తెలంగాణకి మరో పెట్టుబడి రానున్నది. ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా జహీరాబాద్లో తన అతి పెద్ద ట్రాక్టర్ తయారీ కేంద్రాన్ని కలిగి ఉన్నది. ఇక్కడ వంద కోట్ల రూపాయల అదనపు పెట్టుబడి పెట్టనున్నట్లు మహీంద్రా గ్రూప్ ఈ రోజు ప్రకటించింది. మహీంద్రా తన కె2 సిరీస్ ట్రాక్టర్ల తయారీ కి సంబంధించి ఈ అదనపు పెట్టుబడి వినియోగించనున్నట్లు తెలిపింది. జహీరాబాద్ లో ఉన్న తన ట్రాక్టర్ల తయారీ యూనిట్ వద్ద …
Read More »హైదరాబాద్ మరింత సురక్షితంగా, భద్రంగా : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగంరంలోని బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం మరో రెండు, మూడు నెలల్లో పూర్తి అవుతుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నిర్మాణం పూర్తితో హైదరాబాద్ నగరం మరింత సురక్షితంగా, మరింత భద్రంగా మారనున్నట్లు చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్ నేడు పరిశీలించారు. హోంమంత్రి మహమూద్ అలీ, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మేయర్ …
Read More »జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు మోగిన నగారా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నగారా మోగింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని మసబ్ ట్యాంక్‌లో 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి షెడ్యూల్ విడుదల చేశారు. బుధవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, 24న ఉప సంహరణ కార్యక్రమం ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. డిసెంబర్ …
Read More »నేడే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ, డిసెంబర్ 1న ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మేరకు మంగళవారం ఉదయం 10.30గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి మీడియా సమావేశం నిర్వహించనుండగా.. ఈ సందర్భంగా ఆయన నోటిఫికేషన్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కోసం ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం …
Read More »జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 24 బస్తీ దవాఖానాలు
హైదరాబాద్‌లోని పేదలకు మరిన్ని వైద్య సౌకర్యాలు కల్పించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే 199 బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తీసుకువచ్చింది..ఈ రోజు గురువారం నుండి మరో 24 అందుబాటులోకి రానున్నాయి. వాటిని ఉపసభాపతి పద్మారావుతోపాటు.. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. కొత్తగా కాచిగూడ, పార్శీగుట్ట, కుత్బుల్లాపూర్, గూలిపూర, మలక్‌పేట్, కవాడిగూడ పరిధిలో ప్రారంభంకానున్నాయి. దూల్‌పేట్, ఎర్రగడ్డ, …
Read More »హైదరాబాద్‌లో 137 లింక్ రోడ్లు : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మొత్తం 137 లింక్ రోడ్లను ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ రెండు లింక్ రోడ్లను ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. మొదటిదశలో 35 లింక్ రోడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ రోడ్ల నిర్మాణానికి రూ. 313కోట్ల 65 లక్షలు మంజూరు చేసి ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. మరో 100 లింక్ రోడ్లను అభివృద్ధి చేయబోతున్నామని స్పష్టం చేశారు. …
Read More »ఏక్షణంలోనైన జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితా ఈ నెల 13న రానుంది నవంబర్ 13 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి తెలిపారు. జీహెచ్ఎంసీ లో 150 వార్డులు, 30 సర్కిళ్లు ఉన్నాయని.. ప్రతీ సర్కిల్ కు ఒక డిప్యూటీ కమిషనర్ ఉన్నారు. 150 డివిజన్లకు 150 మంది ROలను …
Read More »భాగ్య నగర ప్రజలకు సీఎం కేసీఆర్ భరోసా
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు రూ.550 కోట్లు కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో భరోసా దక్కిందని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తంచేశారు. వరదలతో ప్రజలు అవస్థ పడుతున్న ప్రస్తుత పరిస్థితిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపట్టడంపై హైదరాబాద్‌వాసుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
Read More »గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త
వారం రోజులుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, ముంచెత్తుతున్న వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుండటంతో బాధితులను ఆదుకొనేందుకు నేనున్నానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభయమి చ్చారు. భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన సోమవారం తెలిపారు. వరద ప్రభావానికి గురైన కుటుంబాలకు ఇంటికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. వర్షాలు, వరదల …
Read More »హైదరాబాద్‌లో హైఅలర్ట్.. రోడ్లు మూసివేత
హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. -ఉప్పల్ – ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ – కోఠి రోడ్లు మూసివేత -బేగంపేటలో రహదారిపై భారీగా వరద నీరు -కాచిగూడ రైల్వేష్టేషన్‌లో పట్టాలపై నిలిచిన వర్షపు నీరు -నిజాంపేటతో పాటు బండారి లేఅవుట్ …
Read More »