ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉదయం వచ్చారు. అమరావతి అసైన్డ్ భూ వ్యవహారంలో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి సీఐడీ అధికారులు వచ్చారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లపై అంశంపై బాబుకు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. 41 సీఆర్పీసీ కింద నోటీసులు …
Read More »జనంలోకి వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్రంలో ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ అయిన వైఎస్ షర్మిల త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగానే ఇప్పటివరకు జిల్లాల వారీగా వైఎస్ అభిమానులు ఇతర నేతలతో భేటీ అయిన షర్మిల ఇక నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో మెదటి బహిరంగ సభ …
Read More »బాలయ్యపై రోజా సెటైర్లు
ఏపీలో ఆదివారం రోజు విడుదలైన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంతో నగరి ఎమ్మెల్యే రోజా జోష్ లో ఉన్నారు.సీనియర్ నటుడు,హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సెటైర్లు వేశారు. బాలయ్య సినిమాలోని ‘తొక్కి పడేస్తా’ డైలాగ్ కు ‘వైసీపీ ఒకరికి ఎదురు వెళ్లినా.. ఒకరు వైసీపీకి ఎదురు వచ్చినా తొక్కి పడేస్తాం అంతే’ అని అన్నారు. మున్సిపాలిటీ ఛైర్మన్ సీటు కాదు కదా …
Read More »పురపాలక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం
ఏపీలో ఈ రోజు వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని అధికార పార్టీ అయిన వైసీపీ అదరగొడుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 15 మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. మాచర్ల, పిడుగురాళ్ల, పులివెందుల, పుంగనూరు గిద్దలూరు, డోన్, ఆత్మకూరు, పలమనేరు, మదనపల్లి రాయచోటి, ఎర్రగుంట్ల, నాయుడుపేట, సూళ్లూరుపేట కనిగిరి, కొవ్వూరు మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని 20 వార్డుల్లో …
Read More »ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 210 మందికి కరోనా
ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 47,803 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 210 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,91,388కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 1,227 ఉన్నాయి.. ఇప్పటివరకు 8,82,981 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో ఇద్దరు మృతిచెందగా.. మొత్తం 7,180 మంది కరోనాతో చనిపోయారు
Read More »కడప స్టీల్ ప్లాంట్ పై మరో ముందడుగు
ఏపీలో కడప స్టీల్ ప్లాంట్ పై ముందడుగు పడినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపిన ప్రభుత్వం.. 2020 డిసెంబర్ 20న ప్రతిపాదనలు పంపించి, అత్యంత వేగంగా అనుమతులు పొందామంది. కాగా కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లె, పెద్దనందులూరులో ఏపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది.
Read More »చంద్రగిరిలో చరిత్ర సృష్టించిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి
ఏపీలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి విధితమే..ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలో మెజార్టీ పంచాయతీల్లో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది..ఇందులో భాగంగా నియోజకవర్గంలో మొత్తం 107గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వంలో 105గ్రామ పంచాయతీల్లో విజయ దుందుభి మ్రోగించింది.. అయితే ప్రధాన ప్రతిపక్ష …
Read More »జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే
ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని ఏలూరులో జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. 25వ డివిజన్ ను ఏకగ్రీవం చేయాలని టీడీపీ అభ్యర్థిని విత్డ్రా చేయించారు. అందుకే జనసేన అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్నా, టీడీపీ, జనసేన పార్టీలకు వైసీపీ ప్రధాన శత్రువు. వైసీపీ ఓటమికి ఇరు పార్టీల …
Read More »ఏపీలో త్వరలో మెగా డీఎస్సీ,టెట్ నోటిఫికెషన్స్
ఏపీలో మెగా డీఎస్సీ, డీఎస్సీ, టెట్ నిర్వహణపై విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. త్వరలోనే వీటి నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. దీనిపై కసరత్తు చేస్తున్నాముని, ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది. అటు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రస్థాయి విద్యకు ప్రాధాన్యత ఇస్తూనే సీబీఎస్ఈ అమలు చేయనున్నట్లు తెలిపింది. ప్రైవేట్ కు మించి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొంది
Read More »ఏపీలో కొత్తగా 136 కరోనా కేసులు
ఏపీలో గడిచిన 24 గంటల్లో 45,702 శాంపిల్స్ పరీక్షించగా. కొత్తగా 136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,90,692కి చేరింది. ఇందులో 998 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు 8,82,520 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో ఒకరు మృతిచెందగా.. మొత్తం 7,174 మంది మరణించారు…
Read More »