దేశంలో కరోనా వైరస్ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 44,225 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 918 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,350కి చేరింది. ఇక గత 24 గంటల్లో నలుగురు …
Read More »అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి బీజేపీకి రూ.1,161 కోట్లు విరాళం
దేశంలోని ఏడు ప్రధాన జాతీయ పార్టీలకు 2021-2022లో అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి రూ.2,172 కోట్ల ఆదాయం వచ్చిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పేర్కొంది. అయితే పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో 66 శాతం వారినుంచే అందినట్లు తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీలకు ఈ ఆదాయం లభించింది. వీటిలో బీజేపీకే రూ.1,161 కోట్లు వచ్చాయని ADR సంస్థ తెలిపింది.
Read More »అమిత్ షా కు షాకిచ్చిన బీఆర్ఎస్ నేతలు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన సంగతి విదితమే. హైదరాబాద్ హాకీంపేటలో దిగిన కేంద్ర మంత్రి అమిత్ షా కు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు మాత్రం ఆయనకు వినూత్నంగా …
Read More »రైళ్లకు చివరి బోగీ వెనుక ‘X’ గుర్తు ఎందుకుంటుంది..?
మనం ప్రయాణించే రైళ్లకు చివరి బోగీ వెనుక ‘X’ గుర్తును గమనించే ఉంటారు. రైళ్ల చివర ఈ గుర్తు ఎందుకు ఉంటుందో అనే విషయంపై రైల్వే శాఖ ఇటీవల వివరణ ఇచ్చింది. రైలు అన్ని బోగీలతో ప్రయాణించిందని.. మధ్యలో బోగీలు ఎక్కడా విడిపోలేదని అధికారులు నిర్ధారించుకునేందుకు వీలుగా ఈ గుర్తును చివరి బోగీకి పెడతారట.
Read More »కోవిడ్ వల్ల అంత ముప్పు ఉందా..?
ప్రపంచాన్ని గడగడలాడిస్తూ దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కోవిడ్ తగ్గుముఖం పట్టింది. అయితే దాని ప్రభావం ప్రజలను వేధిస్తోంది. దీర్ఘకాల కోవిడ్ తో బాధపడుతున్న 59 శాతం మందిలో శరీరంలోని ఏదోఒక అవయవం దెబ్బతింటోందని బ్రిటన్ సైంటిస్టులు అధ్యయనంలో తేలింది. కోవిడ్ సోకినప్పటికీ ఇబ్బందులు పడనివారిలోనూ ఈ సమస్య కనిపిస్తోందని గుర్తించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన విషయాలను ‘జర్నల్ ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురించారు.
Read More »ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలనం
దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది. ఇటీవల అతన్ని ఈడీ రెండు రోజుల పాటు ప్రశ్నించింది. రాబిన్ డిస్టలరీస్ పేరిట సౌత్ గ్రూప్ నుంచి మనీలాండరింగ్ కు పాల్పడినట్లు పిళ్లైపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు ఈ కేసులో 11 మంది అరెస్టు అయ్యారు.
Read More »మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కొన్ రాడ్ సంగ్మా
మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కొన్ రాడ్ సంగ్మా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. తాజాగా 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో NPP 26 చోట్ల గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 31 సీట్లు కావాల్సి ఉండగా, బీజేపీ (2)తోపాటు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు.
Read More »మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు తృటిలో తప్పిన ప్రమాదం
కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ పార్టీకి చెందిన అత్యంత సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప కు తృటిలో ప్రమాదం తప్పింది.ఈక్రమంలో యడ్డీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో విజయ్ సంకల్ప్ యాత్రలో పాల్గొనేందుకు యడియూరప్ప వెళ్తుండగా ఈరోజు సోమవారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ …
Read More »ఢిల్లీలో వీధుల్లో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ ఆటోలో చక్కర్లు
దేశ రాజధాని మహానగరం అయిన ఢిల్లీలో జరుగుతున్న జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ హాజరయ్యారు. అమెరికా బయలుదేరే ముందు ఆయన ఢిల్లీలో వీధుల్లో ఆటోలో చక్కర్లు కొట్టారు. మలాసా టీని టేస్ట్ చేశారు. తనకు స్వాగతం పలికిన చిన్నారులతో కొద్దిసేపు సరదాగా గడిపారు. ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయాల సిబ్బందిని, వారి కుటుంబాలను కలిశారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా …
Read More »రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన బీజేపీ ఎమ్మెల్యే తనయుడు
కర్ణాటక రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు దొరికిపోయారు. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా ప్రశాంత్ పనిచేస్తున్నారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడు ఛైర్మన్ గా ఉన్న తన తండ్రికి బదులుగా ఓ కాంట్రాక్టర్ నుంచి ఇతను లంచం తీసుకున్నాడని అధికారులు తెలిపారు. సోదాల్లో రూ.1.70 కోట్ల నగదును …
Read More »