ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లలో విజయవంతంగా కొనసాగుతూ నేడు 268వ రోజుకు చేరింది. ఈ రోజు ఉదయం భీమిలి నియోజకవర్గంలోని గండిగండం క్రాస్ నుండి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న దారిపొడవునా పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలంతా జగన్ తో పాటు అడుగులు వేస్తున్నారు. జననేత అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు …
Read More »నేడే బొజ్జ గణపయ్య నిమజ్జనం..
మహానగరంలో అతిపెద్ద సామూహిక వేడుక వినాయక శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది.11 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడిలోకి చేరేందుకు సిద్ధమయ్యాడు. గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లో ఇవాళ ఆ వేడుకకు మరోసారి రెడీ అయ్యింది.నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం పూర్తి చేసింది. ఆదివారం నగరం నలువైపుల నుంచి వైభవంగా ప్రారంభం కానున్న గణనాథుడి శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా …
Read More »బాలాపూర్ లడ్డూ రికార్డు ధర..
వినాయక నిమజ్జనం ఓ వైపు. మరోవైపు అందరి కళ్లు వేలం వైపు. ప్రతి ఏడాది బాలాపూర్ లడ్డూ వేలం రికార్డు స్థాయిలో కి చేరుతున్న విషయం తెలిసిందే. బాలాపూర్ గణేశుడి లడ్డూ భక్తులకు కొంగు బంగారమైన విషయం తెలిసిందే.బాలాపూర్ గణేషుని లడ్డూ ఈ ఏడాది రికార్డు ధర పలికింది.ముందుగా రూ. 1,116 లతో వేలం పాట ప్రారంభమైంది. ఆ తర్వాత వేలం పాట ధర పోటా పోటీగా కొనసాగింది. చివరకూ …
Read More »కర్నూల్ జిల్లాలో ‘రావాలి జగన్-కావాలి జగన్’
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘రావాలి జగన్– కావాలి జగన్’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రమంతటా ఉత్సాహంగా సాగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల ప్రయోజనాలను పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలకు సవివరంగా తెలియజేస్తున్నారు. ఈ పథకాలతో వివిధ వర్గాల ప్రజలకు కలిగే మేలును వివరిస్తున్నారు. కర్నూల్ జిల్లాలో శనివారం పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ …
Read More »వైఎస్ జగన్ యాత్ర @3000….
ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. తాజాగా ఈ యాత్ర లో భాగంగా వైస్ జగన్ 11 జిల్లాలు పూర్తి చేసుకుని 12 వ జిల్లలో అడుగుపెట్టబోతున్నారు. ఈ యాత్ర ద్వారా ఇప్పటికే 2000 మైళ్ళ మైలు రాయిని అందుకున్నాడు. మరో రెండు రోజుల్లో 3000 మైళ్ళు పుర్తిచేసుకోనున్నారని బొత్స సత్యనారాయణ మీడియాతో వెల్లడించారు. వైఎస్ …
Read More »డీఎస్సీ నోటిఫికేషన్ మరో వారం రోజుల్లో……
ఏపీలో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆర్థిక శాఖ 18,450 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీచేసింది. అందులో ఉపాధ్యాయ పోస్టులతోపాటు, గ్రూప్స్, పోలీసు, ఇతర ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు డీఎస్సీ నియామక పోస్టుల భర్తీకి మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖమంత్రి ఘంటా శ్రీనివాసరావు తెలిపారు. నియామకాలను ప్రతిభ ఆధారంగా, ఇంటర్వూలు లేకుండా, చేపట్టనున్నట్లు తెలిపారు. …
Read More »జనం నెత్తిన కుంపటి..సెట్‌టాప్ బాక్సుల పేరుతో అప్పుల భారం
ఇంటింటికీ సెట్‌టాప్ బాక్సుల పేరుతో రాష్ట్రంలోని ప్రతి ఇంటిపైనా టీడీపీ సర్కారు మరోసారి అప్పుల భారం మోపింది. పది లక్షల సెట్‌టాప్ బాక్సుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే రెండు విడతలుగా రూ.711 కోట్ల అప్పునకు గ్యారెంటీ ఇచ్చింది. తాజాగా 68 లక్షల సెట్‌టాప్ బాక్సుల కొనుగోలు కోసం ఏకంగా రూ.3,283 కోట్ల అప్పు చేసేందుకు గ్యారెంటీ ఇస్తూ ఈనెల 10వ తేదీన జీవో 27 జారీ చేసింది. అయితే …
Read More »చంద్రబాబుపై కెసీఆర్ ‘బిగ్ బాంబ్’!
ఓటుకు నోటు కేసులో రంగంలోకి దిగనున్న ఈడీ.ఆ ‘ఐదు కోట్ల’పై తేల్చాలంటూ ఈడీతో సహా కేంద్ర సంస్థలకు పోలీసు ఉన్నతాధికారుల లేఖ.తెలంగాణ ముందస్తు ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుపై పెద్ద బాంబు పడనుంది.ఎలా అంటే ఓటుకు నోటు కేసుకు సంబంధించి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్ధికి అనుకూలంగా ఓటువేస్తే ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని మాట్లాడుకున్నారు. అందులో భాగంగా 50 లక్షల …
Read More »కేసీఆర్ నాయకత్వంలో సెంచరీ కొడతాం…….
‘మా కెప్టెన్ కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ పార్టీ తప్పకుండా సెంచరీ కొట్టబోతోంది. ఉద్యమ సమయంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్‌తో నడిచి వెన్నంటే ఉన్నారు. ప్రజల ఆశీర్వాదం మాకుంది.ఈ నాలుగేళ్లలో కేసీఆర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. అభివృద్ధి పురోగతిలో ఉంది.తెలంగాణ అనే కారు మంచి కండిషన్లో ఉంది.. దూసుకుపోతోంది. కారు డ్రైవర్‌ను ప్రజలు మార్చరన్న విశ్వాసం నాకు ఉంది’’అని రాష్ట్ర పరిశ్రమలు, …
Read More »మాధవ్ నన్ను బెదిరించే పెద్ద మనిషా.. సాయి కుమార్ అనుకొంటున్నావా….జేసీ
తాడిపత్రి ప్రబోధానంద ఆశ్రమ వివాద సమయంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారులు మండిపడ్డారు. జేపీ వ్యాఖ్యలు పోలీసుల్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. రాజకీయ నేతలైనా, ఎవరైనా పోలీస్ వ్యవస్థని కించపరిచి మాట్లాడితే నాలుక కోస్తామంటూ కదిరి సీఐ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. ఆయన జేసీ దివాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, …
Read More »