ఇరు పార్టీలు.. పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్, ఆప్ పార్టీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని గాంధీ విగ్రహం ముందు నినాదాలు చేశారు. అదానీ సంక్షోభంపై తేల్చేందుకు జేపీసీతో విచారణ చేపట్టాలని డిమాండ్ …
Read More »ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సవాల్
ప్రధానమంత్రి నరేందర్ మోదీకి కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీపై ఫైర్ అయ్యారు. ‘పోర్టులు, ఎయిర్పోర్టులు, రోడ్లు.. ఇలా అన్ని అదానీకే కట్టబెడుతున్నారు. దేశం మొత్తం అదానీకి అప్పగిస్తారా? హిండెన్బర్గ్ రిపోర్ట్ పై మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. అదానీ షెల్ కంపెనీలపై విచారణ జరిపే దమ్ము మోదీకి ఉందా? అదానీ సంపద …
Read More »మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర సీఎల్పీ నేత బాలాసాహెబ్ థొరట్ తన పదవికి రాజీనామా చేశారు. సీఎల్పీ నేతగా వైదొలగుతున్నట్టు థొరట్ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు ఈరోజు మంగళవారం లేఖ రాశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలెతో తాను కలిసిపనిచేయలేనని పార్టీ కేంద్ర నాయకత్వానికి థొరట్ స్పష్టం చేశారని ఆయన సన్నిహితుడు సోమవారం వెల్లడించారు. నానా పటోలె వ్యవహార శైలికి నిరసనగా …
Read More »సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురు
దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురి నియామకాలకు ఎట్టకేలకు నిన్న శనివారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్‌లో వెల్లడించారు. కొలీజియం సిఫారసులపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు మీద సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఒకరోజు తర్వాతనే తాజా నియామకాలకు ఆమోదముద్ర వేయడం గమనార్హం. కొత్తగా నియమితులైన వారిలో తెలుగు వ్యక్తి జస్టిస్ …
Read More »ఈ నెల 11న తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో టూర్ ఖరారైంది. ఈ నెల 11న కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన పార్లమెంటరీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్, పెద్దపల్లి, మహాబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. మరోవైపు ఈ నెల చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం రాష్ట్రంలో పర్యటించనున్నారు.
Read More »