గత ఏడాది కాలంగా వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్లు సహా పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను కోల్పోతున్న టెక్ దిగ్గజం యాపిల్‌కు మరో గట్టి షాక్ తగిలింది. తన పేరిట 1000 కంపెనీ పేటెంట్లు కలిగిన సీనియర్ డిజైనర్ పీటర్ రసెల్ క్లార్క్ రాజీనామా చేశారు. టెక్ దిగ్గజంలో దాదాపు రెండు దశాబ్ధాల పాటు సేవలందించిన క్లార్క్ కంపెనీ నుంచి వైదొలిగారు.యాపిల్‌లో క్లార్క్ చివరి ప్రముఖ సీనియర్ ఇండస్ట్రియల్ డిజైనర్ కావడం గమనార్హం. …
Read More »రతన్ టాటా ప్రాణానికి ముప్పు
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రాణానికి ముప్పు ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. కొద్దిరోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టాటా ప్రాణానికి ముప్పు ఉందని, భద్రత పెంచకపోతే సైరస్ మిస్త్రీలాగే అవుతుందని ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూంకి కాల్ చేసి హెచ్చరించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు తెలిపారు.
Read More »యాపిల్ యూజర్లకు కేంద్రం అలర్ట్
ఇటీవలే శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్‌తో పని చేసే శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల లో భద్రతా పరమైన సమస్య ఉన్నట్లు గుర్తించిన కేంద్ర ఐటీ శాఖ.. దీని వల్ల వ్యక్తులకు తెలియకుండానే వారి వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వెంటనే తమ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ …
Read More »ఆర్బీఐ మాజీ గవర్నర్ మృతి
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ వెంకిటరమణన్ అనారోగ్యంతో శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 92 ఏళ్లు. వేగంగా నిర్ణయాలు తీసుకోగలరని పేరున్న వెంకిటరమణన్.. ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంక్‌లో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించడంతోపాటు పలు సంక్షోభాలను చాకచక్యంగా పరిష్కరించగలిగారు. ఆయన ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే (1990-92) భారత్ ఆర్థికంగా అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. బ్యాలెన్స్ ఆఫ్ …
Read More »భారీగా తగ్గిన బంగారం ధరలు
ఈరోజు మంగళవారం బులియన్ మార్కెట్లో వెండి, బంగారు ధరలు తగ్గాయి. వెండి ధర కేజీకి ఏకంగా రూ.1,000 తగ్గడంతో రూ.79 వేలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గడంతో రూ.55,150 ఉంది.. . 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గడంతో రూ.60,160కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
Read More »వారంలో రెండు రోజులు సెలవులు
దేశంలో బ్యాంకులకు 5 రోజుల పనిదినాలు, రెండు రోజులు సెలవులు ఉండేలా కేంద్రానికి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్(IBA) ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. అయితే బ్యాంకులలో పని చేసే ఉద్యోగులు రోజూ 40 నిమిషాలు అదనంగా పనిచేయాలని సూచించింది. దీనిపై ఈనెల 28న బ్యాంకు యూనియన్లతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఇటీవల LIC ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Read More »స్టాక్ మార్కెట్ లో సంచలన రికార్డు
ఈరోజు మంగళవారం ఉదయం ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో MRF కంపెనీ చరిత్ర సృష్టించింది. ఆ కంపెనీకి చెందిన షేర్లు రూ.లక్ష మార్కును అందుకుంది.. అయితే ఈ ఘనత అందుకున్న ఏకైక భారతీయ కంపెనీగా MRF నిలిచింది. 2002లో ఈ సంస్థ షేర్ ధర రూ.1000గా ఉండగా, 2021 జనవరి 20 నాటికి రూ.90వేలకు చేరింది. ఇవాల్టి ట్రేడింగ్లో రూ.లక్ష మార్కును దాటి ఆల్ టైం హై గా …
Read More »ఉద్యోగులకు మీషో షాక్
సంస్థ నిర్వాహణ లో భాగంగా వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటిస్తున్న కంపెనీల జాబితాలో ఈకామర్స్ సంస్థ మీషో కూడా చేరింది. ఖర్చు తగ్గించుకునేందుకు, లాభాలను సాధించడానికి గానూ 251 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ సంస్థ ప్రతినిధి నిన్న శుక్రవారం వెల్లడించారు. మొత్తం ఉద్యోగుల్లో ఇది దాదాపు 15 శాతానికి సమానం. ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి మీషో వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే ఈమెయిల్ పంపించారు.ఈ …
Read More »జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ పై సీబీఐ దాడులు
ప్రముఖ విమానయాన సంస్థ అయిన జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ నివాసం, సంస్థ పాత కార్యాలయాలు సహా పలు ప్రాంతాల్లో నిన్న శుక్రవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. ప్రముఖ బ్యాంకు అయిన కెనరా బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై నరేశ్ గోయల్‌తో పాటు పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసి విచారిస్తున్నది. ఇందులో భాగంగానే దేశంలో ఉన్న ఢిల్లీ, ముంబై సహా పలు ప్రాంతాల్లోని …
Read More »స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెనెక్స్ 74.61 పాయింట్ల లాభంతో 60,130.71 పాయింట్ల వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ 25.85 పాయింట్ల లాభంతో 17,769.25 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సానుకూల పవనాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో సూచీలు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం సెన్సెక్స్ 60,202 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత …
Read More »