Home / ANDHRAPRADESH (page 109)

ANDHRAPRADESH

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు

ఏపీ మాజీ మంత్రి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన‍్న పాత్రుడుపై కేసు నమోదయ్యింది. నర్సీపట్నం మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన తాత లచ్చాపాత్రుడు ఫోటోని మరో గదిలో తాత్కాలికంగా మార్చిన దశలో తన పట్ల అయ్యన్న అనుచితంగా మాట్లాడారంటూ మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లచ్చాపాత్రుడు ఫోటోను మున్సిపల్‌ సిబ్బంది మార్చడంతో గత రెండు రోజుల క్రితం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట …

Read More »

చంద్రబాబుపై కేసు నమోదు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధ్యక్షుడు,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నందిగామ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించలేదని ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు పలు చోట్ల లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారు. భారీ కాన్వాయ్‌తో ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా జగ్గయ్యపేట, కంచికర్లలో జనసమీకరణకు …

Read More »

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి పేర్ని నాని ఫైర్

సొంత పార్టీ నేతలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పార్టీలు మారడం రఘురామకృష్ణంరాజు నైజమని విమర్శించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఆనాడు టీడీపీ నామినేషన్, బీజేపీ నామినేషన్, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రశించారు. ఈ రోజు ఎంపీగా గెలిచి సొంత పార్టీపై విమర్శలు …

Read More »

బీఏసీ సాక్షిగా టీడీపీ డ్రామాలు

బీఏసీ సమావేశం సాక్షిగా మరోసారి టీడీపీ డ్రామాలు బయటపడ్డాయి. శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన మంగళవారం జరిగిన బీఏసీ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సాధ్యం కాని అంశాలను లేవనెత్తాడు. వర్చువల్‌ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అయితే వర్చువల్‌ అసెంబ్లీ సాధ్యం కాదని, దీనిపై పార్లమెంట్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 50 రోజులైనా అంసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు …

Read More »

ఏపీ బడ్జెట్ (2020-21)హైలెట్స్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్‌ను రూపొందించారు. అచ్చమైన తెలుగు కవితతో అసెంబ్లీలో‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి …

Read More »

సీఎం జగన్ కు పవన్ వార్నింగ్

బీఎస్‌-3 వాహనాల కొనుగోళ్లలో తాము మోసగాళ్లం కాదని.. మోసపోయినోళ్లమని టీడీపీ నేత జేసీ పవన్‌రెడ్డి అన్నారు. టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నందుకే వైఎస్‌ జగన్‌ మమ్మల్ని టార్గెట్‌ చేశారని ఆరోపించారు. బాబాయ్‌ని, తమ్ముడిని అరెస్ట్‌ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక కచ్చితంగా రివేంజ్‌ ఉంటుందని హెచ్చరించారు. ‘‘మీకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా నన్ను వేధిస్తారేమో’’ అంటూ ఏబీఎన్‌ న్యూస్ మేకర్ కార్యక్రమంలో పవన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Read More »

జగన్ పై లోకేష్ ఫైర్

ఏపీలో టీడీపీ నాయకులపై దాడి చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని నారా లోకేష్ హెచ్చరించారు. జేసీ కుటుంబ సభ్యులను లోకేష్‌ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి.. జగన్‌లా దేశాన్ని దోచుకోలేదన్నారు. దొంగ కేసులు పెడితే భయపడేది లేదని చెప్పారు. జగన్‌ మమ్మల్ని ఏమీ చేయలేరన్నారు. ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో చూస్తున్నామని గుర్తుచేశారు. జేసీ …

Read More »

ఏపీలో డబుల్ సెంచురీ కొట్టిన కరోనా కేసుల సంఖ్య

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది.ఏకంగా డబుల్ సెంచూరీ కొట్టింది కరోనా.గడిచిన ఇరవై నాలుగంటల్లో 216కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 147 ఏపీకి చెందినవి.మిగతావి ఇతర రాష్ట్రాల,దేశాల నుండి వచ్చిన వారికి సోకిన సంఖ్య అని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు కరోన కేసుల సంఖ్య 3,990కి చేరుకుంది.ఇందులో 2,403మంది డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లారు.1,510మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు..

Read More »

నేడే జగనన్న చేదోడు పథకం

ఏపీ వ్యాప్తంగా ఈ రోజు బుధవారం జగనన్న చేదోడు పథకం ప్రారంభం కానున్నది.తాడేపల్లిగూడెంలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆన్ లైన్లో ప్రారంభించనున్నారు.. షాపులున్న రజకులకు,నాయీ బ్రాహ్మణులకు,టైలర్లకు ఏడాదికి రూ.పది వేల చొప్పున అందజేయనున్నారు. ఇందులో భాగంగా తొలివిడతగా 2,47,040మంది లబ్ధిదారులకు అందజేయనున్నారు.ఇందుకు రూ.247.40కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది..

Read More »

టీడీపీ మాజీ ఎంపీ ఇంట్లో కరోనా కల్లోలం

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత,నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. మురళీమోహన్ కుమారుడి ఇంట్లో పని చేస్తున్న ముగ్గురు పని మనుషులకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఇద్దరు భార్యా భర్తలు, కాగా, మరో మహిళ వంట మనిషిగా పని చేస్తోంది. టోలిచౌకికి చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి, బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో నివాసం ఉంటున్న మరో యువతికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat