ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు గణనీయంగా తగ్గడంపై వరల్డ్ హెల్త్ అర్గనైజేషన్ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు నెలల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు 70 నుంచి 90 శాతం తగ్గిపోయాయని వ్యాఖ్యానించారు. ఇలా చేయడం వల్ల ఉత్పరివర్తనాలు బయటపడకుండా పోతాయని వరల్డ్ హెల్త్ అర్గనైజేషన్ చీఫ్ హెచ్చరించారు. వైరస్ ముప్పు తొలగిపోలేదని.. కరోనా వ్యాప్తి, మార్పులకు లోనవడం, వైరస్ వల్ల మరణాలు సంభవించడం జరుగుతోందని …
Read More »తాలిబన్లు సంచలన నిర్ణయం
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల పాలనలో మహిళలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మహిళల ఉన్నత విద్యపై పలు కండిషన్లు పెట్టిన తాలిబన్లు.. తాజాగా మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీచేయడాన్ని నిలిపివేశారు. కాబూల్, ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఈ అంశమై ఆదేశాలు జారీ అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. డ్రైవింగ్ టీచర్లకు కూడా ప్రభుత్వ మార్గదర్శకాలు అందినట్లు పేర్కొంది.
Read More »లండన్ లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవo
ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ – యు.కే ఆధ్వర్యం లో లండన్ లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ 21 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ – యు.కే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి అద్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమం లో తెరాస నాయకులు, తెలంగాణ వాదులు హాజరు కావడం జరిగింది .కార్యక్రమం లో ముందుగా TRS పార్టీ జండాను అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి గారు …
Read More »చందమామను అణుబాంబులతో పేల్చాలని అనుకున్నారా..?
మీరు చదివిన వార్త నిజమే. చందమామను అణుబాంబులతో పేల్చేయాలని ప్రపంచంలోనే అగ్రదేశమైన అమెరికా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. చందమామను అణుబాంబులతో పేల్చేయాలని.. అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోచుకోవాలని అమెరికా ప్రయత్నాలు మమ్మురం చేసింది. ఇందులో భాగంగా రహస్యంగా ఓ ప్రభుత్వ విభాగాన్ని సైతం అమెరికా ఏర్పాటు చేసినట్లు సమాచారం. చంద్రుడ్ని ఎలా పేల్చివేయాలనే దానిపై పరిశోధనలకు దాదాపు వందల కోట్లు ఖర్చు చేసినట్లు గుసగుసలు. ఆ రహస్య విభాగం …
Read More »మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సారథ్యంలోని పీటీఐ పార్టీలో తిరుగుబాటుతో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని సర్దార్ అబ్దుల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇమ్రాన్ నియమించిన అబ్దుల్ పై 25 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఏడాది కిందట 53 స్థానాలున్న POKలో పీటీఐ 32 గెలిచింది. ఈ ఎన్నికలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. చివరికి మూన్నాళ్ల ముచ్చటగా …
Read More »మాజీ క్రికెటర్ దమ్మిక ప్రసాద్ నిరాహార దీక్ష
శ్రీలంక దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ పరిష్కారం చూపాలంటూ ఆ దేశ క్రికెట్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్ దమ్మిక ప్రసాద్ 24 గంటలపాటు నిరాహార దీక్ష చేశాడు. అధ్యక్షుడు గోటబయ రాజపక్స నివాసం ఎదుట ఆందోళన చేస్తున్న ప్రజలకు మద్దతు ప్రకటించి నిరసనల్లో పాల్గొన్నాడు. అలాగే 2019లో ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 269 మంది కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.
Read More »గుడ్ ఫ్రైడే సందర్భంగా TRS NRI దక్షిణాఫ్రికా శాఖ చారిటీ.
TRS NRI శాఖ ప్రతి సంవత్సరం చలికాలములో సౌత్ ఆఫ్రికా లో పలు ప్రదేశాలలో దుప్పట్లను పంపిణీ చేస్తుంది ఈ సంవత్సరం 2022 లో కూడా జొహ్యానెస్బర్గ్ లోని Midrand ప్రదేశములో Midrand పోలీస్ శాఖతో కలిసి దుప్పట్లను పంపిణి చేసింది. ఈ పంపిణి కార్యక్రమములో సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల ,హరీష్ రంగ ,విషు జై గుండా, నవదీప్ రెడ్డి, నరేష్ తేజ తదితరులు పాల్గొన్నారు. …
Read More »ఒమిక్రాన్ బాధితుల గురించి షాకింగ్ న్యూస్
యావత్ ప్రపంచాన్ని గజగజ వణికించిన డెల్టా వేరియంట్ సోకినవారితో పోలిస్తే ఒమిక్రాన్ బాధితుల్లో కొవిడ్ లక్షణాలు 2 రోజుల ముందుగానే తగ్గుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటన్లో 2 డోసులు తీసుకున్న తర్వాత కూడా మహమ్మారి బారిన పడ్డ 63 వేల మంది డేటాను.. ‘కింగ్స్ కాలేజ్ లండన్’ పరిశోధకులు పరిశీలించగా ఈ వెల్లడయ్యాయి. మూడో డోసు కూడా తీసుకున్నవారిలోనైతే.. ఒమిక్రాన్ లక్షణాలు మరింత తక్కువ కాలంలోనే అదృశ్య మయ్యాయని …
Read More »ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ లకు రష్యా అధ్యక్షుడు పుతిన్ షాక్
ఒకవైపు ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సర్కార్ తగ్గేదే లే అంటూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఆర్డెర్ లను తమ దేశంలోకి ప్రవేశించకుండా రష్యా నిషేధం విధించింది. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన మంత్రులు, పార్లమెంటేరియన్లు 228 మంది,న్యూజిలాండక్కు చెందిన 130 …
Read More »యుద్ధం ఆపేందుకు రష్యా మరో ప్రతిపాదన
ఉక్రెయిన్ దేశంపై రష్యా చేస్తున్న యుద్ధం ఆపేందుకు మరో ప్రతిపాదన చేసింది. చర్చల సందర్భంగా సూచించిన షరతులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరిస్తే మిలిటరీ ఆపరేషన్ నిలిపివేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా నాటోలో చేరాలనే అన్ని ప్రణాళికలను ఉక్రెయిన్ విరమించుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఇటీవల పుతిన్, జెలెన్ స్కీ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.. అయితే ఉక్రెయిన్లోని బుచాలో రష్యా …
Read More »