ఏపీ ముఖ్యమంత్రి … అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల ఇరవై రెండో తారీఖున రాష్ట్రంలోని ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పంలో పర్యటించనున్నారు. అయితే రేపు సీఎం జగన్ కుప్పం పర్యటనకు వెళ్లాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల 23కు వాయిదా పడింది. ఆరోజు ఉదయం 11.15-12.45 మధ్య బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం వైఎస్సార్ …
Read More »వింత దొంగలు.. బేకరీలో కేక్ కొట్టేసి.. అక్కడే సెలబ్రేషన్స్..!
ఓ బేకరీ తాళాలు పగలగొట్టి లోపలకు వెళ్లిన దొంగలు.. వారి పని పూర్తికాగానే అక్కడ ఉన్న కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు ఇలాంటి వింత దొంగలు ఎవరంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నేలకొండపల్లి పట్టణంలో శశిధర్.. సాయిరాం స్వీట్స్ ఎండ్ బేకరీని నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలానే శనివారం రాత్రి బేకరీకి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి …
Read More »వెంకన్నను సన్నిధిలో ముకేశ్ అంబానీ.. శ్రీవారికి భారీ విరాళం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి అభిషేకం, నిజపాద దర్శసేవలో పాల్గొన్నారు. అనంతం వడ్డీకాసుల స్వామికి రూ.1.5 కోట్ల విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. తర్వాత తిరుమల గోశాలను దర్శించారు. ముకేశ్‌తో పాటు ఆయన రెండో కొడుకు అనంత్ అంబానీ కాబోయే భార్య రాధిక మర్చంట్ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీలు …
Read More »వైసీపీలో చేరిన టీడీపీ నేతకు కీలక పదవి
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత ఇటీవల ఆపార్టీని వీడి అధికార పార్టీ అయిన వైసీపీలో చేరిన గంజి చిరంజీవికి వైసీపీ పార్టీలో కీలక పదవి లభించింది. రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఆయనను వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ కు ఈసందర్భంగా గంజి …
Read More »ఏపీ కొత్త డిప్యూటీ స్పీకర్ ఆయనేనా.?
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేశారు..కోన రఘుపతి రాజీనామాకు స్పీకర్ వెంటనే ఆమోదం తెలిపారు. కొత్త డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని ఈ నెల 19న ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నెల 19న వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తిరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి వారితో …
Read More »బాబు సంచలన నిర్ణయం
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు కన్ఫార్మ్ చేశారు. టీడీఎల్పీ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయం ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలందరూ బాగా కష్టపడుతున్నారు..ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం పనిచేసుకోవాలని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. టీడీపీలా వైసీపీ సిట్టింగ్లకు …
Read More »ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్
ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ నుంచి ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సభ్యులను మరోసారి అసెంబ్లీ స్పీకర్ సస్పెన్షన్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జరుగుతున్న రెండోరోజు ప్రారంభం కాగానే రాష్ట్రంలో ధరల పెరుగుదలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అందుకు అధికారపక్షమైన వైసీపీ ఒప్పుకోకపోవడంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. స్పీకర్ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా శాంతించకపోవడంతో అసెంబ్లీ వ్యవహారాల …
Read More »ఆలి మీద కోపం ఆడబిడ్డలపై చూపిస్తూ శాడిజం..!
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి భార్యపై కోపంతో శాడిస్ట్‌గా మారాడు. కన్న బిడ్డలని చూడకుండా ఆడపిల్లల్ని చిత్రహింసలు పెడుతున్నాడు. అంతటితో ఆగకుండా కొడుకుతో వీడియోలు తీయించి భార్యకు పంపి రాక్షసానందం పొందుతున్నాడు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలేనికి చెందిన గంజి దావీదు, నిర్మల దంపతులు. వీరికి 11, 9 ఏళ్ల ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు ఉన్నారు. తాగుడుకు బానిసైన దావీదు నిత్యం భార్యతో గొడవపడే వాడు. పనికి వెళ్లేవాడు …
Read More »చంద్రబాబుకు సీఎం జగన్ షాక్
ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశంలో అధికార పార్టీ అయిన వైసీపీ,ప్రధాన ప్రతిపక్షపార్టీ అయిన టీడీపీకి చెందిన నేతల మధ్య ఈరోజు మొదలైన ఏపీ అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ ఆసక్తికర చర్చ జరిగింది. ఏపీ సచివాలయంలోని ఛాంబర్ లో స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం… అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, బీఏసీ సభ్యులు, టీడీపీ తరుఫున అచ్చెన్నాయుడు సమావేశంలో …
Read More »గుడ్‌న్యూస్.. పెరిగిన రైళ్ల స్పీడ్..!
ట్రైన్ జర్నీ చేసే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై సౌత్ సెంట్రల్ జోన్‌లో పరిధిలో రైళ్లు దూసుకుపోనున్నాయి. ట్రైన్స్‌కు సంబంధించిన వేగాన్ని పెంచినట్లు వెల్లడించింది ద.మ రైల్వేస్. నేటి(సోమవారం) నుంచే ఈ స్పీడ్ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం గంటకు 110 కి.మీ వెళ్తున్న ట్రైన్లు ఇకపై గంటకు 130 కి.మీ వెళ్లనున్నాయి. సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్ డివిజన్లలోని ఈ వేగం పెరుగుతుంది. – విజయవాడ …
Read More »