జబర్దస్త్ కమెడియన్ గాలిపటాల సుధాకర్ గౌరవ డాక్టరేట్ కు ఎంపికయ్యాడు. తమిళనాడు కొయంబత్తూర్ రాయల్ అకాడమీ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఐదు వేల ప్రదర్శనలు ఇచ్చినందుకుగాను సుధాకర్ కు డాక్టరేట్ గుర్తింపు ప్రకటించింది. ఈనెల (సెప్టెంబర్8)న దుబాయ్ లో జరుగనున్న ఓ కార్యక్రమంలో డాక్టరేట్ ను సుధాకర్ కు అందజేయనుంది యూనివర్సిటీ. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆర్టిస్ట్ సుధాకర్ జబర్దస్, పటాస్ …
Read More »నాపై జరుగుతున్న దుష్ప్రచారమంతా అబద్ధం-మాజీ మంత్రి దానం
తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ ఖండించారుతనపై సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు..తాను ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఎక్కడా కలువలేదని స్పష్టం చేశారు. తెలంగాణకు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని దానం తేల్చిచెప్పారు. తాను ఏ పదవి ఆశించకుండానే టీఆర్‌ఎస్‌లో చేరానని, పార్టీలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. కేసీఆర్ ఏ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని దానం …
Read More »బల్లగుద్ది మరీ చెప్తున్న అసలైన తెలుగుదేశం కార్యకర్తలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తు తాజాగా దేశ రాజకీయాల్లోనే వివాదాస్పదంగా మారుతోంది. తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయిన తర్వాతఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా కావాలని కోరుకుంటున్నారని టీటీడీపీ నేతలతో చంద్రబాబు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పొత్తుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుంటున్నాయి. …
Read More »చంద్రబాబూ.. దమ్ముంటే ఆపని చెయ్.. చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరిన కన్నా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో ప్రజల ముందుకు వచ్చి డ్రామా వేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పచ్చి అవకాశవాదని,విద్యాసంస్థలు, పరిశ్రమలు, రోడ్లకు నిధులు.. ఇలా అన్నీ కేంద్రం ఇచ్చినవే.రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరేం చేశారో దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయండి?’ అని సీఎం చంద్రబాబుకు కన్నా సవాల్ విసిరారు.2014 ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు …
Read More »గులాబీగూటికి చేరుతున్న కాంగ్రెస్ నేతలు.. ఆందోళనలో హస్తం పార్టీ నేతలు
గులాబీగూటికి చేరుతున్న కాంగ్రెస్ నేతలు…కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు గులాబీగూటికి చేరనున్నట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, కరీంనగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారని,కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ విషయాన్ని గులాబీల దృష్టికి తీసుకేళ్ళారని సమాచారం.అయితే వీరిద్దరూ కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న భాస్కర్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్‌లు జిల్లా, రాష్ట్రస్థాయిలో వివిధ పదవుల్లో కొనసాగారు. ఈ ముందస్తు ఎన్నికల సమయంలో …
Read More »విశాఖ వైఎస్ కంచుకోట అని నిరూపించిన కంచరపాలెం సభ.. బాబు సీఎం అయ్యాక 57హత్యలు జరిగాయి
విశాఖ నగరం జనసంద్రంతో ఉప్పొంగింది. వైయస్ జగన్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సభ వీక్షణకు నగరంలో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వైఎంసీఏ,గోకుల్ పార్కు, సీఎంఆర్, సెంట్రల్ పార్కు,శివాజీ పార్కు, ఏన్‌ఏడీ జంక్షన్,గాజువాక జంక్షన్‌లో భారీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. జిల్లా నలుమూలల నుంచి లక్షలాది ప్రజలు సభకు ఈసందర్భంగా కంచరపాలెం సభలో జగన్ మాట్లాడుతూ నాన్నగారి హయాంలో విశాఖ నగరం అభివృద్ధి బాటలో టాప్ గేర్ లో …
Read More »ఈటలకే మా ఓటు..రజకుల ఏకగ్రీవ తీర్మానం
వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామస్తులు అపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామానికి చెందిన సుమారు 400 మంది రజకులు హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి ఈటలను ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తంచేస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈటల చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తామంతా ఆకర్షితులయ్యామని ఆయనకు ఓట్లు వేసి భారీ …
Read More »కాంగ్రెస్‌కు ఝలక్…..టీఆర్‌ఎస్‌లోకి సీనియర్ నేత
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి పార్టీకి రాజీనామా చేయనున్నారు. 30 ఏళ్ళుగా రాజనాల శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.. గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అదే విధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్పోర్ట్స్ డైరెక్టర్‌గా పనిచేసారు. కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతమైన నాయకత్వ …
Read More »కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ లు…….ఆందోళనలో నేతలు
తెలంగాణ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ లు తగులుతునాయి. సీఎం కేసీఆర్ అకస్మాత్తుగా సభను రద్దు చేయడంతోపాటు అదే రోజు 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వెంటనే ప్రచారంలో దూసుకుపోతుండటంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు.వాస్తవానికి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. అయితే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పలు వేదికల ద్వారా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.దీనికి …
Read More »నేడు ఓటర్ల జాబితా…..
తెలంగాణ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న శాసనసభ ఎన్నికలకు సంబందించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సోమవారం ప్రారంభమవుతోంది. తెలంగాణ రాష్ట్ర తొలిశాసనసభ ఈ నెల 6న రద్దు కావడంతో ఎన్నికలు జరపాల్సి వస్తోంది. 2018 నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) రజత్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. ఓటర్ల జాబితా సవరణ కోసం ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం వెల్లడిస్తారు.2018, …
Read More »