Home / BHAKTHI (page 15)

BHAKTHI

అయోధ్య కేసు విచారణ…తుది తీర్పు అప్పుడే ?

రాజకీయంగా సున్నితమైన అయోధ్య కేసు విచారణ నేటితో ముగియనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రోజు విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి ఈ అంశంపై కాస్త స్పష్టత నిచ్చారు. నేటితో వాదనలు పూర్తవనున్నాయని వ్యాఖ్యానించారు.తొలుత విచారణ అక్టోబర్​ 18 కల్లా పూర్తి చేయాలని గడువుగా పెట్టుకుంది అత్యున్నత న్యాయస్థానం. ఇటీవల అక్టోబర్​ 17న వాదనలు ముగిస్తామని వెల్లడించింది. తాజాగా మరో రోజు ముందుగానే వాదనలు ముగించనున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. …

Read More »

గౌరమ్మను ఆహ్వానించిన గ్రామస్తులు..ఇక పోటీ షురూ !

రావమ్మా గౌరమ్మా అంటూ…ఆ గ్రామస్తులు అమ్మవారిని ఘనంగా ఆహ్వానించారు. ఇంతకు ఎక్కడా గ్రామం, ఎవరా గౌరమ్మా అనుకుంటున్నారు కధా.. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో గౌరీదేవి జాతర జరుగుతుంది. రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ జాతరను గ్రామస్తులు అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ సందర్భంగా నిన్న ఆదివారం నాడు గ్రామస్తులు గౌరమ్మను డప్పులతో, ఆట పాటలతో, వేషదారణలతో ఎంతో కోలాహలంగా అమ్మవారిని ఆహ్వానించి …

Read More »

వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు..వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సంస్కరణలు

తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లి దండ్రులకు టీటీడీ సంతృప్తికర ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య రోజుల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా అక్టోబ‌రు 15, 29వ తేదీల్లో మంగ‌ళ‌వారం వయోవృద్ధులు(65 సం. పైబడిన), దివ్యాంగులకు 4వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2గంటలకు 2వేల టోకెన్లు, 3గంటల స్లాట్‌కు …

Read More »

కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధం..ఈసారి ఎన్ని తలలు పగులుతాయో..!

ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు జరిగే కర్రల సమరానికి కర్నూలు జిల్లా దేవరగట్టు చుట్టుపక్కల గ్రామాలు సిద్ధమయ్యాయి. ఏటా దసరా పర్వదినం నాడు జరిగే ఈ ఆచార రణరంగానికి సర్వం సిద్ధమైంది. దేవరగట్టు కొండలో వెలసిన మాళ మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం సందర్భంగా కర్రల యుద్ధం జరగడం ఆనవాయితీగా వస్తుంది. కొత్తపేట, నెరణికి తండా గ్రామాలు ఒకవైపు…అరికెర, ఆలూరు, బిలేహల్, ఎల్లార్తి, సులువాయి, విరూపాపురం, నిత్రవట్టి గ్రామాలు మరోవైపు వర్గాలుగా విడిపోయి ఉత్సవ …

Read More »

విజయదశమినాడు జమ్మిచెట్టుకు ఎందుకు పూజ చేస్తారు..?

విజయదశమినాడు ముఖ్యమైనది శమీపూజ. శమీవృక్షమంటే జమ్మిచెట్టు. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములనూ, వస్త్రములను ఈ శమీ వృక్షంపై దాచారు. తిరిగి అజ్ఞాతవాసం పూర్తవగానే ఆ వృక్షరూపమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను, వస్త్రములను పొంది ఆ శమీవృక్షరూపమున ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించి విజయము పొందినాడు.తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం పాలపిట్ట ను …

Read More »

దసరా రోజు తెలంగాణ ప్రజలు పాలపిట్టను ఎందుకు చూస్తారు…!

దసరా రోజు భక్తి శ్రద్ధలతో దుర్గమతల్లికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తాము. అష్టైశ్వర్యాలు దసరా రోజు భక్తి శ్రద్ధలతో దుర్గమతల్లికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తాము. అష్టైశ్వర్యాలు కలుగజేయాలని , సకల విజయాలు సిద్ధింపజేయాలని అమ్మవారిని ప్రార్థిస్తాం. ఆ తర్వాత సాయంత్రంచీకటి పడే వేళ..అమ్మవారి ఊరేగింపులో పాల్గొంటాం. గుడి దగ్గరకు వెళ్లి జమ్మి ఆకు బంగారం తెచ్చుకుంటాం. దసరా పండుగ వచ్చిదంటే అమ్మవారికి పూజలు , పిండివంటలు, జమ్మి ఆకు …

Read More »

దసరా నాడు రావణ దహనం చేయడానికి కారణం ఏమిటి..?

దసరా పండుగనాడు దేశమంతటా రావణ దహన వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఊరూరా రావణ దహన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దసరా రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టడానికి కారణం ఏమిటంటే దాని వెనుకో కథ ఉంది. శ్రీరాముని కాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారు. శ్రీరాముడు ఈ రోజే రావణుడిపై దండెత్తి వెళ్లాడట. అందుకే ఈ రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టే సంప్రదాయం ఏర్పడింది. మహార్నవమి నాడు శ్రీరామ …

Read More »

తిరుమలలో ఘనంగా రథోత్సవం.. మహారథంపై ఊరేగిన మలయప్పస్వామి..!

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. గడచిన ఏడు రోజులుగా రోజుకో వాహనంపై స్వామివారు ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. 8 వ రోజైన ఈ రోజు ఉదయం మలయప్పస్వామి మహారథంపై ఊరేగారు. ఈ రాత్రి స్వామివారు అశ్వ వాహన సేవలో దుష్ట శిక్షకునిగా కల్కి అవతారంలో దర్శనమిస్తారు. ఈ వాహనంపై స్వామి వారు క్షత్రియ లక్షణాలు కలిగిన తలపాగా, దూసిన కరవాలంతో, …

Read More »

నేడు దుర్గ‌మ్మ మ‌హిషాసురమ‌ర్థినీ దేవిగా సాక్షాత్కారం..!

నవరాత్రుల్లో భాగంగా 9వ రోజైన సోమ‌వారం అనగా ఆశ్వ‌యుజ శుద్ధ న‌వ‌మి నాడు విజయవాడలో కొలువుతీరిన శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మవారు శ్రీ మ‌హిషాసురమ‌ర్థినీ దేవిగా భక్తులకు ద‌ర్శ‌న‌మిస్తుంది. ఈ రూపంలో ఎనిమిది చేతులతో మ‌హిషాసురుడిని సంహరించింది. న‌వ‌దుర్గ‌ల్లో ఇదే అత్యుగ్ర‌రూపం. అమ్మవారు ఈరోజు లేత‌రంగు దుస్తుల్లో సింహ వాహ‌నాన్ని అధిస్టించి భక్తులకు మహాశక్తిగా దర్శనమిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున తల్లికి గారెలు, బెల్లంతో కలిపినా అన్న పెడతారు.

Read More »

నేడు భక్తులకు దుర్గ‌మ్మ దుర్గాదేవిగా సాక్షాత్కారం..!

శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో సందర్భంగా నేడు ఆదివారం అనగా ఆశ్వ‌యుజ శుద్ధ అష్ట‌మి నాడు కనకదుర్గమ్మ అమ్మ వారు భక్తులకు దుర్గాదేవిగా దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు ఆమెను దుర్గ‌ముడ‌నే రాక్షశుడిని సంహరించడంతో ఆమెను మహాశక్తి స్వరూపంగా కొలుస్తారు. అమ్మవారిని ఎరుపు రంగు చీరతో, ఎర్రటి పువ్వులతో కొలిస్తే శత్రువులు నుండి భాద తప్పుతుందని అంటారు. ఈ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన గారెలు, క‌దంబం,బెల్లం, పాయ‌సం నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat