ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో మరో 1,500 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల నియామకాలు చేపడతామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్య దర్శి కృష్ణబాబు తెలిపారు. ఆగస్టు 15 నాటికి ప్రతి YSR ఆసుపత్రిలో MLHPలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంలో PHCల్లో పనిచేసే ఇద్దరు వైద్యుల్లో ఒకరు.. 104 వాహనంలో వెళ్లి తమ సచివాలయ పరిధిలోని కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తారని కృష్ణబాబు చెప్పారు.
Read More »పరిహారం ఇచ్చాకే పోలవరంలో నీళ్లు నింపుతాం: సీఎం జగన్ హామీ
పోలవరం నిధుల విడుదల కోసం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపిస్తూనే ఉన్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నామని చెప్పారు. సెప్టెంబర్‌లోపు నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల టూర్‌లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో ఆయన పర్యటించారు. అక్కడ బాధితులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే పోలవరం ప్రాజెక్టులో …
Read More »పెళ్లి రోజే భర్తను వదిలేసి ప్రియుడితో జంప్!
విశాఖపట్నంలో అదృశ్యమైందని భావించిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసులో సూపర్ ట్విస్ట్. రెండో పెళ్లిరోజు సందర్భంగా భర్త శ్రీనివాసరావుతో ఆర్కే బీచ్‌కు వెళ్లిన సాయి ప్రియ.. తన భర్త ఫోన్‌లో బిజీగా ఉండగా ప్రియుడితో చెక్కేసింది. నెల్లూరుకు చెందిన రవి అనే యువకుడితో అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. రెండు రోజుల క్రితం సాయి ప్రియ ఆచూకీ తెలియకపోవడంతో భర్త వైజాగ్ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి …
Read More »వాళ్లు అనుకున్నవన్నీ అవ్వాలంటే ఎలా?: బొత్స
ఏపీలో ఉపాధ్యాయ సంఘాలు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు చేస్తున్న బడి కోసం బస్సు యాత్ర వెనుక ఏ ఉద్దేశాలున్నాయో ఎవరికి తెలుసని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వాళ్లు అనుకున్నవన్నీ అవ్వాలంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. పాఠశాలల విలీనం అంశంలో ఉపాధ్యాయుల వైఖరిపై మంత్రి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో మీడియాతో బొత్స మాట్లాడారు. ప్రభుత్వాలను బెదిరిస్తామంటే పనులు కావని తేల్చి చెప్పారు. టీచర్లు 8 …
Read More »బాలుడికి తన పెన్ గిఫ్ట్‌గా ఇచ్చేసిన జగన్.. కాస్ట్ ఎంతో తెలుసా?
వరద బాధితులను పరామర్శించేందుకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. పుచ్చకాయలపేటలో వరదబాధితులను పరామర్శించారు. ఈ క్రమంలోఅక్కడ ఉన్న నక్కా విజయలక్ష్మి 8 నెలల కుమారుడిని సీఎం ఎత్తుకున్నారు. ఈ సమయంలో సీఎం జేబులో ఉన్న పెన్‌ను బాలుడు తీసుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అది కాస్త కింద పడింది. వెంటనే అధికారులు ఆ పెన్‌ను తిరిగి …
Read More »అప్పుడు నేనొస్తే అందరూ నా చుట్టే తిరిగేవారు.. : జగన్
ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కన పెట్టాలని ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా అరిగెలవారిపేటలో వరద బాధితులతో జగన్ మాట్లాడారు. వరదల సమయంలోనే తాను వచ్చి ఉంటే అధికారులంతా తన చుట్టే తిరిగేవారని.. అందుకే వారికి కొంత సమయం ఇచ్చి ఇప్పుడొచ్చానని చెప్పారు. అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పారు. ప్రజలకు మంచి చేయాలంటే …
Read More »మంత్రి జయరామ్ అవినీతిపై ఈడీ విచారణ చేయాలి-టీడీపీ నేత డిమాండ్
ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అవినీతిపై ఈడీ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత వర్ల రామయ్య కోరారు. ‘గత నెలలో కొన్ని బదిలీలకు సంబంధించి మంత్రి జయరామ్ చెప్పారు..అందుకే జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ ప్రత్యేకంగా జీవో ఇచ్చారు. ఇందులో మంత్రి సొంత మనుషులను వారు కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో రూ. లక్షల్లో నగదు చేతులు మారింది. దీనిపై సీఎం …
Read More »ఏపీలో ఆరేళ్లలో 1,133 స్టార్టప్ లు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఆరేళ్లలో 1,133 స్టార్టప్ లు ఏర్పాటయ్యాయని, 11,243 మందికి ఉపాధి లభించిందని కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ హయాంలో 264, వైసీపీ హయాంలో 869 ఏర్పాటయ్యాయి. ‘యాక్సిలరేట్ స్టార్టప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ ద్వారా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. Al, బ్లాక్ చైన్, రోబోటిక్స్, 5జీ, సర్వ్ …
Read More »చేయలేకపోతే చెప్పండి.. కొత్తవాళ్లకు అవకాశమిస్తా: జగన్
వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ సమావేశమయ్యారు. ఇచ్చిన పదవికి న్యాయం చేయాలని.. చేసే పని కష్టమనిపిస్తే చెప్పాలని కోరారు. అలా ఎవరైనా చెబితే వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తానన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నాణ్యతతో చేయాలని ఆదేశించారు. అక్టోబరు 2 లోపు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి …
Read More »స్కూళ్లలో బోధనకు స్మార్ట్ టీవీలు.. ప్రొజెక్టర్లు: సీఎం జగన్ ఆదేశం
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి తరగతి గదిలోనూ డిజిటల్ బోధన చేపట్టాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రీ ప్రైమరీ-1 నుంచి రెండో తరగతి వరకు స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. 3వ తరగతి ఆపైన ప్రతి తరగతిలోనూ ప్రొజెక్టర్లు పెట్టే ఆలోచన చేయాలన్నారు. నాడు-నేడు కింద పూర్తిచేసుకున్న అన్ని స్కూళ్లలో మొదటి దశ …
Read More »