వైకాపా జెండా పట్టుకుని నడిచిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. రాష్ట్రంలోని కుల సమీకరణాల ఆధారంగా కేటాయింపులు చేశారని చెప్పారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లో రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రోజాకు ఆమె భర్త సెల్వమణి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ …
Read More »నేనెప్పుడూ జగన్‌కు విధేయురాలినే: సుచరిత
ఇటీవల మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో చోటు దక్కకపోవడంతో అలకబూనిన ఏపీ హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. కేబినెట్‌లో చోటు కల్పించలేకపోవడానికి గల కారణాలను సీఎం వివరించడంతో ఆమె మెత్తబడ్డారు. అనంతరం మీడియాతో సుచరిత మాట్లాడారు. దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. జడ్పీటీసీ నుంచి హోంమంత్రిగా ఎదిగేందుకు జగన్ అవకాశం కల్పించారన్నారు. రెండున్నరేళ్ల తర్వాత కొంతమందిని మారుస్తానని సీఎం ముందే చెప్పారని.. …
Read More »జగన్ ఎవరికీ అన్యాయం చేయరు: పిన్నెల్లి
సీఎం జగన్‌తో తాను మొదటి నుంచి నడిచిన వ్యక్తినని.. వైసీపీ అంటే తమ పార్టీనే అని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంత్రి పదవి రాలేదని తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి పిన్నెల్లి సీఎంను కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ సామాజిక సమీకరణల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ మంత్రి వర్గంలో భాగస్వామ్యం కల్పించారని చెప్పారు. …
Read More »ఏపీలో ఘోర రైలు ప్రమాదం
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జి.శిగడాం బాతువ రైల్వేస్టేషన్ల మధ్య ఘోర ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని ఐదుగురు చనిపోయారు. విశాఖ నుంచి గౌహతి వెళ్తున్న రైలు సిగ్నల్ లేక నిలిచిపోయింది. ప్రయాణికులు దిగి పక్క ట్రాక్పై నిల్చున్నారు. ఆ ట్రాక్పై కోణార్క్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు అందిస్తున్నారు.
Read More »మొన్న నటుడు .. నిన్న ఎమ్మెల్యే.. నేడు మంత్రి.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..?
ఆయన ఒకప్పుడు నటుడు. ఆ తర్వాత రాజకీయాల్లో ఎంట్రీచ్చాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందాడు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ తరపున గెలుపొంది ప్రస్తుతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకూ ఎవరు ఆయన ఆలోచిస్తున్నారా..?. ఇంతకూ ఎవరు అతను అంటే వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు . తాజాగా ఆయన ఏపీ జలవనరుల శాఖ మంత్రిగా నిన్న సోమవారం ప్రమాణ స్వీకారం …
Read More »నాకెలాంటి కోపం లేదు: మాజీ మంత్రి బాలినేని
మంత్రి పదవి విషయంలో తనకెలాంటి కోపం లేదని మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రి పదవి అంశంలో తాను రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను అప్పుడే ఖండించానని చెప్పారు. జగన్ ఆలోచన మేరకే మంత్రి పదవులు వస్తాయన్నారు. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి తాను తొలి నుంచి విధేయుడినని చెప్పారు. ప్రకాశం జిల్లాలో పార్టీ బాధ్యతలను …
Read More »మాజీ మంత్రి కొడాలి నానికి కీలక పదవి?
ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కొడాలి నానికి కీలక పదవి ఇచ్చే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్‌గా కొడాలి నానిని నియమించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఆ ఛైర్మన్ పదవికి కేబినెట్ హోదా కల్పించాలనేది జగన్ ఆలోచనగా వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా మరో …
Read More »ఏపీలో మళ్లీ 5 మంది డిప్యూటీ సీఎంలు.. మంత్రుల శాఖలివే..
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కేబినెట్ కొలువుదీరింది. నూతన మంత్రులుగా 25 మంది ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వారితో ప్రమాణం చేయించారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శాఖలను కేటాయించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. పీడిక రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ,అంజాద్ బాషా, నారాయణస్వామికి డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. నారాయణస్వామి గత మంత్రివర్గంలోనూ డిప్యూటీ …
Read More »ఆర్కే రోజాకు టూరిజం .. రజినికి వైద్యారోగ్య శాఖ
ఏపీలో నూతనమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి వాళ్లకు ఆయా శాఖాలను కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన హోంశాఖను తానేటి వనితకు అప్పగించారు సీఎం జగన్. మరో కీలకమైన వైద్యారోగ్య శాఖను విడదల రజనీకి కేటాయించారు. ఆర్కే రోజాకు పర్యాటకం, సాంస్కృతిక, యువజన శాఖ కేటాయించారు. కల్యాణదుర్గం ఎమ్మెల్యే కేవీ ఉషశ్రీచరణ్‌కు మహిళా, శిశు సంక్షేమ శాఖను ముఖ్యమంత్రి జగన్ …
Read More »మాజీ మంత్రి మేకతోటి సుచరిత రాజీనామాపై క్లారిటీ
ఏపీకి చెందిన మాజీ మంత్రి మేకతోటి సుచరితను వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కలిశారు. మంత్రి సుచరితతో మాట్లాడిననంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సుచరితకు తప్పక న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. వివిధ సమీకరణాల వల్ల కొందరు మంత్రులు చోటు కోల్పోయారు. సుచరిత రాజీనామా చేయలేదు’ అని అన్నారు. అయితే అంతకు ముందు సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిందని ఆమె కుమార్తె రిషిత తెలిపారు. రాజీనామా చేసినప్పటికీ తన తల్లి …
Read More »