తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన (ఆహార భద్రత కార్డు) కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని మీర్పేట్ హెచ్. బి. కాలనీ డివిజన్ ఫేస్ వన్ ప్లే గ్రౌండ్ ఆవరణంలో ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్ లతో కలిసి లాంఛనంగా ప్రారంభించి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఆహారభద్రత కార్డు నిరుపేదలకు ఎంతగానో …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా- ఎమ్మెల్యే వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే ని కలిసేందుకు కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు, నాయకులకు తన నివాసం వద్ద ఉన్న కార్యాలయంలో అందుబాటులో ఉంటూ స్వయంగా వారి సమస్యలను తెలుసుకుంటూ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు …
Read More »ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించుకుంటున్నారు. మహంకాళి బోనాల ఉత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై అమ్మవారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారికి బోనం సమర్పించారు.
Read More »గ్రేటర్ ప్రజలకు GHMC మేయర్ పిలుపు
సమస్యలపై ప్రజలు తనకు కూడా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ఇవాళ ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మేయర్ మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్ (040 23111-1111)కు 295 ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలిపారు. డయల్ 100, మై జీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా కూడా సమస్యలపై …
Read More »అమ్మవారి చీరె తయారీని ప్రారంభించిన మంత్రి తలసాని
ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా యేటా సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టుచీర సమర్పించడం ఆనవాయితీ. ఈ నెల 25న బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి సమర్పించేందుకు చేపట్టిన చీరె తయారీని సోమవారం అమ్మవారి ఆలయంలో రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మశాలి సంఘం ప్రతినిధులతో కలిసి శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 మంది …
Read More »మూడో బోనం నేడే
చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం ఆషాఢ మాసం మూడో బోనం ఆదివారం జరగనున్నది. ఈ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల నుంచి తొట్టెల ఊరేగింపు కోటకు రానుందని ఆలయ ట్రస్టు చైర్మన్ కోయల్‌కార్ గోవింద్‌రాజ్ తెలిపారు. కోటలో మూడో బోనం జరుపుకోవడానికి వచ్చే భక్తులకు ప్రభుత్వం తరఫున సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని, భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.
Read More »ఆలయాల అభివృద్ధిలో ఎప్పుడూ ముందుంటా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ 128 డివిజన్ పరిధిలోని న్యూ లాల్ బహదూర్ నగర్ లో నూతనంగా చేపడుతున్న అభయాంజనేయ స్వామి ఆలయ స్లాబ్ పునః నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని కార్పొరేటర్ రావుల శేషగిరి రావు గారు, స్థానిక డివిజన్ అధ్యక్షులు మహ్మద్ రఫీ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని …
Read More »హైదరాబాద్ నగర శివారులో మంచినీటి సమస్య పరిష్కారానికి రూ.1200 కేటాయించిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌లో మంగళవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర శివారులోని మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్యపై కేబినెట్ చర్చించింది. సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ రూ.1200 కోట్లు మంజూరు చేశారు. నీటి ఎద్దడి నివారణకై తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే కేబినెట్‌కు పల్లె, పట్టణ ప్రగతిపై పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖలు నివేదికలు సమర్పించాయి. రాష్ట్రంలో వైకుంఠధామాలను …
Read More »సీఎం కేసీఆర్‌కు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవ ఆహ్వానం
ఈ నెల 13వ తేదీన జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలకు సతీసమేతంగా హాజరుకావాలని కోరుతూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన ట్రస్టీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందించింది. శుక్రవారం ప్రగతిభవన్‌లో దేవస్థాన ట్రస్టీ ఫౌండర్ కె.సాయిబాబ గౌడ్, ఈవో అన్నపూర్ణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆహ్వానించారు. సీఎంకు ఆహ్వానం పలికిన వారిలో ఆలయ అర్చకులు, ట్రస్టుబోర్డు సభ్యులు తదితరులున్నారు. 12వ …
Read More »మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని సంజీవయ్య నగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాటిన మొక్కలను వృక్షంలా నీరు పోసి పెంచాలన్నారు. అనంతరం ఆ ప్రాంతంలో రోడ్డుకు …
Read More »