‘సూరీ… వ్యక్తిగత స్వార్ధం కోసం నీచ రాజకీయాలు చేయడం మానుకో.. గత ఐదేళ్లలో వ్యవస్థలను నిర్వీర్యం చేశావు.. అంతులేని అవినీతి చేశావు. నీ అవినీతిపై విచారణను తప్పించుకునేందుకు ధర్మవరంలో అలజడులు సృష్టిస్తున్నావు.. పోలీసులు, అధికారులపై రాళ్లతో దాడులు చేయించి విధ్వంసానికి కుట్రపన్నుతున్నావు. నిరాధార ఆరోపణలు చేసి బురద జల్లాలని చూస్తే సహించేది లేదు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే …
Read More »పెద్దలు చేసిన పెళ్లి..సరిగ్గా నాలుగు నెలలే అంతలోనే పక్కింటి కుర్రాడితో
పెద్దలు చేసిన వివాహం.. పెళ్ళయి సరిగ్గా నాలుగు నెలలే. అంతలోనే పక్కింటి కుర్రాడితో పరిచయం. నిత్యం బిజీ ఉద్యోగంలో భర్త. ఇంకేముంది యువకుడితో శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత చివరకు కటాకటాల పాలైంది. నెల్లూరుకి చెందిన రామారావుకు అదే ప్రాంతానికి చెందిన సుగుణకు నాలుగునెలల క్రితం వివాహమైంది. రామారావు స్థానికంగా ఉన్న ఒక సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేసేవాడు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకే ఆఫీస్‌కు వెళ్ళి రాత్రి …
Read More »ఏపీ అటవీ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!
అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 2,600 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదం తెలిపారని ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే కంపా నిధులు రూ.323 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో 23 శాతం మాత్రమే అడవులు ఉన్నాయని.. కేంద్ర చట్టాల మేరకు 33 శాతం పచ్చదనం ఉండాలని అన్నారు. అయితే రాష్ట్రంలో పచ్చదనం …
Read More »ఏపీలో నిరుద్యోగుల తలరాత మారినట్టే..భారీ నోటిఫికేషన్
ఏపీ నిరుద్యోగులకు ఏపీ సర్కార్ తీపికబురు చెప్పింది. ఇదివరకు ప్రకటించినట్టుగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతోంది. అయితే ఇప్పటికే పోస్టుల భర్తీకి అన్ని విధాలుగా గ్రీన్ సిగ్నల్ లభించడంతో నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేందుకు అదికారులు సిద్దమౌతున్నారు. ఇప్పటికే ప్రతి గ్రామ పంచాయితీని సచివాలయంగా మార్చి అక్కడ దాదాపు 10 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. అలా రాష్ట్రం మొత్తం దాదాపు 1.27 లక్షల మందికి ఉద్యోగాలు …
Read More »వైఎస్ వివేకా హత్య కేసులో టీడీపీ నేతకు నోటీసులు
కడప జిల్లా మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో టీడీపీ నేత వర్ల రామయ్యకు సిట్ నోటీసులు పంపింది. ఇటీవల వర్ల రామయ్య తరచుగా వివేకా హత్యపై వ్యాఖ్యలు చేస్తూ దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆయన ఏ ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారో తెలుసుకోవాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. అందుకే, సీఎఆర్పీసీ 160 కింద వర్ల రామయ్యకు నోటీసులు పంపారు. సాక్ష్యాలతో సహా సిట్ ఎదుట …
Read More »కర్నూల్ టౌన్ లో పట్టపగలే దారుణ హత్య
కర్నూల్ టౌన్ లోపి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం పట్టపగలే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలి భర్త తెలిపిన వివరాలు.. స్థానిక ఎల్కూరు ఎస్టేట్‌లోని రెవెన్యూ కాలనీలో వెంకటేశ్వరరెడ్డి, చంద్రకళావతి (50) దంపతులు ఇల్లు నిర్మించుకుని, ఏడాది కాలంగా అక్కడే నివాసం ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు ఉద్యోగ రీత్యా పూనేలో ఉండగా, వెంకటేశ్వరరెడ్డి డోన్ ఐటీఐ కళాశాలలో పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయంఅతడు డోన్‌కు బయలుదేరి …
Read More »చిదంబరానికి మరోసారి గట్టి ఎదురుదెబ్బ.. ఉక్కిరి బిక్కిరి
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో అరెస్ట్ అయ్యి నెల రోజులకు పైగా (సెప్టెంబరు 5) తీహార్ జైల్లో గడుపుతున్న చిదంబరానికి బెయిల్ విషయంలో ఢిల్లీ సీబిఐ కోర్టులో ఊరట లభించలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆయనను రేపు (బుధవారం) ఈడీ అధికారులు అరెస్ట్ చేయనున్నారు. …
Read More »ఆ హీరో అభిమానికి దిల్ రాజు ఏడు లక్షల సాయం
టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ అభిమానికి నిర్మాత దిల్ రాజు ఏడు లక్షల సాయం అందచేసి వారి హృదయాల్లో హీరో అయ్యాడు. ఇటీవల ప్రభాస్ నటించిన సాహో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ రోజు మహబూబ్ నగర్ తిరుమల థియేటర్ వద్ద ప్లెక్సీల ఏర్పాటు చేస్తూ ప్రమాదవశాత్తు ఓ అభిమాని కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తెలుసుకున్న చిత్ర బయ్యర్..థియేటర్ యజమాని అయినా దిల్ రాజు …
Read More »నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు జగనన్నకు సైనికుడిగానే ఉంటా..!
‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. మంగళవారం నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రైతు భరోసా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. రైతు భరోసా చెక్కులు అందించిన తర్వాత ఏర్పాటు చేసి బహిరంగసభలో సీఎం వైఎస్ జగన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. రైతు భరోసా కార్యక్రమం ప్రారంభోత్సవంలో అనిల్‌కుమార్‌యాదవ్ ఉద్వేగంగా మాట్లాడారు. ‘మన జిల్లాలో …
Read More »అనంతలో రైల్వే పట్టాలపై 4 మృతదేహాలు..ఆత్మహత్య చేసుకున్నారా లేక.. ఎవరైనా హత్య
అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. మంగళవారం నాలుగు మృతదేహాలు హిందూపురం-దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్యలో చెల్లాచెదురుగా పడిఉన్నాయి. స్థానిక వివరాల మేరకు.. హిందూపురం దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్యలో రైల్వే పట్టాలపై ఈ రోజు ఉదయం 4 మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలలో ఒక మృతదేహం మహిళదిగా గుర్తించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా లేక.. ఎవరైనా …
Read More »