ఎన్నికలప్పుడు ఏడాదికి కోటి ఉద్యోగాలిస్తామన్న బీజేపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఆరేండ్లు ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏండ్లుగా అమలుకాని ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులిచ్చామని చెప్పారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభీ వాణీదేవి, మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి సనత్‌నగర్‌లోని …
Read More »కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు
కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగవు. అందరూ ధైర్యంగా వ్యాక్సిన్ వేసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. బుధవారం పద్మారావు గౌడ్, సతీమణి స్వరూప సికింద్రాబాద్ దవాఖానలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ ను రూపొందించడంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి అమోఘమని అన్నారు. వ్యాక్సిన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు
Read More »జీహెచ్ఎంసీలో 29 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు 29 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 80,878 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు
Read More »ఏప్రిల్ 1 నుంచి కాచిగూడ-రేపల్లె ఎక్స్ప్రెస్
ఏప్రిల్ 1 నుంచి కాచిగూడ-రేపల్లె ఎక్స్ప్రెస్ ప్రారంభం కానుంది. రేపల్లెలో ప్రతిరోజూ రాత్రి 10.40కు బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు ఉదయం 7.05కు కాచిగూడ చేరుతుంది. కాచిగూడలో రాత్రి 10.10కి బయల్దేరి.. తర్వాతి రోజు ఉదయం 5.50కు రేపల్లె చేరుతుంది. ఈ రైలు పల్లెకోన, భట్టిప్రోలు, వేమూరు, చినరావూరు, తెనాలి, వేజండ్ల, గుంటూరు, బీబీనగర్ ఘట్ కేసర్, చర్లపల్లి, మల్కాజ్గిరి స్టేషన్లలో ఆగుతుంది
Read More »లక్ష్యానికి మించి సభ్యత్వాలు నమోదు చేయాలి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129 సూరారం డివిజన్ పరిధిలోని కళావతి నగర్ లో స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యత్వ రశీదులు కార్యకర్తలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్ ధ్యేయమని, అందుకే ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని …
Read More »మాస పత్రికను ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
ప్రతి అక్షరం ప్రజల పక్షాన ఉండాలని తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు అన్నారు. గురువారం సికింద్రాబాద్ లో శ్రీవెన్ టైమ్స్ మాస పత్రిక ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీ. పద్మారావు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించే వేదికగా ఈ మాస పత్రిక పత్రిక ఉండాలని ఆకాంక్షించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా నిలవాలని కోరారు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ పత్రిక వేదిక …
Read More »సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ కార్పొరేటర్ కాసాని సుధాకర్ గారి ఆధ్వర్యంలో పూర్తి చేసిన 175 సభ్యత్వాలు, రుసుమును ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారికి తన నివాసం వద్ద కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వారిని అభినందించారు. సభ్యత్వ నమోదుకు తక్కువ సమయం ఉన్నందున నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వాడ వాడలా తిరిగి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ …
Read More »మేయర్ గా గద్వాల విజయలక్ష్మి బాధ్య తలు స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి బాధ్య తలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని, కె.కేశవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 11న జరిగిన బల్దియా మేయర్ ఎన్నికల్లో తెరాస తరఫున కార్పొరేటర్గా గెలుపొందిన విజయలక్ష్మి మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా శ్రీలత …
Read More »ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్
ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. బయో ఏషియా-2021 ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. టీకాల రాజధానిగా హైదరాబాద్ అని చెప్పుకోవడం గర్వకారణం అని పేర్కొన్నారు. భారత్ బయోటెక్ సంస్థ కొవార్టిన్ టీకాను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు మరింత విస్తరిస్తున్నాయని అన్నారు..
Read More »శ్రమించే అమ్మే.. చదివించే టీచర్.. ఓ అమ్మ కథ మీకోసం..
చదవడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఇదే నిజం. పై చిత్రంలో కన్పిస్తున్న మహిళ పేరు రమ. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం తడ్కల్ నుంచి ఇద్దరు పిల్లలతో కల్సి ఆమె కుటుంబం హైదరాబాద్ మహానగరానికి వలస వచ్చారు. నగరంలోని అంబర్ పేటలో ఉంటోంది. రమ భర్త రమేష్ చెప్పులు కుట్టడం ద్వారా వచ్చే కొద్దిపాటిసంపాదనతో జీవన గడుపుతూ ఉండేవారు. అయితే కరోనా మహమ్మారి ఎందరో …
Read More »