Home / ANDHRAPRADESH (page 93)

ANDHRAPRADESH

మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట్లో విషాదం

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు  టీడీపీకి చెందిన యువనేత మాగంటి రాంజీ(37) కన్నుమూశాడు. రాంజీ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో చేర్పించారు. తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాంజీ మృతికి నారా లోకేష్ తో పాటు పలువురు టీడీపీ  నేతలు సంతాపం తెలిపారు

Read More »

బాలయ్యపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

సీనియర్ నటుడు..హిందూపురం ఎమ్మెల్యే.. స్టార్ హీరో బాలకృష్ణ, బోయపాటి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నటి పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉండే రోల్ చేయనుందట. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో శ్రీకాంత్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీని జులైలో థియేటర్లలో విడుదల …

Read More »

మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ

ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ మేయర్ అభ్యర్థిని  టీడీపీ  ఖరారు చేసింది. ఎంపీ కేశినేని నాని కుమార్తె అయిన కేశినేని శ్వేత పేరును ఓకే చేసినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేశినేని శ్వేత 11వ డివిజన్ నుంచి బరిలో ఉన్నారు.

Read More »

తెగ బాధపడుతున్న నారా లోకేష్..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ తెగ బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ నాయుడు విశాఖపట్టణంలో పర్యటించాడు. ఈసందర్భంగా లోకేష్ మాట్లాడుతూ” ఒక్క అవకాశం ఇచ్చినందుకు ప్రస్తుత సీఎం,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంటును అమ్మేస్తున్నారని  విమర్శించారు. విశాఖ గాజువాకలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో లోకేశ్ …

Read More »

ఏప్రిల్ 1 నుంచి కాచిగూడ-రేపల్లె ఎక్స్ప్రెస్

ఏప్రిల్ 1 నుంచి కాచిగూడ-రేపల్లె ఎక్స్ప్రెస్ ప్రారంభం కానుంది. రేపల్లెలో ప్రతిరోజూ రాత్రి 10.40కు బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు ఉదయం 7.05కు కాచిగూడ చేరుతుంది. కాచిగూడలో రాత్రి 10.10కి బయల్దేరి.. తర్వాతి రోజు ఉదయం 5.50కు రేపల్లె చేరుతుంది. ఈ రైలు పల్లెకోన, భట్టిప్రోలు, వేమూరు, చినరావూరు, తెనాలి, వేజండ్ల, గుంటూరు, బీబీనగర్ ఘట్ కేసర్, చర్లపల్లి, మల్కాజ్గిరి స్టేషన్లలో ఆగుతుంది

Read More »

ఢిల్లీకి సీఎం జగన్ .. అందుకేనా..?

ఏపీ ముఖ్యమంత్రి అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు విభజన హామీల అమలుపై చర్చించనున్నారు. విశాఖ స్టీల్ పై ప్రజల్లో ఉన్న మనోభావాలను సీఎం ఇద్దరు నేతలకూ తెలియజేయనున్నారు

Read More »

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై కేసు ఫైల్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బంధువు గౌరీనాథ్ రెడ్డి ఇంట్లో పోలీసులు చేసిన దాడుల్లో 60 క్రికెట్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు

Read More »

గ్రామవాలంటీర్లకు సీఎం జగన్ శుభవార్త

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గ్రామవాలంటీర్లకు శుభవార్తను తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గ్రామ/వార్డు వాలంటీర్లను సత్కరించనున్నది వైసీపీ ప్రభుత్వం.. ఇందుకోసం వాలంటీర్లను 3 కేటగిరీలు మార్చింది. లెవల్-1 కింద ఏడాది సేవలందించిన వారికి సేవామిత్ర కింద బ్యా డ్లీ, రూ.10వేలు, లెవల్-2 కింద ప్రతి మండలం/పట్టణంలో ఐదుగుర్ని ఎంపిక చేసి వారికి సేవారత్న కింద బ్యా డీ, రూ.20వేలు, లెవల్-3లో ప్రతి నియోజకవర్గంలో …

Read More »

మరో సంచలనానికి తెరతీసిన నిమ్మగడ్డ రమేష్

ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం ముగిసిందో లేదో ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ మరో సంచలనానికి తెరతీశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై చర్చించేందుకు మార్చి 1న అన్ని రాజకీయ పర్టీలతో ఎస్ఈసీ  నిమ్మగడ్డ రమేష్ భేటీ కానున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరు హాజరుకావాలని సూచించారు. ఇప్పటికే ప్రాంతాల వారీగా 3 ప్రాంతాల్లో ఎస్ఈసీ సదస్సులను నిర్వహించనుండటం తెలిసిందే. మార్చి 10న 12 …

Read More »

ఏపీలో గాడిద మాంసానికి ఫుల్ డిమాండ్

ఏపీలో గాడిద మాంసానికి విపరీతమైన డిమాండ్ నడుస్తోంది. ఇది తింటే బలమని.. శృంగార సామర్థ్యం పెరుగుతుందని నమ్ముతున్నారు. దీంతో గాడిదలను అక్రమంగా వధించి మాంసాన్ని విక్రయిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి మరీ ఒక్కో గాడిదను రూ 5వేల వరకూ అమ్ముతున్నారు. గాడిదను తినే జంతువుగా ప్రభుత్వం గుర్తించలేదు. గాడిద వధ చట్ట ప్రకారం నేరం, కాగా ముఠాలుగా ఏర్పడి బహిరంగ మార్కెట్లోనే గాడిద మాంసం విక్రయిస్తున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat