తమిళనాడులో ‘రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నరికి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. దీంతో ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం.. గవర్నర్ కు పంపిన బిల్లులను ఆమోదించేందుకు కాలపరిమితి విధించాలని కేంద్రంతో పాటు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే ఇలా సీఎం స్టాలిన్ తీర్మానం చేసిన కాసేపటికే గవర్నర్ ఆర్.ఎన్ రవి దిగివచ్చారు. ఆయన వద్ద పెండింగ్ లో ఉన్న ఆన్ లైన్ గేమ్ …
Read More »దేశంలో తీవ్రంగా కరోనా ఉధృతి
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 5,880 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 35,199కి చేరింది. నిన్నటితో పోలిస్తే 523 కేసులు పెరిగాయి.
Read More »దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త కేసుల పెరుగుదలకు XBB 1.16 కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త వేరియంట్ పిల్లలపై ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వేరియంట్ బారిన పడుతున్న వారిలో కొత్త లక్షణాలు గుర్తిస్తున్నట్లు పిల్లల డాక్టర్లు చెబుతున్నారు. అధిక జ్వరం, జలుబు, దగ్గు వంటివాటితో పాటు కళ్లు పుసులు కట్టడం, దురదగా ఉండటం వంటి లక్షణాల గురించి ఫిర్యాదు వస్తున్నట్లు వెల్లడించారు.
Read More »గేదేలు.. ప్లీజ్.. వందే భారత్ రైలు వైపు వెళ్లొద్దు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై, వందే భారత్ రైలు ప్రారంభోత్సవంపై వినూత్నంగా నిరసన తెలిపారు టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి. వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటివరకు దాదాపు 68 వరకు ప్రమాదాలు జరిగాయి. గేదెలు, ఆవులను ఢీకొని వందే భారత్ రైలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సతీష్ రెడ్డి ఓ గేదెలకు విజ్ఞప్తి చేశారు. “మోడీ గారు సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ …
Read More »దేశంలో కొత్తగా 5,335 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,335 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 25,587కి పెరిగింది. నిన్న 4,435 కరోనా కేసులు నమోదవగా.. ఇవాళ 900 కేసులు ఎక్కువగా నమోదవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Read More »పార్లమెంటులో ప్రతిపక్షాలు ఆందోళన
బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ విధానాలను నిరసిస్తూ ప్రతిపక్షాల ఆందోళన గురువారం కూడా కొనసాగింది.అదానీ ఆర్థిక నేరాలపై సమగ్ర విచారణకు గాను సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ)వేయాలని, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటును వెంటనే ఉపసంహరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందిన ప్రముఖులు, నాయకులపై ఐటీ,ఈడీ, సీబీఐలను ప్రయోగించి వేధింపులకు గురి చేయడాన్ని వెంటనే ఆపేయాలని బీఆర్ఎస్,కాంగ్రెసు, డీఎంకే, టీఎంసీ, ఎండీఎంకే,ఆప్, …
Read More »ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు పోలీసులునోటీసులు జారీ
తెలంగాణ సంచలనం సృష్టించిన టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ ఎమ్మెల్యే .. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఆయన ఇద్దరు పీఏలకు వరంగల్ పోలీసులునోటీసులు జారీ చేశారు. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కరీంనగర్ ఎంపీ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఏ1గా, బూర ప్రశాంత్‌ను ఏ2గా చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఏ2 ప్రశాంత్.. బండి సంజయ్‌తో …
Read More »గుండెపోటు మరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ పరిశీలన
ఇటీవల పలు రాష్ట్రాల్లో యువకులు గుండెపోటుతో మరణించారు. ఈ గుండెపోటులకు కోవిడ్తో ఏదైనా సంబంధం ఉందా అనే విషయాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని మాండవీయ చెప్పారు. గుండె పోటు, కోవిడ్ మధ్య సంబంధాన్ని కనుగొనేందుకు ప్రభుత్వం పరిశోధనలు ప్రారంభించిందని, రెండు మూడు నెలల్లో ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న వ్యాక్సిన్లు అన్ని వేరియంట్లకు వ్యతిరేకంగా పనిచేశాయని ఆయన అన్నారు.
Read More »దేశంలో కొత్తగా 3,038 కరోనా కేసులు
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు 3 వేలకు పైగానే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,038 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 21,179 కి చేరింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 5,30,901 మంది కరోనాతో మృతిచెందారు.
Read More »దేశంలో తగ్గని కరోనా
దేశంలో గత రెండున్నర వారాలుగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 3,824 పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 18,389 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.
Read More »