Home / ANDHRAPRADESH (page 104)

ANDHRAPRADESH

వైసీపీ నేత మృతి

కడప జిల్లాకి చెందిన మాజీ మంత్రి వైసీపీ నేత ఖలీల్ బాషా మృతి చెందారు. అనారోగ్యంతో గత వారం రోజుల క్రితం హైదరాబాద్ ఆపోలో హాస్పటల్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతి చెందారు. టీడీపీ హాయాంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఒక సారి మైనార్టీ శాఖ మంత్రిగా పని చేసిన ఖలీల్ బాషా, గత ఎన్నికల ముందు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. టీడీపీ …

Read More »

కరోనాపై ఏపీ ప్రజలకు శుభవార్త..

ఏపీ ప్రజలకు శుభవార్త కొవిడ్ కంట్రోల్ రూమ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ డా. ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 15శాతం పైనే హెర్డ్‌ ఇమ్యూనిటీ గుర్తించినట్లు తెలిపారు.శనివారం నుంచి శీరోసర్విలెన్స్‌ భారీగా ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. రెండు నెలలు జాగ్రత్తగా ఉంటే చాలని ప్రభాకర్ రెడ్డి …

Read More »

వైసీపీ గూటికి టీడీపీ నేత

టీడీపీ నేత చలమలశెట్టి సునీల్ సోమవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 2014లో వైసీపీ తరపున కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి టీడీపీ ఎంపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో ఓడిపోయారు. అంతకుముందు 2009లో ప్రజారాజ్యంపార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎం పళ్లంరాజు చేతిలో ఓడిపోయారు. తాజాగా గతేడాది 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన వైసీపీకి రాజీనామా …

Read More »

విజయవాడ కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు కరోనా రోగులు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కొవిడ్‌ బాధితులు మృతి చెందినట్లు విజయవాడ సీపీ శ్రీనివాసులు స్పష్టం చేశారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని సీపీ చెప్పారు అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆ సెంటర్‌లో …

Read More »

ఆంధ్రజ్యోతికి ఛాలెంజ్ విసిరిన సీఎంఓ కార్యాలయం

ఆంధ్రజ్యోతికి ఛాలెంజ్ విసిరిన సీఎంఓ కార్యాలయం ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాయడం, ప్రజలను మభ్యపెట్టడం, టీడీపీకి వంతపాడటం.. కొన్ని మీడియా సంస్థలకు ఇది నిత్యకృత్యంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవాలు మరుగున పెట్టినా పర్వాలేదు కానీ, కుట్రపూరితంగా అవాస్తవాలు ప్రచారం చేయడం మాత్రం నిజంగా శిక్షార్హమే. తాజాగా ఇలాంటి తప్పుడు కథనాల్ని ప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానెల్ పై సీఎంఓ అధికారులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓపెన్ ఛాలెంజ్ …

Read More »

ముఖ్యమంత్రి కేసీఆర్ కి రాఖీ కట్టిన సోదరీమణులు

రక్షాబంధన్‌ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు ఆయన అక్కలు రాఖీ కట్టారు. ప్రగతిభవన్‌కు సోమవారం వచ్చిన సీఎం అక్కలు లలితమ్మ, సకలమ్మ, లక్ష్మీబాయి, వినోదమ్మ ఆయనకు స్వీట్లు తినిపించి రక్షాబంధన్‌ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ రక్షా బంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అన్నదమ్ములు అక్కాచెల్లెండ్ల ప్రేమ, అనురాగానికి గుర్తుగా నిలుస్తుందన్నారు.

Read More »

వంగపండు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు- సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతి వృత్తంగా పాటలు రాశారు.. రాసి పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More »

ఏపీ మాజీ మంత్రి కరోనాతో మృతి

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకుపెరుగుతుండగా.. మాజీ మంత్రి, బీజేపీ నేత పి.మాణిక్యాలరావు (60) ఈ మహమ్మారి కారణంగా చనిపోయారు. గత నెల రోజులుగా మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనాకు గురై విజయవాడలోని ఓ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స తీసుకుంటున్న ఆయన.. కాసేపటిక్రితం ప్రాణాలు కోల్పోయారు. గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 2014లో తాడేపల్లిగూడె నుండి గెలుపొందారు.

Read More »

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ

ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా,ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజు నియమితులయ్యారు. ఆయనను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ ప్రకటన విడుదల చేశారు . ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను తొలగించి, ఆయన స్థానంలో వీర్రాజును నియమించారు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన వీర్రాజా ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్నారు.

Read More »

అచ్చెన్నాయుడుకి బెయిల్ వస్తుందా…?

ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి,టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి… బెయిల్ ఇవ్వాలా? లేదా? అనే దానిపై నేడు హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి 45 రోజులు దాటింది. సాక్ష్యాల సేకరణ కూడా పూర్తయింది అటు ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ రమేశ్ కుమార్ బెయిల్ పిటిషన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat