హైదరాబాద్‌లో మరో బహుళజాతి కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్ (ఎంఈఐసీ)ను బుధవారం నానక్‌రామ్‌గూడలో ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. అమెరికాకు బయట మెడ్‌ట్రానిక్ సంస్థ ఏర్పాటుచేసిన అతి పెద్ద ఇన్నోవేషన్ సెంటర్ ఇదే కావటం విశేషం. హైదరాబాద్ సెంటర్‌లో 160 మిలియన్ డాలర్ల (రూ.1200 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. రానున్న ఐదేండ్లలో దాదాపు వెయ్యిమందికి ఈ సెంటర్‌లో …
Read More »మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన : మంత్రి కేటీఆర్
నానక్‌రామ్‌గూడ బీఎస్ఆర్ టెక్ పార్కులో మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం ప్రారంభించారు. అమెరికాకు చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్ ట్రానిక్.. రూ. 1200 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రపంచస్థాయి వైద్య పరికరాల ఇంజినీరింగ్, ఆవిష్కరణలు చేయనుంది. దీనిద్వారా హెల్త్‌కేర్ రంగంలో ఇంజినీరింగ్ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మెడ్‌ట్రానిక్ పనిచేస్తున్నది. ఈ సంస్థ …
Read More »సంక్షేమ సంఘాలు కాలనీల అభివృద్ధికి దోహదపడాలి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని సుమిత్ర నగర్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద సభ్యులందరూ మర్యాదపూర్వంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ సభ్యులందరూ ఐకమత్యంతో ఉండి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాలనీ అభివృద్ధికి తన పూర్తి …
Read More »మంత్రి మల్లారెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు…
ఇటీవలే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించిన అంతర్రాష్ట్రీయ కబడ్డీ పోటీలను జిల్లా మంత్రి మల్లారెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి గారు గాయపడగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీలు నవీన్ రావు గారు, శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్ గారు, మాధవరం కృష్ణా రావు గారు మంత్రి మల్లారెడ్డి గారిని బోయిన్ పల్లి లోని తన నివాసం వద్ద కలిసి పరామర్శించారు.
Read More »హైదరాబాద్‌లో వ్యాక్సినేషన్ వేగవంతం
హైదరాబాద్‌లో కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోలో వాక్సినేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల వద్ద వ్యాక్సిన్ కోసం క్యూ కట్టారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వారికి వాక్సినేషన్ వేయనున్నారు. 80 లక్షల మంది 45 ఏళ్ళుపై బడిన వారు ఉన్నట్టు ఆరోగ్య శాఖ గుర్తించింది.
Read More »గ్రేటర్ హైదరాబాద్ కు మళ్లీ పాతరోజులు వస్తాయా..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాద్ పరిధిలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది గడిచిన 24 గంటల్లో మరో 142 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన స్టేట్ హెల్త్ బులెటిన్ లో తెలిపారు. దీంతో ఇప్పటివరకు 82,438 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సామాజిక దూరం పాటించి, మాస్క్ ధరించాలని అధికారులు తెలియజేశారు
Read More »చెత్తను తరలించేందుకు స్వచ్ఛ ఆటోలు -మంత్రి కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే 2500 స్వచ్ఛ ఆటోలు నడుస్తున్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. గురువారం ఉదయం కెటిఆర్ స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా 325 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెత్తను తరలించేందుకు ఇంతవరకు ఉన్న పాత వాహనాలకు స్వస్తి పలికి స్వచ్ఛ ఆటోలను నడిపిస్తున్నామని ఆయన చెప్పారు. ఒక్కో స్వచ్ఛ ఆటో 1.5 మెట్రిక్ టన్నుల గార్బేజ్ ను తరలిస్తుందని ఆయన పేర్కొన్నారు. …
Read More »ఎమ్మెల్సీ వాణీదేవి కారుకు ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారు ప్రమాదానికి గురైంది. అసెంబ్లీ గేట్ నంబర్ ఎనిమిదిని ఆమె కారు ఢీకొన్నది. ఎమ్మెల్సీని మండలి వద్ద దింపి వస్తుండగా ప్రమాదం జరిగింది. పార్కింగ్ చేస్తుండగా అదుపుతప్పిన కారు రైల్వే కౌంటర్ సమీపంలోని గేటుపైకి దూసుకెళ్లింది. దీంతో కారుటైరు పేలిపోయింది. ప్రమాద సమయంలో కారును ఎమ్మెల్సీ గన్‌మెన్ నడిపినట్లు సమాచారం. అయితే భారీగా శబ్ధం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Read More »గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 111 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో మరో 111 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన స్టేట్ హెల్త్ బులెటిన్ లో తెలిపారు. దీంతో ఇప్పటివరకు 81,901 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. సెకండ్ వేవ్ పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read More »ఆధిక్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి
తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైద్రాబాద్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సరూర్‌నగర్‌లో జరుగుతున్న రెండో ప్రాధాన్యత లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి సురభివాణి దేవి ఆధిక్యంలో ఉన్నారు. రెండో ప్రాధాన్యతా ఓట్లు పొందిన అభ్యర్థుల వివరాలు… వాణీదేవి – 2, 354 రామచంద్రరావు – 1,897 ప్రొఫెసర్ నాగేశ్వర్ – 2,132 చిన్నారెడ్డి – 1,325 ఇప్పటివరకు అభ్యర్తుల మెత్తం ఓట్లు… టీఆర్ఎస్ …
Read More »