తిరుమలలో అన్యమత ప్రచార ఉదంతం గొడవపై దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. తిరుమల వెళ్లే బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేశారని జరుగుతున్న వ్యవహారం తమ దృష్టికి వచ్చినవెంటనే విచారణకు ఆదేశించామన్నారు. ఆ టిక్కెట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముద్రించినట్టుగా తేలిందని, ఎన్నికలకు ముందు టెండర్లను చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టినట్టు వెల్లడవుతోందన్నారు. ఇవన్నీ నెల్లూరు డిపోలో ఉండాల్సిన టిక్కెట్లని, కానీ నిబంధనలకు విరుద్దంగా తిరుపతి డిపోకు వెళ్లినట్టు గుర్తించామన్నారు. …
Read More »తిరుమల బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచార దుర్మార్గపు చర్యపై స్పందించిన విశాఖ శారదాపీఠాధిపతి
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం జరగడంపై విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్పందించారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేయడాన్ని ఇప్పటికే సిఎస్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కుట్రకు బాధ్యులెవరో ప్రభుత్వం నిగ్గు తేల్చాలని అన్నారు. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ గతంలో వైఎస్సార్ జీవో …
Read More »చెడుపై మంచి సాధించే విజయానికి గుర్తే శ్రీకృష్ణ జన్మాష్టమి.. సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించే విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రజలంతా జన్మాష్టమి వేడుకలు జరుపుకొంటారని సీఎం జగన్ అన్నారు. ఆ విష్ణు భగవానుడి అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముని జన్మాష్టమి సందర్భంగా ప్రజల జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని సీఎం ఆకాంక్షించారు.
Read More »తిరుమలేశుని శోభ విశ్వవ్యాప్తంగా వెలుగొందుతోంది.. తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రశంసలు
తమిళనాడు సీఎం పళనిస్వామి టీటీడీ వైభవాన్ని కొనియాడారు.. తిరుమలేశుని శోభ విశ్వవ్యాప్తంగా వెలుగొందుతోందని, అన్ని ప్రాంతాల భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం విధివిధానాలు అమలు చేస్తోందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలకు పళనిస్వామి మద్దతిచ్చారు. తాజాగా టీటీడీ చైర్మన్ చెన్నై నుంచి తిరుమల వస్తూ గురువారం సాయంత్రం అడయార్నిలో సీఎం పళనిస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా టీటీడీలో తాము చేపడుతున్న సంస్కరణల గురించి సుబ్బారెడ్డి …
Read More »అనంత పుష్కరిణిలోకి శ్రీ అత్తి వరదరాజస్వామి…తిరిగి 2059లో దర్శనం…!
48 రోజులుగా భక్తుల పూజలందుకున్న అత్తి వరదరాజస్వామి తిరిగి అనంత పుష్కరిణిలోకి చేరుకున్నారు. తమిళనాడులోని కంచి వరదరాజస్వామి ప్రతి 40 ఏళ్లకు ఒకసారి పుష్కరిణిలోంచి బయటకు వచ్చి 48 రోజుల పాటు భక్తులకు దర‌్శనం ఇచ్చి…తిరిగిపుష్కరణికి చేరుకుంటారు. శనివారం రాత్రి 12గంటలకు స్వామివారి పుష్కర ప్రవేశాన్ని ఆలయ అర్ఛకులు ప్రత్యేక పూజలతో నిర్వహించారు. దీంతో 48రోజుల పాటు జరిగిన అత్తివరదస్వామి ఉత్సవాలు అంత్యంత వైభవంగా ముగిశాయి. ఇక తిరిగి మరో …
Read More »73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..!
ఆగష్టు 15 నాడు భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు. 1947 ఆగస్టు 15న భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదల అయ్యింది. దీనికి గుర్తుగా ఈరోజున భారత స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు. భారతదేశాన్ని బ్రిటీష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 18వ శతాబ్దంలో చివరకు దేశంలోని చాలా భాగాన్ని తమఆదీనంలోకి తీసుకున్నారు. ఇక 19వ శతాబ్దం నాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకూ భారత దేశ సార్వభౌమునిగా మొఘల్ …
Read More »రాఖీ పండుగ విశిష్టత ఏమిటి..ఏఏ దేశాల్లో జరుపుకుంటారు..?
హిందు సంప్రదాయం ప్రకారం శ్రావణమాసంలో పౌర్ణమి రోజున సోదర, సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతకు గుర్తుగా రాఖీ పండుగను జరుపుకుంటారు.రాఖీ పండుగను ఉత్తర భారతదేశంలో రక్షాబంధన్ అని పిలుస్తారు. రక్షా అంటే రక్షణ అని, బంధన్ అంటే బంధం అని అర్థం.ఈ సంవత్సరం మొత్తం సోదరుడికి విజయం, శాంతి, మంచి ఆరోగ్యంచేకూరాలని ఆశిస్తూ అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీని కడుతారు.రాఖీ కట్టిన సోదరికి ఏ సమస్యలు రాకుండా, జీవితాంతం రక్షగా ఉంటానని …
Read More »ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చొరవతో తిరుపతిలో ఆగిన గరుడవారధి పనులు పునఃప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం రావడం, గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనే కారణంతో కొన్ని నిర్మాణాలు ఆగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చొరవతో తిరుపతిలో ఆగిన గరుడవారధి పనులు పునఃప్రారంభమయ్యాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో రూ.684 కోట్లతో చేపట్టిన స్మార్ట్ ఎలివేటెడ్ కారిడార్ (గరుడ వారధి) నిర్మాణం కూడా ఉంది. లక్షలాది మంది భక్తులు, నగర వాసుల ఇబ్బందులను స్థానిక ఎమ్మెల్యే భూమన పసిగట్టారు. …
Read More »తిరుమలలో పవిత్రోత్సవాలు..భక్తులతో కిటకిట
వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు గంటల్లో పూర్తవుతోంది. భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు చేసినట్లు జేఈవో ధర్మారెడ్డి తెలిపారు. శనివారం 95వేల మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. అధిక రద్దీ వద‍్ద సోమ, మంగళవారం బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు …
Read More »ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్పందన…!
జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి స్పందించారు. ఎన్నో ఏళ్లుగా దేశసమగ్రతకు సవాలుగా నిలిచిన ఆర్టికల్ 370 ని రద్దు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని స్వామిజీ అభిప్రాయపడ్డారు. ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మోడీ, అమిత్ షా అభినందనీయులు అని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం దేశ సమగ్రతకు, సమైక్యతకు …
Read More »