కొవిడ్ శరవేగంగా నగరాన్ని చుట్టేస్తోంది. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత నెలలో వచ్చిన మొత్తం కేసుల కంటే ఇప్పుడు కేవలం వారం రోజుల్లోనే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం రోజుకు సగటున 576 వరకు కేసులు నమోదయితే, శనివారం ఒక్కరోజే 1,583 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన ఎనిమిది రోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 6,610 మందికి వైరస్ సోకింది. …
Read More »గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 979 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,48,873 కరోనా కేసులు నమోదయ్యాయి. నగరంలో ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు
Read More »హైదరాబాద్ నగరంలో కొత్తగా 294 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 294 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,47,235 కరోనా కేసులు నమోదయ్యాయి. నగరంలో ‘ఒమిక్రాన్’ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. టీనేజర్స్ ప్రతీ ఒక్కరూ వాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
Read More »హైదరాబాద్ ప్రజలకు న్యూ ఇయర్ కానుక
న్యూ ఇయర్ కానుకగా హైదరాబాద్ ప్రజల కోసం షేక్ పేట్ ఫ్లైఓవర్ ను ఈ రోజు మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. రూ. 333.55 కోట్ల అంచనాతో నిర్మించిన 2.8కి.మీ ఈ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి JNTU జంక్షన్ వరకు 17 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్యలు లేకుండా సులభతరం చేయనుంది.
Read More »న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పలు ఆంక్షలు
న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పలు ఆంక్షలు విధించిన పోలీసులు.. క్యాబ్ డ్రైవర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్యాబ్ డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలన్న పోలీసులు.. రాత్రి వేళల్లో క్యాబ్ బుక్ చేస్తే, డ్రైవర్లు రద్దు చేయటానికి వీల్లేదన్నారు. క్యాబ్ సర్వీసును రద్దు చేస్తే రూ.500 జరిమానా వేస్తామన్న పోలీసులు.. సమస్య వస్తే 9490617111 నెంబర్కు వాట్సాప్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
Read More »మిథాని- ఓవైసీ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన మంత్రి KTR..
హైదరాబాద్ నగరంలోని ఓవైసీ వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్లై ఓవర్‌ను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. మూడు లైన్లలో 12 మీటర్ల వెడల్పుతో వన్‌వే మార్గంగా మిథాని జంక్షన్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు 1.36 …
Read More »అందుబాటులోకి హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది.ఎస్ఆర్డీపీ లో భాగంగా ఒవైసీ-మిథాని జంక్షన్లో రూ.80కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు ఉ.10.30లకు ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ కంచన్ బాగ్ ని పిసల్బండ్ డీఆర్డీఎల్ వైపు నుంచి ఒవైసీ ఆస్పత్రి జంక్షన్ మీదగా ఎల్బీ నగర్ వరకు వెళుతుంది. దీంతో ఎస్ఆర్డీపీలో ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వంతెనల సంఖ్య 13, అండర్పస్ …
Read More »గ్రీన్ఇండియా చాలెంజ్ లో బిగ్ బాస్ 5 విన్నర్ వి.జె సన్నీ…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా జర్నలిస్ట్ కాలనీ లోని జి.హెచ్.ఎం.సి పార్క్ లో మిత్రులతో కలిసి మొక్కలు నాటిన బిగ్ బాస్ 5 విన్నర్ వి.జె సన్నీ…ఈ సందర్భంగా వి.జె సన్నీ మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి కార్యక్రమం అద్బుతమని …
Read More »క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించండి : TS హైకోర్టు
కొవిడ్ పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో.. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని కోర్టు పేర్కొన్నది. రెండు, మూడు రోజుల్లో ఈ వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వేడుకల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఢిల్లీ, మహారాష్ట్ర తరహా నిబంధనలు పరిశీలించాని …
Read More »లంచాలు తీసుకుని ఇండ్లిస్తామంటే నమ్మొద్దు- మంత్రి కేటీఆర్…
లంచాలు తీసుకుని ఇండ్లు ఇస్తామని చెప్తే నమ్మొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇండ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట డివిజన్ చాచా నెహ్రూనగర్‌లో నూతనంగా నిర్మించిన 248 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని పేదలందరికి ఇండ్లు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. …
Read More »