Home / ANDHRAPRADESH (page 111)

ANDHRAPRADESH

అనంతపురం జిల్లాలో రోడ్డుప్రమాదం

ఏపీలో అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం హులికల్లు గ్రామం వద్ద రోడ్డుప్రమాదం సంభవించింది. కళ్యాణదుర్గం – రాయదుర్గం ప్రధాన హైవే రోడ్‌లో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరి మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కళ్యాణదుర్గం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు

Read More »

కొత్త దరఖాస్తుదారులకూ రేషన్‌

ఏపీలోని గుంటూరు జిల్లాలో ఎవరైతే ఇప్పటివరకు రైస్‌కార్డు లేకుండా కొత్తగా కార్డుకోసం దరఖాస్తు చేసుకొన్నారో వారిలో అర్హులకు సరుకులు పంపిణీ చేయాల్సిందిగా జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ దరఖాస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో ఆరు అంచెల మూల్యాంకనం చేయాలన్నారు. ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టాల్సిందిగా తెనాలి సబ్‌ కలెక్టర్‌, నాలుగు డివిజన్ల ఆర్డీవోలు, తమసీల్దార్లు, మునిసిపల్‌ కమిషనర్‌లు, సీఎస్‌డీటీలను జేసీ ఆదేశించారు.

Read More »

4వ స్థానంలో ఏపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు చెలరేగిపోతుంది.ఈ క్రమంలో దేశంలో కరోనా వైరస్ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచింది. పది లక్షల జనాభాకుగాను ఏపీ 331మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది.ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 16,555పరీక్షలు చేసింది.ఈ జాబితాలో రాజస్థాన్ (549),కేరళ (485),మహారాష్ట్ర (446)లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సమాచారాన్ని పొందుపరచలేదు.ఇప్పటివరకు ఏపీలో కరోనా కేసుల సంఖ్య …

Read More »

వైసీపీ నేత మృతి

ఏపీలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ కె.చంద్రమౌళి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. 2019 శాసనసభ ఎన్నికల్లో అనారోగ్యానికి గురై ప్రచారానికి వెళ్లనప్పటికీ ఆయన కుప్పం వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు గట్టి పోటీ ఇచ్చారు. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి నార్సింగిలోని స్వగృహానికి తరలించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో …

Read More »

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్‌ కనగ రాజు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) గా జస్టిస్‌ కనగ రాజు నియమితులయ్యారు. జస్టిస్‌ కనగరాజు మద్రాస్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చింది. దీంతో ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పదవీ కాలం ముగిసింది.

Read More »

సీఎం జగన్ సంచలన నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్ర భయాందోళనను కల్గిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. ప్రతి జిల్లాలోని కరోనా బాధితులకు చికిత్సను అందించే విధంగా ఆస్పత్రులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు జగన్. మరోవైపు కరోనాను నియంత్రించేందుకు …

Read More »

గుంటూరులో ‘కోవిడ్19-డెస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్’ ఏర్పాటు

కోవిడ్-19 నివారణకు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా గుంటూరులో ‘ప్రత్యేక క్రిమిసంహారక టన్నెల్స్ (covid-19 Disinfection Tunnels)ను ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరులోని సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భీమనాధం భరత్ రెడ్డి, ఆయన మిత్రులు, ప్రముఖ వైద్యులు కలిసి స్వంతఖర్చులతో ఈ టన్నెల్స్ ఏర్పాటుకు పూనుకున్నారు. ఇందులో భాగంగా గురువారం స్థానిక రెయిన్ ట్రీ పార్కు వద్ద ఏపీ ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేతులమీదుగా మొదటి టన్నెల్ ను ప్రారంభించారు. …

Read More »

పెన్షన్ దారులకు శుభవార్త

ఏపీలోని పెన్షన్ దారులకు ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగ్మోహన్ రెడ్డి శుభవార్తను తెలిపారు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఏపీకి చెందిన పలువురు పెన్షన్ దారులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. దీంతో ఈ నెల ప్రభుత్వం ఇస్తున్న పంపిణీ తీసుకోవడంలో వీళ్లు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా ఈ నెల పించన్ ను తీసుకోనివారు వచ్చే …

Read More »

ఏపీ సర్కారు సంచలన నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ మర్కాజ్ కు చెందిన కేసుల వలన రాష్ట్రంలో కరోనా తీవ్ర రూపం దాల్చడంతో సర్కారు ,ప్రయివేట్ వైద్య సర్వీసుల(వైద్యులు,నర్సులు,ఆరోగ్య పారిశుధ్య కార్మికుకుల)ను ఎస్మా పరిధిలోకి తీసుకువస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే …

Read More »

ఏపీలో కేసులు పెరుగుతాయి

ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. అయితే ఈ తరుణంలో డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని కీలక వ్యాఖ్యలు చేసారు. ” ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏపీలో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యం. లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా పాటించాలి.. అత్యవసరమైతేనే బయటకు రావాలి. కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించిన ఎక్విప్మెంట్ కొరత తీర్చే ప్రయత్నం చేస్తున్నాం.” అని మంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat