యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తండ్రి నార్నె శ్రీనివాసరావుపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన స్టూడియో ఎన్ ఛానల్ కార్యాలయంలో సోదాలు చేశారు. ఎన్నికలకు ముందు నార్నె శ్రీనివాసరావు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. మేఘా కృష్ణారెడ్డిపై ఐటీ దాడులు జరిగిన రోజుల వ్యవధిలోనే నార్నె శ్రీనివాసరావుపై కూడా దాడులు జరగడం గమనార్హం.
Read More »భారీ ఆఫర్..ఐదు పైసలకే బిర్యానీ..హోటల్ ఎక్కడో తెలుసా
ఒక హోటల్ పెట్టిన ఆఫర్ కు ఊహించని రీతిలో భారీ స్పందన వచ్చిందట. తమిళనాడులోని దిండుక్కల్ కు చెందిన హోటల్ లో ఈ అదిరే ఆఫర్ పెట్టారు. అయితే.. ఒక కండిషన్ పెట్టారు. తాము పెట్టిన ఆఫర్ ను దక్కించుకోవాలంటే పాత కాలం నాటి ఐదు పైసల నాణెం తీసుకురావాలని.. అది కూడా మొదట వచ్చిన వందమందికి మాత్రమే ఇస్తామన్నారు. బ్యానర్ కట్టి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం …
Read More »చంచల్‌గూడ జైలులో ఉన్న రవిప్రకాశ్‌పై మరో కేసు..!
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదయింది. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఆయన నకిలీ ఐడీ సృష్టించడంతో సీసీఎస్ పోలీసులు 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఓ వెబ్ ఛానెల్స్‌లో తనపై ఆసత్య ప్రచారాలు చేస్తున్నారని హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేయడంతో… రవిప్రకాశ్ మీడియా హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు …
Read More »మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి షాక్.. ట్రావెల్స్ బస్సులు సీజ్
అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి రవాణా అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 23 జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ బస్సులను ఏపీ అధికారులు సీజ్ చేశారు. కమీషనర్ సీతారామాంజినేయులు, జాయింట్ కమీషనర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో భారీగా తనిఖీలు ,సోదాలు నిర్వహించారు. జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్‌కు చెందిన 23 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లనూ …
Read More »టీటీడీ బోర్డు సభ్యుడిగా ప్రమాణస్వీకారం..!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా బెంగళూరుకు చెందిన రమేష్ శెట్టి ప్రమాణ స్వీకారం చేశారు… కుటుంబసభ్యులతో కలిసి ముందుగా శ్రీవారిని దర్శించుకున్న ఆయన చేత ఆలయంలోని గరుడాళ్వార్ మండపంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు, అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా నూతన సభ్యుడికి స్వామి వారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు ధర్మారెడ్డి అందజేశారు.
Read More »ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులు గదిలో..టీచర్ షాక్
ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో మద్యంతో విద్యార్థిని పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఇది చూసిన ఉపాధ్యాయుడు వారిని మందలించాడు. దీంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. తమిలనాడులోని సేలం ఇడైపట్టి విద్యాజోన్‌కు చెందిన ఓ ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో 1,500 మంది విద్యార్థినులు చదువుతున్నారు. మంగళవారం ఉదయం అబ్దుల్ కలాం జయంతిని జరుపుకున్నారు. అనంతరం ప్లస్‌టు చదువుతున్న ఓ విద్యార్థిని మంగళవారం పుట్టిన రోజు కావడంతో …
Read More »వైఎస్ జగన్ దెబ్బకు గజగజ వణుకుతున్న టీడీపీ
ఎన్నికల ముందు పాదయాత్రలో హామీ ఇచ్చినట్లుగా ఒక్కొక్క పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల్లోకి విజయవంతంగా తీసుకువెళ్తున్నారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. పథకాలు అమలవుతూ క్షేత్రస్థాయిలో అందరికీ చేరుతుండటంతో చంద్రబాబు వెన్నులో వణుకుపుడుతోందని బుధవారం ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. పథకాల ఫలాలు లబ్ధిదారులకు చేరుతుండటంతో చంద్రబాబుతో పాటు ఆయన మోచేతులు నాకే బృందానికి గుండెదడ పెరిగి పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పథకాలపై ప్రజల నుండి …
Read More »ఏపీలో మరో భారీ పరిశ్రమ..10వేల ఉద్యోగాలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటైన మాంబట్టులోని అపాచీ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్), విశాఖపట్నంలోని బ్రాండిక్స్ సెజ్ తరహాలోనే వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించే మరో సెజ్ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్‌మెంట్ సంస్థ భారీ పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అట్లనాగులూరు గ్రామంలో 298 ఎకరాల్లో దాదాపు రూ.700 కోట్ల (100 …
Read More »సినిమా థియేటర్లలో శ్రీముఖి యాడ్స్..సోషల్ మీడియాలో ఏమంటున్నారో తెలుసా
బిగ్‌బాస్ షోలో అందంతో హాల్ చల్ చేసున్న శ్రీముఖి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బిగ్‌బాస్ టైటిల్ కోసం వేట మొదలు పెట్టిన శ్రీముఖి ఎలాగైనా టైటిల్‌ను తన్నుకుపోవాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఆమెకు మద్దతుగా వినూత్న క్యాంపెయిన్ జరుగుతోంది. ఓట్ ఫర్ శ్రీముఖి అంటూ సినిమా థియేటర్లలో ఎక్కడ చూసినా శ్రీముఖి యాడ్స్ ప్రత్యక్షమవుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీముఖి.. తనకు ప్రచారం …
Read More »విశాఖ పట్నం నడిబొడ్డున ఆంద్రజ్యోతి భూమిపై వైఎస్ జగన్ సంచలన నిర్ణయం
గత చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా ఆమోదా పబ్లికేషన్ సంస్థ అంటే ఆంద్రజ్యోతి మీడియాకు విశాఖ పట్నం నడిబొడ్డున పరదేశీపాలెంలో ఎకరంన్నర భూమిని కేటాయించిందని, అది పూర్తిగా అవసరం లేని కేటాయింపు అని ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం అబిప్రాయపడింది.సుమారు 40 కోట్ల విలువైన భూమిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ మీడియాకు గత ప్రభుత్వం కేవలం ఏభై లక్షల ఐదువేల రూపాయలకే కేటాయించారని ,దానిని రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని …
Read More »