Home / ANDHRAPRADESH (page 1030)

ANDHRAPRADESH

చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. ఢిల్లీ పెద్దలకు చిన్నమ్మ లేఖ..?

పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి పురందేశ్వరి లేఖ రాశారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ 14% తక్కువ కోట్ చేసి కాంట్రాక్టు దక్కించుకుందని… అంత తక్కువకు ప్రాజెక్టు పూర్తిచేయడం అసంభవమని లేఖలో పేర్కొన్నారు. ఆ కంపెనీకి ఉన్న అనుభవం, సమర్ధత లోటు తెలిసి కూడా రాష్ట్రప్రభుత్వం 3సంవత్సరాల విలువైన సమయం వృధా చేసిందని విమర్శించారు. కేంద్రం అన్ని …

Read More »

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చంద్రబాబు ..

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రధానమైన నేతల్లో ఒకరైన అనుముల రేవంత్ రెడ్డి, ఎనిమిది మంది జిల్లాల అధ్యక్షులు, మరో 20 మంది వరకూ నేతలతో కలసి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన తరువాత ఏర్పడ్డ పరిస్థితులను సమీక్షించేందుకు ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ కు రానున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం జరిపి, తాజా పరిస్థితులను ఆయన …

Read More »

ఆ సిట్టింగ్ 55 మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు లేవు అని తేల్చేసిన బాబు ..

ఏపీలో అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పలు జిల్లాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశం అనే కార్యక్రమం సక్రమంగా జరగని నియోజకవర్గంలో కొత్త నాయకత్వాన్ని చూస్తారంటూ ఆయా నియోజక వర్గాలకు చెందిన నేతలను గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రంలో రాజధాని ప్రాంతంలోని తన నివాసం నుంచి …

Read More »

మంత్రి సోమిరెడ్డికి చుక్కలు చూపించిన రైతులు …

ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఈ రోజు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రంలో ప్రత్తిపాడు మండలంలో పత్తిపంటను పరిశీలించేందుకు వెళ్ళిన మంత్రిని రైతులు నిలదీశారు. ఈ క్రమంలో ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం, కోయవారిపాలెం గ్రామాల్లో గులాబీ బారిన పడి పత్తి పంటలు నాశనమైపోతున్నాయి. దీంతో మంత్రి సోమిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు, వ్యవసాయాధికారులు కలిసి పత్తిపంటను ఈ రోజు గురువారం ఉదయం పరిశీలించారు. …

Read More »

ఏపీ టీడీపీకి రాజధాని ప్రాంతంలో గట్టి ఝలక్ -మూకుమ్మడిగా రాజీనామాలు ..

ఏపీ అధికార పార్టీ టీడీపీ కి రాజధాని ప్రాంతంలోని గట్టి ఎదురుదెబ్బ తగిలింది .ఈ క్రమంలో రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కొద్ది నెలలుగా మాచర్ల మున్సిపల్‌ పాలకవర్గంలోని టిడిపి కౌన్సిలర్ల మధ్య నడుస్తున్న విభేదాలు తాజాగా తారాస్థాయికి చేరాయి. చైర్‌పర్సన్‌ నెల్లూరు మంగమ్మకు వ్యతిరేకంగా వైస్‌ చైర్‌పర్సన్‌ సహా 10 మంది టిడిపి కౌన్సిలర్లు నిన్న బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు పత్రాలను టీడీపీ నియోజకర్గ ఇన్‌చార్జి కొమ్మారెడ్డి …

Read More »

ఎమ్మెల్యేలపై సెటైర్లు వేస్తూ ఇజ్జత్ తీసిన చంద్రబాబు…

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిన్న బుధవారం ఆ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎంపీలు ,నేతలు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారన్న విషయమై సమీక్షించి.తను కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా సేకరించిన రిపోర్టు గురించి ప్రస్తావిస్తూ ఒక్కొక్క ఎమ్మెల్యేపై సెటైర్లు వేస్తూ వారికి చురకలు అంటించారు …

Read More »

జగన్ కోసం…1008 కొబ్బరికాయలు కొట్టి మొక్కు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు నవంబర్‌ 6వ తేదీ నుంచి చేపట్టనున్న ‘ప్రజా సంక ల్పం’ పాదయాత్రలో మొత్తం మీద రెండు కోట్ల మందికి చేరువ కావడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నానని వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఈ పాదయాత్రకు ‘ప్రజా సంకల్పం’ అని పేరు పెట్టారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి మహాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి …

Read More »

జగన్ కు పొంచి ఉన్న ప్రమాదం ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఆరో తారీఖున నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో ,మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించనున్న సంగతి విదితమే .నిన్న బుధవారం ఏపీలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జగన్ పాదయాత్రను ప్రస్తావిస్తూ జగన్ …

Read More »

టీడీపీలో అనుకూల “తమ్ముళ్ల” తోనే సింగపూర్‌ యాత్ర..

ఏపీలో అధికార పార్టీ టీడీపీకి చెందిన రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌ యాత్రకు తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మొత్తం రైతుల సంఖ్య 26 వేలు.. సింగపూర్‌ పర్యటనకు ఆసక్తి చూపించింది 123 మందే.. అందులో తొలి విడతగా 34 మంది రైతుల ఎంపిక.. వీరిలో టీడీపీ నేతలే అధికం.. మిగిలిన వారూ ఆ పార్టీ సానుభూతిపరులే రైతులతో సింగపూర్‌ యాత్రకు జెండా ఊపిన 24గంటల్లో ప్రభుత్వ బండారం బయటపడింది. అక్కడ …

Read More »

బాబును కలవడానికి వచ్చి ..విషం త్రాగి ..?

ఏపీ లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది .నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి సచివాలయం వద్ద ఒక హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ముఖ్యమంత్రిని కలిసేందుకు తనను అనుమతించాలని అక్కడి సిబ్బందిని కోరాడు. దీంతో సీఎం మంత్రివర్గ సమావేశంలో ఉన్నారని వారు చెప్పడంతో అక్కడికక్కడే విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్సనిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు కర్నూలు జిల్లా ఆదోని వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat