టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం వెళుతున్న ఆయనను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. జేసీతో పాటు యామిని బాల, బీటీ నాయుడును అరెస్ట్ చేసి, అరగంట అనంతరం వారందరిని వాళ్ల ఇళ్ల వద్ద వదిలిపెట్టారు. కాగా కొన్నిరోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-టీడీపీ …
Read More »పల్లె వెలుగు బస్సులో పాము..ప్రయాణికులు కేకలు..డ్రైవరు ఏం చేశాడో తెలుసా
బస్సులో పాము దూరి ప్రయాణికులందరినీ వణికించింది. ముచ్చెమటలు పట్టించింది. మంగళవారం కడపలో ఈ సంఘటన జరిగింది. ప్రొద్దుటూరు నుంచి కడపకు ఉదయం ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు బస్సు బయలు దేరింది. అప్పటికే ఆ బస్సు ఇంజిన్ భాగంలో ఓ పాము దాగి ఉంది. డ్రైవరుతో సహా ఎవరూ ఈ విషయం గమనించలేదు. ఇంజిన్ వేడికి తాళలేక వినాయక నగర్ సర్కిల్‌లోకి రాగానే అది కాస్తా కొంచెం పైకి వచ్చేసింది. …
Read More »ట్రైనీ ఐపీఎస్ అధికారిపై వేధింపుల కేసు..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేష్ రెడ్డి తనను మోసం చేశాడని భావన అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడపకు చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేష్ రెడ్డికి తనకు ఏడాది క్రితం వివాహం అయిందని, తాజాగా ఐపీఎస్‌కు ఎంపిక కావడంతో తానెవరో తెలీదని చెబుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మహేష్‌తో పరిచయం ఏర్పడిందని.. ఆ తర్వాత ఇద్దరం మంచి స్నేహితులమయ్యామని ఆమె తెలిపారు. …
Read More »మరోసారి లారెన్స్ గొప్ప నిర్ణయం..!
క్రొరియోగ్రాఫర్ గా చిత్ర సీమలో అడుగుపెట్టిన రాఘవ లారెన్స్..ఆ తర్వాత నటుడి గా డైరెక్టర్ గా నిర్మాత గా ఇలా తనలోని కోణాలను బయటపెట్టి సక్సెస్ అయ్యాడు. ఆలా సంపాదించిన డబ్బుతో ఎంతోమంది కుటుంబాలను ఆదుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఈరోజు తన పుట్టిన రోజు ఈ సందర్భాంగా గొప్ప నిర్ణయాన్ని తీసుకొని మరోసారి అందర్నీ ఆకట్టుకున్నాడు. తమిళనాడులో ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిన చిన్నారి సుజిత్ విల్సన్ మృతిచెందిన సంగతి …
Read More »పుల్వామాలో మరోసారి ఉగ్రవాదులు కాల్పులు..!
జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా దళాల పెట్రోలింగ్ పార్టీపై మంగళవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలపై దాడికి పాల్పడిన అనంతరం ఉగ్రవాదులు పరారయ్యారు. పెట్రోలింగ్ పార్టీపై దాడులకు తెగబడిన ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు ఆ ప్రాంతాన్ని సైన్యం జల్లెడపడుతోంది. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. కాగా, జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ట్రక్ డ్రైవర్‌ను కాల్చిచంపిన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టిన కొద్దిసేపటికే పుల్వామా ఉగ్ర …
Read More »కేంద్ర సర్వీసుల్లో ఐఏఎస్ ఆమ్రపాలి
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిణిగా పనిచేస్తున్న యంగ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కేంద్ర సర్వీసుల్లో పనిచేయనున్నారు. డిప్యూటి కార్యదర్శిగా ఢిల్లీలోని కేబినెట్ సెక్రటేరియట్‌లో ఆమెను కేంద్రం డిప్యుటేషన్‌పై నియమించింది. ఆమ్రపాలి తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. వికారబాద్ సబ్ కలెక్టర్‌గా రంగారెడ్డి జిల్లా జెసిగా సేవలందించారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత తెలంగాణలో ఆమ్రపాలి పదోన్నతిపై వరంగల్ అర్భన్ కలెక్టర్‌గానూ సేవలందించారు.
Read More »బిగ్ బాస్ టైటిల్ విన్నర్..అభిమానులు ఎక్కవగా ఉన్నది ఒక్కరికే
తెలుగు టీవీ ప్రేక్షకులను 90 రోజులకు పైగా ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 ఈ వారంలో ముగియనుంది. ఈ సందర్భంలో సీజన్ 3 ఫైనల్ ని చాలా ఘనంగా జరపాలని షో నిర్వాహకులు ఇప్పటికే భారీగా ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో సీజన్ 3 టైటిల్ విన్నర్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ టోపీ అందించడానికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా …
Read More »ప్రభాస్ ను పెళ్లాడతాను.. టాలీవుడ్ టాప్ హీరోయిన్
దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన కాజల్ అగర్వాల్… ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.టాలీవుడ్ తో పాటు తమిళం, హిందీ సినిమాల్లో కూడా బిజీగా ఉంటోంది. దాదాపు 10 ఏళ్ళకు పైగా హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంటోంది అందాల చందమామ. తాజాగా మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ అనే కార్యక్రమంలో కాజల్ పాల్గొంది. ఈ …
Read More »ఒకరితో నెల తప్పి..అబార్షన్ కోసం మరోకరిని సాయం అడిగి అతడితో శృంగారం
అడ్డమైన తిరుగుళ్లు వద్దన్న తల్లిని చంపి ఇద్దరు ప్రియుళ్లతో శృంగారంలో మునిగిన కసాయి కూతురు కేసు కొత్త మలుపు తిరిగింది. బాలరెడ్డి అనే యువకుడిని ప్రేమించిన కీర్తిని అతడికిచ్చి పెళ్లి చేయాలన్న నిర్ణయం జరిగింది. అయితే వేరొకడితో శృంగారం నెరపడంతో నెల తప్పి కడుపు తెచ్చుకుంది. దీంతో శరత్ అనే మరో యువకుడిని అబార్షన్ కోసం సాయం కోరింది. తరువాత అతడితో ప్రేమ వ్యవహారం నడిపింది. ఈ విషయాలు తెలిసి …
Read More »కేంద్ర వాతావరణ శాఖ ప్రకటన..రాయలసీమలో భారీ నుండి అతి భారీ వర్షాలు
ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణ శాఖ కేంద్రం ప్రకటించింది. సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల రాగల 24గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, దక్షిణ కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాయలసీమ లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఉరుములు, …
Read More »