తెలంగాణలో ఈ ఏడాది కరోనాతో తొలి మరణం సంభవించింది. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా సోకిన వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. కరోనా టెస్టులు చేశారు. అతడికి పాజిటివ్ నిర్ధరణ అయింది. అటు ఏపీలోని విశాఖలోనూ కరోనా మరణం సంభవించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మూడు మరణాలు సంభవించాయి.
Read More »దేశంలో కరోనా కలవరం
దేశంలో కరోనా కలవరం మొదలైన నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. * మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. * 10 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వారు, గర్భిణులు అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దు. * వీలైనన్ని ఎక్కువసార్లు చేతులు శుభ్రం చేసుకోవాలి. * జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసలో ఇబ్బందులుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. * ఇంటి లోపల వేడి వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
Read More »దావూద్ ఇబ్రహీం పై విషప్రయోగం
పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోని కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. . విషప్రయోగం కారణంగా అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాక్ అధికారికంగా ధ్రువీకరించలేదు. సంబంధిత ఆసుపత్రిలో గట్టి నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.
Read More »భారత్ లో కొత్తగా కరోనా కేసులు
గడిచిన గత ఇరవై నాలుగంటల్లో దేశ వ్యాప్తంగా మూడోందల అరవై ఐదు కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటిలో కొత్తగా ఐదు మరణాలు కూడా సంభవించాయి. కేరళ రాష్ట్రంలో నలుగురు మృతి చెందారు. మిగిలిన ఒకరు యూపీ రాష్ట్రంలో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పదిహేడు వందల ఒకటిగా ఉంది. మొత్తం ఇప్పటివరకు నమోదైన కరోనా మరణలా సంఖ్య ఐదు లక్షల …
Read More »నా జీవితాన్ని ముగించడానికి అనుమతివ్వండి
ప్రముఖ సీనియర్ న్యాయమూర్తి లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యకు అనుమతి కోరుతూ యూపీలోని బందా జిల్లా మహిళా జడ్జి సీజేఐకు లేఖ రాశారు. ‘నేను చాలా కాలంగా వేధింపులకు గురవుతున్నా. నన్ను ఓ చెత్తలా చూశారు. అందువల్ల గౌరవప్రదంగా నా జీవితాన్ని ముగించడానికి అనుమతివ్వండి’ అని ఆమె కోరారు. సీజేఐ చంద్రచూడ్ సూచనతో ఆమె లేఖపై వెంటనే నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అలహాబాద్ హైకోర్టుకు లేఖ రాశారు.
Read More »జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌కు ఈడీ నోటీసులు
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీచేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని పీఎంఎల్‌ఏ చట్టం కింది కేసు నమోదుచేసింది. దీనికి సంబంధించి ప్రశ్నించేందుకు డిసెంబర్ 12న తమ ముందుకు రావాలని తాఖీదులచ్చింది. అయితే ఇదే కేసులో ఇప్పటికే ఆయనకు ఐదుసార్లు ఈడీ నోటీలిచ్చింది. ఇది ఆరోసారి కావడం విశేషం. రాంచీలోని జోనల్ ఆఫీసులో సోరెన్‌ను విచారించనున్నామని అధికారులు …
Read More »భారత్‌లో మరోసారి కరోనా కలవరం
సరిగ్గా దాదాపు మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ కనుమరుగైపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా కేసుల పెరుగుదల ఉలిక్కిపడేలా చేస్తోంది. భారత్‌లో మరోసారి పెద్ద సంఖ్యలో కేసులు పెరుగుదల కనిపించింది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 166 కొత్త కేసులు వెలుగుచూశాయి. చాలా రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడంతో అంతా ఆందోళనకు గురవుతున్నారు.
Read More »ఆర్టికల్ -370 రద్ధుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్ధుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్ధుపై జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా జమ్మూకశ్మీర్ లో వచ్చేడాది సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు లోపు ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి సూచించింది. ఇక జమ్మూ కశ్మీర్ నుంచి లద్ధాఖ్ ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్రం …
Read More »కేసీఆర్ త్వరగా కోలుకోవాలి – ప్రధాని మోదీ
తుంటి గాయమై సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేందర్ మోదీ ట్వీట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాయపడటం చాలా బాధాకరం . ఆయన త్వరగా కోలుకోవాలి.. ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను ” అని ట్వీట్ పేర్కోన్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాజకీయ ప్రముఖులు, …
Read More »‘ఒక్కడే మహిళను రేప్ ఎలా చేస్తాడు?-కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న తన అనుచరుడిని వెనుకేసుకురావడంతోపాటు బాధిత కుటుంబసభ్యులపై బెదిరింపులకు పాల్పడుతూ కర్ణాటక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అమరేగౌడ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనపై అమరేగౌడ అనుచరుడు సంగనగౌడ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఓ మహిళ గత నెల కొప్పల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.అయితే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో.. న్యాయం చేయాలని కోరిన బాధిత కుటుంబసభ్యులతో అమరేగౌడ ‘ఒక్కడే …
Read More »