Home / INTERNATIONAL (page 4)

INTERNATIONAL

అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు మళ్లీ కరోనా

అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ కరోనా బారినపడ్డారు. కోవిడ్ నుంచి కోలుకున్నట్లు అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రకటించిన మూడు రోజుల్లోనే.. వ్యాధి మళ్లీ ఆయనకు తిరగబెట్టింది. దీంతో మరోమారు ఆయన ఏకాంతంలోకి వెళ్లారు. అయితే బైడెన్ కు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ డాక్టర్ కెవిన్ తెలిపారు.

Read More »

గూగుల్ కో-ఫౌండర్ భార్యతో ఎఫైర్? -మస్క్ సంచలన వ్యాఖ్యలు

గూగుల్ కో-ఫౌండర్ సర్జే బ్రిన్ భార్య నికోల్ షనహాన్ తో ఎఫైర్ పై ప్రముఖ వరల్డ్ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. తాను, బ్రిన్ మంచి స్నేహితులమని, అతడి భార్యను గత మూడేళ్లలో రెండుసార్లే చూశానని చెప్పారు. అప్పుడు కూడా తాము జనాల మధ్యలోనే ఉన్నామని, అలాంటప్పుడు రొమాన్స్ ఎలా చేయగలమంటూ సెటైర్ వేశారు. కాగా నికోల్, మస్క్ ఎఫైర్ కారణంగా బ్రిన్ తన భార్యకు విడాకులు …

Read More »

డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూత

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ఆమె అద్భుతమైన, అందమైన మహిళ అని, ఆమె జీవితం స్ఫూర్తిదాయకం అని ట్రంప్ ట్వీట్ చేశారు. మరణానికి గల కారణాలను పేర్కొనలేదు. 1977లో ట్రంప్, ఇవానా పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. 1990లో విడాకులు తీసుకున్నారు. 1993లో నటి మార్గాను ట్రంప్ పెళ్లి చేసుకున్నారు. 1999లో ఆమెను వదిలేసి, 2005లో మెలానియా ట్రంపు పెళ్లాడారు.

Read More »

69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్న రష్యా అధ్యక్షుడు

రష్యా అధ్యక్షుడు పుతిన్ 69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్నట్లు జనరల్ ఎస్వీఆర్ టెలిగ్రాం ఛానల్ వెల్లడించింది. ఆయన ప్రేయసి, మాజీ జిమ్నాస్ట్ అలీనా కబయెవా ప్రెగ్నెంట్ అని పేర్కొంది. లింగ నిర్ధారణ పరీక్షల్లో ఆడపిల్లగా తేలిందని తెలిపింది. వీరికి ఇప్పటికే ఇద్దరు కొడుకులున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయం బయటపడకుండా ఆమెను రహస్యంగా స్విట్జర్లాండ్లో కొన్నేళ్లపాటు ఉంచారు.

Read More »

ఆటా అంటే ఆంధ్ర -తెలంగాణ అసోసియేషన్

అమెరికాలోని తెలుగు ప్రజలు భారతదేశం గర్వించే స్థితికి చేరుకున్నారని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆటా అంటే ఆంధ్ర, తెలంగాణ అసోసియేషన్‌గా అభివర్ణించారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని వెల్లడించారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జరుగుతున్న అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించారు. రచయిత్రి ప్రభావతి రాసిన …

Read More »

శృంగారం తర్వాత అన్ని మరిచిపోతున్నాడని…?

ఐర్లాండ్‌కు చెందిన ఓ 66 ఏండ్ల వృద్ధుడు తన భార్యతో శృంగారంలో పాల్గొన్న పది నిమిషాల తర్వాత అన్నీ మర్చిపోతున్నాడట. రెండు మూడు రోజుల క్రితం ఏం జరిగిందన్నది అతనికి అస్సలు గుర్తుకు రావడం లేదట. అరుదైన ఈ కేసు గురించి ఐరిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించారు.ఇలా మర్చిపోవడాన్ని ట్రాన్సియెంట్‌ గ్లోబల్‌ అమ్నీషియా(టీజీఏ) అంటారని వైద్యులు తెలిపారు. ఇది అరుదైన వ్యాధి అని, 50-70 ఏండ్ల వయస్సున్నవారిలో కనిపిస్తుందని పేర్కొన్నారు. …

Read More »

వ్లాదిమిర్ పుతిన్ పై హత్యాయత్నం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై హత్యాయత్నం జరిగిందని ఉక్రెయిన్ కు చెందిన ప్రముఖ మీడియా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ దాడి రెండు నెలల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై  జరిగింది. దాని నుంచి ఆయన తప్పించుకున్నారని ఉక్రెయిన్‌ రక్షణ నిఘా విభాగాధిపతి కైరిలో బుడనోవ్‌ సంచలన విషయం వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే ఇది జరిగిందని పేర్కొన్నారు. నల్లసముద్రం, కాస్పియన్‌ …

Read More »

కరోనా ఉదృత్తి -భారత్ కు సౌదీ అరేబియా షాక్

గత కొన్ని వారాలుగా దేశంలో  కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో భారతదేశానికి ప్రయాణించడాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధించింది. మొత్తం 16 దేశాలను ఈ జాబితాలో చేర్చింది. కరోనా మహమ్మారి ఇంకా నశించలేదని, జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ దేశాలకు WHO హెచ్చరించిన నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం ఈ చర్యలకు సిద్ధమైంది. భారత్లో గత 24 గంటల్లో 2,226 కరోనా కేసులు నమోదవగా మొత్తం 14,955 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Read More »

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న సరికొత్త వైరస్

నిన్న మొన్నటివరకు ప్రపంచాన్ని కరోనా వణికించిన సంఘటన మరవకముందే మరో సరికొత్త వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంకీపాక్స్  కేసులు ప్రపంచ వ్యాప్తంగా  విస్త‌రిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా  దాదాపు 11 దేశాల్లో సుమారు 80 కేసులు న‌మోదు అయిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ద్రువీక‌రించింది. మంకీపాక్స్ వైర‌స్ వ్యాప్తిపై విస్తృతంగా స్ట‌డీ చేస్తున్న‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో వెల్ల‌డించింది. కొన్ని దేశాల్లోని జంతు జ‌నాభాలో ఆ వైర‌స్‌ను ఎండ‌మిక్‌గా గుర్తించిన‌ట్లు …

Read More »

ప్రపంచాన్ని వణికిస్తోన్న మరో కొత్త వైరస్ -అమెరికాలో తొలి కేసు న‌మోదు

అమెరికాలో మంకీపాక్స్ వైర‌స్ కేసు న‌మోదు అయ్యింది. ఆ దేశ అంటువ్యాధుల సంస్థ సీడీసీ ఈ కేసును ద్రువీక‌రించింది. మాసాచుసెట్స్‌కు చెందిన ఓ వ్య‌క్తికి ఈ వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. అయితే ఆ వ్య‌క్తి ఇటీవ‌ల కెన‌డాలో ప‌ర్య‌టించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అత‌న్ని మ‌సాచుసెట్స్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. కెన‌డాలోని క్యూబెక్ ప్రావిన్సులో డ‌జ‌న్ల సంఖ్య‌లో ఇలాంటి కేసులు న‌మోదు అయిన‌ట్లు తెలుస్తోంది. మంకీపాక్స్‌ను సీరియ‌స్ వైర‌స్ కేసుగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat