ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్రమోదీ రేటింగ్ క్రమంగా పడిపోతూ వస్తున్నది. దేశం యావత్తూ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు విలవిల్లాడుతున్న తరుణంలో గ్లోబల్ లీడర్‌గా ప్రధాని మోదీ రేటింగ్ అత్యంత కనిష్టానికి పడిపోయింది. ఈ విషయాన్ని ఆమెరికాకు చెందిన ఒక సర్వే సంస్థ తన నివేదిక స్పష్టం చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సైతం భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత …
Read More »ఆశా వర్కర్లకు అండగా నిలిచిన కార్పొరేటర్ హేమ సామల
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలోని సీతాఫలమండి లో ఆశా వర్కర్లు గా పని చేస్తున్న వారికి కార్పొరేటర్ హేమ సామల గారి అధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్ గారు హాజరై ఆశా వర్కర్లు కి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లకు అండగా నిలిచిన కార్పొరేటర్ హేమ …
Read More »సోషల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు ఒప్పందం
హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో భాగమైన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (KSPP), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖల నిర్వహణలోని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC)తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ ఇన్నోవేషన్ అధికారి రవి నారాయణ్, గీతం రిజిస్ట్రార్ ప్రొ.డి.గుణశేఖరన్, సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ శ్రీధర్ పబ్బిశెట్టి సంతకం చేసిన అవగాహన ఒప్పందం మేరకు …
Read More »GHMCలో కరోనా కట్టడీపై ఇంటింటి సర్వే
తెలంగాణలో కొవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేస్తున్న ఇంటింటి సర్వే బుధవారం కూడా కొనసాగింది. జ్వరం, ఇతర కొవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తుల జాబితాను సిబ్బంది నమోదు చేస్తుంది. జీహెచ్‌ఎంసీ, ఆరోగ్య శాఖకు చెందిన క్షేత్రస్థాయి కార్మికులతో కూడిన మొత్తం 707 బృందాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 41,305 ఇండ్లను సర్వే చేశాయి. కొవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి ఈ బృందాలు 19,090 మందిని బస్తీ …
Read More »సైబరాబాద్‌లో 17మంది ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 17మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. శామీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌గా సుధీర్‌కుమార్, ఆర్‌సి పురం ఇన్స్‌స్పెక్టర్‌గా వెంకటేశ్వర్‌రెడ్డి, పేట్‌బషీరాబాద్ డిఐగా కరంపురి రాజును నియమించారు. శామీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌ను యాంటి హ్యుమన్ ట్రాఫికింగ్ యునిట్‌కు బదిలీ చేశారు. ఆర్‌సి పురం ఇన్స్‌స్పెక్టర్ జగదీశ్వర్‌ను సిపిఓకు బదిలీ చేశారు. సైబర్ క్రైంలో పనిచేస్తున్న సునీల్, …
Read More »సికింద్రాబాద్‌లో తప్పిన అగ్నిప్రమాదం
హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాల్లో భారీ ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం బన్సీలాల్‌పేట్ చౌరస్తాలో ఉన్న జబ్బార్ కాంప్లెక్స్‌లోని ఓ చెప్పుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాపులో ఉన్న సరుకు అంతా కాలి బూడిదయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని తెలిపారు.
Read More »గ్రేటర్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్
గ్రేటర్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 1,259 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 97,178 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ఆస్పత్రిలో పరీక్షలు చేసుకోవాలని తెలిపారు.
Read More »GHMC పరిధిలో కరోనా డేంజర్ బెల్స్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని GHMC పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 1,464 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 95,919 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ఆస్పత్రిలో పరీక్షలు …
Read More »నాగశేఖర్ గౌడ్ గారు లేని లోటు తీర్చలేనిది : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ప్రసూన నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగశేఖర్ గౌడ్ గారి అకాల మరణం పట్ల కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు చింతల్ లోని తన కార్యాలయం వద్ద నాగశేఖర్ గౌడ్ గారి ఫోటో కు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు …
Read More »గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కల్లోలం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 989 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 93,450 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
Read More »