టీఆర్ఎస్ కార్యనిర్వాహక అద్యక్షుడు కేటీఆర్ మరోసారి నటుడు రాంచరణ్‌తో వేదిక పంచుకోనున్నారు. మెగా ఫ్యామిలీ హీరో నటించిన ‘వినయ విధేయ రామ’ ట్రైలర్‌ను కేటీఆర్ చేతుల మీదుగా విడుదల చేయనున్న విషయాన్ని చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. గురువారం యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఇదే కార్యక్రమంలో కేటీఆర్ ట్రైలర్‌ను విడుదల చేస్తారు. డీవీవీ …
Read More »వైఎస్సార్సీపీలోకి వెళ్లనున్న ద్వితియ శ్రేణి న్యాయకత్వం..
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుల రాజకీయం చేస్తున్నారట.. ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివ రామరాజు కుల రాజకీయం చేస్తున్నారనేది ప్రధాన విమర్శ.. ముఖ్యంగా శివ రామరాజు బీసీలను అణగదొక్కుతున్నారని, దీనిని అరికట్టాలంటే బీసీలు ఏకమవ్వాలని నిర్ణయించుకున్నారట.. తాజాగా గౌడసంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కట్టా గంగాధరరావు ఇంట్లోరహస్య సమావేశాలు ఏర్పాటు చేసారట.. తెలుగుదేశం నుండి బయటకు వచ్చే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది.. టీడీపీ మండల …
Read More »3,000 కోట్లు పెట్టుబడులతో పీవీఆర్ సినిమాస్
నెట్ఫ్లిక్,హాట్ స్టార్,అమెజాన్ ప్రైమ్ లాంటి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్న కాలంలో…PVR దేశంలోనే అత్యధిక మల్టీప్లెక్స్ స్క్రీన్ లు కలిగిన సంస్థ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉంది. అజయ్ బిజ్లీ సారధ్యంలో నడుస్తున్న ఈ సంస్థ ఇప్పటికి దేశవ్యాప్తంగా దాదాపు 750 సినిమా స్క్రీన్లు కలిగి ఉన్నది. అయితే రానున్న మూడు నాలుగేళ్ళలో మరో 1000 సినిమా స్క్రీన్ లు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.ఈ సంస్థ సీఈఓ …
Read More »పవన్ గుర్తుపై శ్రీరెడ్డి సెటైర్లు..
సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయించింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన 2019 ఎన్నికలలో ఈ గ్లాస్ చిహ్నాంతో పోటీ చేయనుంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. వచ్చే సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీకి …
Read More »మా ఓట్లు టీఆర్ఎస్‌కే…దత్తాత్రేయ
భారతీయ జనతా పార్టీ ఎంపీ బండారు దత్తాత్రేయ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీపై గౌరవం ఉన్న సంప్రదాయ ఓటు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్‌ఎస్)కే పడిందన్నారు. ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు నిర్వహించిన సుదీర్ఘ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన దత్తాత్రేయ టీఆర్ఎస్ పార్టీ గెలుపు వెనుక పలు కారణాలు ఉన్నాయన్నారు. తమ సమీక్షలో అభ్యర్థులు చాలా విషయాలు చెప్పారని …
Read More »నేడు మోడీతో కేసీఆర్ భేటీ…అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసిఆర్ నేడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతున్నారు. సాయంత్రం 4 గంటలకు అపాయింట్ మెంట్ ఫిక్స్ అయ్యింది. రెండోసారి సీఎం అయిన తర్వాత తొలిసారి కలుస్తున్న కేసిఆర్, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపైనా చర్చించే అవకాశముంది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్‌లో భాగంగా కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో సమావేశమైన సంగతి తెలిసిందే. అంతకుముందు …
Read More »జీఎస్టీ గుడ్ న్యూస్…తగ్గనున్న ధరలు
వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) నుంచి ఎట్టకేలకు తీపికబురు రానుంది. జీఎస్టీ పన్ను విధానంలో మరిన్ని మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రజలపై పన్ను భారం అతి తక్కువగా ఉండేలా చేయాలనుకుంటోంది. చాలా వస్తువులపై అసలు పన్నే ఉండకూడదని, ఉన్నా గరిష్ఠంగా 5 శాతానికి మించకూడదని భావిస్తోంది. దేశంలో అంతిమంగా సున్నా- అయిదు శాతం పన్ను రేట్లే ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆకాంక్షించారు. జీఎస్టీ అమలుతో …
Read More »క్రిస్మస్ రోజున కల్యాణ్‌దేవ్, శ్రీజకు పండంటి ఆడశిశువు
క్రిస్మస్ రోజున కొణిదెల వారి కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ, కల్యాణ్‌దేవ్ దంపతులకు పండంటి ఆడశిశువు జన్మించింది. ఈ విషయాన్ని కల్యాణ్‌దేవ్ సోషల్‌మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. పాప కాలి ముద్ర ఉన్న ఫొటోను కల్యాణ్ దేవ్ షేర్ చేశారు. ‘2018 క్రిస్మస్ నా జీవితాంతం గుర్తుండి పోతుంది. మాకు ఇవాళ ఉదయం ఆడశిశువు పుట్టింది. మీ అందరికీ సూపర్ మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు’ …
Read More »ధోనీ వచ్చేసాడు…
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అనుభవానికే పెద్దపీట వేసింది. రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలకు పోకుండా జట్లను ఎంపిక చేసింది. సోమవారం సమావేశమైన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, టీ20 సిరీస్‌కు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. ఇటీవలి ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ధోనీని తప్పించిన సెలెక్షన్ కమిటీ తిరిగి జట్టులో చోటు కల్పించింది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 …
Read More »ఘనంగా క్రిస్మస్ వేడుకలు
క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రధానంగా డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ.క్రిస్టియన్ మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. క్రైస్తవ కేలండర్లో అడ్వెంట్ (పశ్చిమ క్రైస్తవం) లేక నేటివిటీ (తూర్పు క్రైస్తవం) ఉపవాస దినాల తర్వాత వచ్చే క్రిస్మస్, క్రిస్మస్ టైడ్ అని పిలిచే సీజన్ ఆరంభంగా నిలుస్తుంది. కొత్త నిబంధనలోని సంప్రదాయిక క్రిస్మస్ కథనం ప్రకారం, …
Read More »