Home / ANDHRAPRADESH (page 90)

ANDHRAPRADESH

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విశ్వరూపం

ఆంధ్రప్రదేశ్లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 6,096 కేసులు వచ్చాయి. 24 గంటల్లో కరోనాతో 20మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరులో 5, కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,48,231కు చేరింది. మృతుల సంఖ్య 7373కి చేరింది.

Read More »

మాజీ ఎమ్మెల్యే కాకర్లపూడి సుబ్బరాజు కన్నుమూత

ఏపీలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత కాకర్లపూడి సుబ్బరాజు (66) ఇక లేరు. విజయవాడలోని తన నివాసంలో అర్ధరాత్రి గుండెపోటుతో ‘కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. అమెరికాలో ఉంటున్న కుమారుడు, కుమార్తె వచ్చిన తర్వాత అంత్యక్రియలు చేస్తామని చెప్పారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, సీపీఐ, అనుబంధ సంఘాల్లో సుబ్బరాజు పనిచేశారు. 1994-99 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు.

Read More »

నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూత

ప్రముఖ వైద్యులు, హైదరాబాద్ నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏపీలోని కృష్ణా జిల్లా పెదముత్తేవికి చెందిన కాకర్ల సుబ్బారావు 1925 జనవరి 25న జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ పట్టా పొందారు. నిమ్స్ డైరెక్టర్గా పని చేశారు. 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

Read More »

ఏపీలో కొత్తగా 3,309 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3,309 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 31,929 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చిత్తూరులో అత్యధికంగా 740 కేసులు వెలుగులోకి వచ్చినట్టు ఆరోగ్య శాఖ బులెటిన్‌ ద్వారా తెలిపింది. గుంటూరులో 527, విశాఖపట్నంలో 391, కర్నూలులో 296, కృష్ణాలో 278, శ్రీకాకుళంలో 279, ప్రకాశంలో 174 కేసులు వెలుగులోకి …

Read More »

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి

అనంతపురం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, హిందూపురం మాజీ ఎమ్మెల్యే కామగానహళ్లి తిప్పేస్వామి(80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. పరిగి మండలం సేవా మందిరంలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1941లో ఏప్రిల్ 6న జన్మించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సేవా మందిర్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సొంత స్థలంలో …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో 2765 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది గత 24 గంటల్లో 31,982 శాంపిల్స్ పరీక్షించడం జరిగింది.ఇందులో 2765 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,18,597కి చేరింది. నిన్న కరోనా వల్ల మంది మృతిచెందగా, మొత్తం మరణాల సంఖ్య 7,279కి చేరింది. ప్రస్తుతం 16,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 1,245 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటివరకు 8,94,896 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Read More »

ఏపీలో తగ్గని కరోనా కేసులు

ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది రాష్ట్రంలో కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో 30,678 శాంపిల్స్ పరీక్షించారు.. వీటిలో 1,326 కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9,09,002కి చేరింది. ఇక తాజాగా ఐదుగురు మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 7,244కి చేరింది. ప్రస్తుతం 10,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 8,91,048 మంది కరోనా నుంచి కోలుకున్నారు

Read More »

తెలంగాణ ఏర్పాటుపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఏర్పాటు గురించి ఏపీ మంత్రి,ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి అప్పట్లో టీడీపీ అధినేత,నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవీ ఇచ్చి ఉంటే తెలంగాణ ఏర్పడదు.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు తన మంత్రివర్గంలోకి …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కలవరం

ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. కొత్తగా 31,325 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 997 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసులు 8,96,917కు చేరాయి. మహమ్మారి కారణంగా మరో ఐదుగురు మరణించారు. కాగా మొత్తం మరణాల సంఖ్య 7,210కు చేరింది. తాజాగా 282 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో వ్యాధి జయించినవారి సంఖ్య కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం జగన్ సంతాపం

ఏపీలోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి పట్ల సీఎం జగన్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు ఆయన మృతి తీరనిలోటని అభిప్రాయపడ్డారు . ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే  మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు ఉపముఖ్య మంత్రి అంజాద్ బాషా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య   పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. వారి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat