ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి కొత్త జిల్లాల్లో పాలన అమల్లోకి వచ్చింది. పలుచోట్ల ప్రజల అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడంతో పాటు అక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే ఒకట్రెండు చోట్ల ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త జిల్లా ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఏపీ …
Read More »గంటకు పైగా ప్రధాని మోడీ- సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రారంభించిన కొత్త జిల్లాలు, ఇతర అంశాలపై ప్రధానితో సీఎం మాట్లాడినట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు, పోలవరం నిధులు, రెవెన్యూ లోటు భర్తీ తదితర అంశాలపై మోడీతో జగన్ చర్చించినట్లు సమాచారం. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తదితర అంశాలపై మోడీ దృష్టికి …
Read More »గుడిలో దొంగతనం.. ఎరక్కపోయి వెళ్లి ఇరుక్కుపోయాడు!
అమ్మవారి గుడిలో చోరీకి వెళ్లిన దొంగ అక్కడే ఇరుక్కుపోయాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ గుడి ఉంది. కంచిలి పట్టణానికి చెందిన పాపారావు అనే యువకుడు ఈ తెల్లవారిజామున దొంగతనానికి గుడి వద్దకు వెళ్లారు. గుడిలో ఓ కిటికీ నుంచి లోనికి ప్రవేశించాడు. అమ్మవారి వెండి వస్తువులు తీసుకుని తిరిగి అదే కిటికీ నుంచి …
Read More »ఢిల్లీకి సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత,వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ప్రధానమంత్రి నరేందర్ మోదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు సాయంత్రం భేటీ కానున్నారు.. ఈ భేటీలో ప్రధానమంత్రి నరేందర్ మోదీతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు అని సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ పలువురు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. …
Read More »ఆ సమయంలోపు రాజధాని నిర్మాణం పూర్తికాదు: ఏపీ ప్రభుత్వం
ఏపీ రాజధాని అమరావతి అంశంలో సీఎస్ సమీర్ శర్మ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈనెల 3వ తేదీలోపు రైతులకు ఇచ్చిన స్థలాల్లో పనులు పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ అఫిడవిట్ సమర్పించారు. మొత్తం 190 పేజీల అఫిడవిట్‌ను కోర్టులో అందజేశారు. ఆ అఫిడవిట్ ప్రకారం హైకోర్టు నిర్దేశించిన గడువులోపు రాజధాని నిర్మాణం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొంది. రాజధాని …
Read More »చంద్రబాబు అలా గెలిస్తే నేను పాలిటిక్స్ నుంచి తప్పుకుంటా
మంత్రి పదవులపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకునే నిర్ణయం తమకు శిరోధార్యమని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. తమకు పదవులు ఉన్నా.. లేకపోయినా జగన్‌తోనే ఉంటామని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు. దేవుని అనుగ్రహం, ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం సీఎంగా జగనే ఉంటారని నారాయణస్వామి చెప్పారు. అన్నీ అనుకూలిస్తే 15 సంవత్సరాల తర్వాత జగన్ ప్రధాని కూడా అవుతారని వ్యాఖ్యానించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌పై …
Read More »సూసైడ్ చేసుకుందామని ట్రైన్ పట్టాలపై పడుకున్నాడు.. కానీ..!
ఆ యువకుడు జీవితంపై విరక్తి చెందాడు. ఆత్మహత్య చేసుకుందామని రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. రైలు వచ్చే సమయంలో ట్రాక్‌పై పడుకున్నాడు. కానీ చనిపోయేందుకు ధైర్యం సరిపోలేదు. కానీ ఈలోపే రైలు వచ్చేయడంతో పట్టాల మధ్యే పడుకుండిపోయాడు. ఈ ఘటన వైజాగ్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే శుక్రవారం మధ్యాహ్నం వైజాగ్ రైల్వేస్టేషన్‌లోని నాలుగో ప్లాట్‌ఫామ్‌పైకి ఓ యువకుడు సడన్‌గా వచ్చాడు. ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాలపై పడుకున్నాడు. అయితే సూసైడ్ చేసుకునేందుకు ధైర్యం …
Read More »వామ్మో.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో రూ.10 కోట్ల క్యాష్.. 10 కేజీల గోల్డ్!
ఏపీలో రెండు వేర్వేరు చోట్ల జరిపిన తనిఖీల్లో పోలీసులు భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన పేపర్లు చూపించకపోవడంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఉభయ గోదావరి జల్లాల్లో ఈ తనిఖీలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కృష్ణవరం సమీపంలో హైవేపై పోలీసులు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. దీనిలో భాగంగా విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్తున్న రెండు ట్రావెల్స్ బస్సులను చెక్ చేశారు. ఆ …
Read More »అప్పుడెందుకు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టలేదు?: సామినేని ఉదయభాను
టీడీపీ ఆవిర్భావ దినోత్సవమో, మహానాడు కార్యక్రమమో అయితే తప్ప మిగతా సమయాల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తురారని వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విమర్శించారు. 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీడీపీ నిర్వహించిన సభలో అన్నీ అబద్ధాలే చెప్పారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చెప్తున్న చంద్రబాబు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. సీఎం …
Read More »ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకోసం రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. 26 జిల్లాల ఏర్పాటుపై గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన వర్చువల్ కేబినెట్ మీటింగ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 70 రెవెన్యూ డివిజన్లు ఉండనున్నాయి. వీటిలో కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. …
Read More »